అమిత్‌షా పర్యటనతో ఏం ఒరిగింది: పోతిన మహేష్‌ | YSRCP Leader Pothina Mahesh Slams AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అమిత్‌షా పర్యటనతో ఏం ఒరిగింది: పోతిన మహేష్‌

Published Mon, Jan 20 2025 12:11 PM | Last Updated on Mon, Jan 20 2025 12:30 PM

YSRCP Leader Pothina Mahesh Slams AP CM Chandrababu Naidu

సాక్షి,విజయవాడ:అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌కు వస్తే వరాల జల్లు కురిపిస్తారని అందరూ ఊహించారని, అయితే అది జరగలేదని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత పోతినమహేష్‌ విమర్శించారు. మహేష్‌ సోమవారం(జనవరి20) ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.

‘అమిత్ షా రాకను చంద్రబాబు ఏ విధంగా ఉపయోగించుకున్నారో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్,కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలో ఉంది. అమిత్ షాతో రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చించి ప్రకటన చేయించి ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 8వేల కోట్లు ఉన్నాయి. వీటిని తీసుకురావడానికి వైఎస్‌ జగన్‌ కృషి చేశారు. కృష్ణా జలాల అంశంపై కనీసం మాట్లాడలేదు. రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై మాట్లాడడంపై మానేసి వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్యాకేజీపై కార్మికసంఘాలు,ప్రజలకు అనుమానాలున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నిలపివేస్తున్నామని,సెయిల్ లో కలుపుతున్నామని అమిత్‌షాతో ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు. అమిత్ షా పర్యటనతో రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? చంద్రబాబు నివాసం అక్రమనిర్మాణం కాదా? వరదల్లో మునిగిపోలేదా?ఇటువంటి విషయాలు అమిత్ షాకి చూపించాల్సింది.

వైఎస్‌ జగన్‌పై అబద్దపు ప్రచారాం ఎంతకాలం చేస్తారు. ఇది మంచిపద్దతి కాదు. చంద్రబాబు హైదరాబాద్‌లో కట్టుకున్న ప్యాలెస్‌లోకి ఏ కార్యకర్తనైనా తీసుకుని వెళ్లాడా?కనీసం ప్రవేశం ఉందా? వైఎస్‌ జగన్‌ తాడేపల్లి ఇంట్లోనే పార్టీ కార్యక్రమాలు,సమావేశాలు జరుగుతున్నాయి. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ అంశంపై అమిత్‌ షా స్పందించలేదు. అమరావతిలో 5ఎకరాలు భూమి కొన్నారు.ఈ అంశంపై అమిత్‌ షా మాట్లాడడలేదు.

రుషికొండ భవనాలపై విష ప్రచారం చేస్తున్నారు. పవన్‌కి ఒక్కడికే బాబు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. వైఎస్‌జగన్‌ సామాజిక న్యాయం చేసి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు  ఇప్పుడు లోకేష్‌కే కాదు.బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయం చేస్తే బాబు సామాజిక మోసం చేశారు.

పవన్ కళ్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి అమిత్ షా రెకమెండ్ చేస్తే ఇచ్చారని ట్విటర్‌లో పెట్టారు.  బాబు సామాజిక మోసంపై తెలుగుదేశం,జనసేన కార్యకర్తలు మాట్లాడాలి. 30లక్షల మంది పేదవారికి సొంతింటి కలను నేరవేర్చాడం విధ్వంసకర పాలన అంటారా?ప్రజలకు పరిపాలన దగ్గర చేసేందుకు గ్రామవార్డు సచివాలయాలు పెట్టడం విధ్వంసకర పాలన అంటారా? విద్యా,వైద్య రంగాలను అభివృద్ది చేస్తే విధ్వంసకర పాలన అంటారా?హర్బర్లు,పోర్టులు,మెడికల్ కాలేజీలు పెట్టి అభివృద్ది చేయడం విధ్వంసకర పాలన అంటారా’అని మహేష్‌ ప్రశ్నించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement