Pothina Mahesh
-
ఆంధ్రాలో ఐదు నెలల అలజడి పోతిన మహేష్ కౌంటర్
-
ఏపీలో ఉచితం వంకతో వీర బాదుడు.. ఒక్క గ్యాస్ సిలిండర్ భారమే 14వేల కోట్లు!!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు, పవన్ దీపావళి బాదుడు మామూలుగా లేదు.. వీరబాదుడు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పవన్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుందని చెప్పుకొచ్చారు.తాజాగా పోతిన మహేష్ ట్విట్టర్లో వీడియోలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు ఇది వీరబాదుడు.దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం 1 కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతున్నారు.సబ్సిడీ మీద మూడు సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ 20 సిలిండర్ల డబ్బులు మహిళల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.కరెంటు బిల్లు పెంచం అని వాగ్దానాలు చేసి, సంపద సృష్టిస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పుడు కరెంటు బిల్లు పెంచి పేదవాళ్లకు కరెంటు షాక్ కొట్టిస్తున్నారు.మూడు ఉచిత సిలిండర్లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రూ.2685 కోట్లు. ఎడమ చేత్తో సబ్సిడీ ఇచ్చి, కుడి చేత్తో విద్యుత్ చార్జీలు పెంచి బ్యాలెన్స్ చేసే ప్రతిభ చంద్రబాబుకే సొంతం. యూనిట్ రేటు పెంపు వలన ఇదే నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం 17,072 కోట్లు.సూపర్ సిక్స్‌లోని ఒక పథకం అమలు చేస్తూ ప్రజలపై వేసిన అదనపు భారం 14,378 కోట్లు. ఎలాగంటే..(విద్యుత్ చార్జీల పెంపు, సర్దుబాటు వలన అదనపు భారం 17,072 కోట్లు-రూ.2685కోట్లు=14,378 కోట్లు)రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య సుమారు కోటి యాభై లక్షలు. కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నది మాత్రం తెల్ల రేషన్ కార్డులున్న పది లక్షల కుటుంబాలలోపు మాత్రమే.. ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? దగా చేయడం కాదా? వెన్నుపోటు కాదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గార్ల దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు ఇది వీరబాదుడు.@JaiTDP @JanaSenaParty@BJP4India దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం 1 కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతున్నారు.సబ్సిడీ మీద 3 సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు… pic.twitter.com/n44gAeFrCz— Pothina venkata mahesh (@pvmaheshbza) October 31, 2024 -
మీ రాజకీయ పొత్తుల కంటే తక్కువైపోయారా బీసీలు?
-
‘మీ రాజకీయ పొత్తుల కంటే బీసీలు తక్కువైపోయారా చంద్రబాబూ?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. ‘‘జనాభాలో సగం, తెలుగుదేశంతో మనం.. ఇదీ ఎన్నికలకు ముందు మీరు బీసీల ఓట్ల కోసం చేసిన కాంపెయిన్ స్లోగన్. దీన్ని బేస్ చేసుకునే బీసీలకు రక్షణ చట్టం అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక జనాభాలో సగం బీసీలను మర్చిపోయారా? లేక బీసీలు సగం కన్నా తక్కువైపోయారా?’’ అంటూ పోతిన మహేష్ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘జనాభాలో సగం అని మీరే చెప్పిన బీసీలకు ప్రభుత్వంలో మీరిచ్చిన పదవులెన్ని? టీటీడీలో గతంలో అనుసరించిన సంప్రదాయాన్ని అనుసరించి బీసీలకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారా లేదా?. ఒకప్పుడు మీరు తీసుకొచ్చిన రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇప్పుడు ఒక్కటికే ఎందుకు పరిమితం చేశారు?. మీ రాజకీయ పొత్తుల కంటే తక్కువైపోయారా బీసీలు?. బీసీ సామాజిక వర్గం వారు రాజీనామా చేసిన రాజ్యసభ సీట్లను బీసీలకే కేటాయించాలి. బీసీలను నెత్తిన పెట్టుకోనక్కర్లేదు. కనీసం సమానంగా చూడండి చాలు.’’ అని పోతిన మహేష్ ట్వీట్ చేశారు.చంద్రబాబు నాయుడు గారు @AndhraPradeshCM బీసీలకు మంచి చేస్తారా? మోసం చేస్తారా?జనాభాలో సగం తెలుగుదేశంతో.@JaiTDP మనం ఇది ఎన్నికలకు ముందు మీరు BC ల ఓట్లకోసం చేసిన కాంపెయిన్ స్లోగన్. దీన్ని బేస్ చేసుకునే BC లకు రక్షణ చట్టం అని హామీ ఇచ్చారు.అధికారంలోకి వచ్చాక జనాభాలో సగం బీసీ లను… pic.twitter.com/b7UmnbSTbC— Pothina venkata mahesh (@pvmaheshbza) October 14, 2024 ఇదీ చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’ -
బాబూ.. 368కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయి: పోతిన మహేష్
సాక్షి, విజయవాడ: విజయవాడలో బుడమేరు వరద కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు వందల కోట్లు మిగిల్చిందన్నారు వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. అలాగే, వరద బాధితుల కోసం దేవస్థానాల నుంచి భోజనాలు పెడితే 368 కోట్ల రూపాయలు ఏ పందికొక్కులు తిన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. బుడమేరు వరదతో విజయవాడ ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలితే.. కూటమి నాయకులకు, చంద్రబాబుకి కోట్ల రూపాయలు మిగిలాయి. చంద్రబాబుకి వందల కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరుకు వరద వచ్చింది. చంద్రబాబుకి ఒక పక్క ఫోటో షూట్స్.. మరోపక్క విరాళాల వరద వచ్చింది. బుడమేరు, చంద్రబాబు మిలకత్ అయ్యారు. బుడమేరు వరద చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి వందల కోట్లు మిగిల్చింది.వరదలో వందల కోట్లు ఖర్చు చేశారంట. పునరావాసం కోసం కోటి 40 లక్షలు ఖర్చు చేశారు. రూ.368 కోట్లు ఫుడ్ కోసం ఖర్చు చేశారు. బాధితులకు నష్ట పరిహారం 200 కోట్లు ఇవ్వలేదు. కానీ ఫుడ్ పేరుతో పందికొక్కుల్లా తిన్నారు. వరద బాధితులకు ఆహారం అమ్మవారు ఇచ్చారు, ద్వారక తిరుమల, సింహాద్రి అప్పన్న నుండి వచ్చింది. దేవుడు భోజనాలు పెడితే 368కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయి. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.రూ.26కోట్లతో వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామని చెప్పారు. ఆరు లక్షల మంది వరదలో ఉంటే కోటిన్నర ఎవరికి ఇచ్చారు. వైఎస్ జగన్ కోటి రూపాయలతో వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్స్ ఇచ్చారు. గుక్కెడు మంచి నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రూ.52కోట్లు శానిటేషన్ కోసం ఖర్చు చెప్పారు. ఎక్కడ ఖర్చు పెట్టారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టాల కోసం 23 కోట్లు ఖర్చు చేశారు. డ్రోన్స్ కోసం రెండు కోట్లు ఖర్చు అయింది. సరిగ్గా 10 మందికి కూడా ఆహారం అందించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డ్రోన్స్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు ఫోటో వదిలారు. దానికి రెండు కోట్లు. 534 కోట్లకు టెండర్ వేశారు. వచ్చిన విరాళాలకు ఖర్చులు చూపించారు. ఎవరికి కాంట్రాక్టు ఇచ్చారో.. ఎంతకీ ఇచ్చారో లెక్కలు బయటపెట్టాలి. నష్ట పరిహారం చెల్లించారా?. నష్ట పరిహారం కోసం ప్రజలు రోడ్డెక్కితే లాఠీ ఛార్జ్ చేశారు.కలెక్టర్ వద్ద బాధితులు క్యూ కడుతున్నారు. కలెక్టరేట్‌కి రోజుకు వేల మంది వస్తున్నారు. పేదల జీవితాలు చిన్నాభిన్నం అయితే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నష్టపోతే గంటల వ్యవధిలోనే బాధితుల అకౌంట్లో డబ్బులు వేసేవారు. వైఎస్ జగన్‌పై అక్కసుతో సచివాలయ వ్యవస్థను, వలంటీర్ వ్యవస్థని నీరు కార్చాడు చంద్రబాబు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు కూటమి సర్కార్‌కు ఉన్న వ్యత్యాసం ప్రజలు గమనించాలి.విజయవాడ ప్రజలు కళ్లలో కన్నీళ్లు వస్తున్నాయి అంటే చంద్రబాబు చేసిన తప్పిదమే. మళ్ళీ వరద ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ చేయాలి. నష్ట పోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించాలి. బాధితుల తరపున వైస్సార్సీపీ పోరాటం చేస్తుంది. వరద బాధితులను పరామర్శించని పవన్.. మత విద్వేషాలను రెచ్చకొడుతున్నాడు. పవన్‌కి ప్రజలే బుద్ధి చెబుతారు. విజయవాడ ముందే మునిగిపోతుందని తెలిసి కూడా సిసోడియా ఎందుకు చెప్పలేదు’ అంటూ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు.. ఉచిత ఇసుక ఎక్కడ?: ఎంపీ విజయసాయిరెడ్డి -
దేవుళ్ళు, దేవాలయాలపై రాజకీయాలు వద్దు.. పవన్ కు పోతిన మహేష్ కౌంటర్
-
దీక్ష ముసుగులో సినిమా షూటింగ్‌లు
-
ప్రాణత్యాగం అడగటం లేదు పవన్
-
‘సనాతన ధర్మం మీద పవన్ ఉపన్యాసాలా?’
సాక్షి, గుంటూరు: బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి. అంతేగానీ విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పోతిన వెంకట మహేష్ చురకలు అంటించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ పాయింట్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు.లడ్డూలో కల్తీ జరగలేదని స్వయంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని ఆయన ప్రకటించారు. ఇక.. అసలు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అసలు ఆయనకు సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ల మీద మీకు నమ్మకం ఉందా?.గొడ్డు మాంసం తినొచ్చని ఒకసారి పవనే అంటారు. అలాంటిది సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి?. పవన్ చేస్తున్నది ప్రాయశ్చిత దీక్ష కాదని.. రాజకీయ దీక్ష అని ఎద్దేవా చేశారు. టీటీడీ దేవాలయాలకు వెళ్లలేని పవన్..సనాతన ధర్మం గురించి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని మహేష్ అన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలని, పవన్ మాత్రం మత విశ్వాసాలు అడ్డుపెట్టుకుని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోతిన మహేష్ మండిపడ్డారు.పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలనుకుంటే చేయొచ్చు. అసలు ఆ దీక్ష ఎందుకు చేస్తారో ఆయనకుకు తెలుసా?. తప్పును క్షమించమని చేస్తారు. జానీ మాస్టర్ ఓ మైనర్‌పై అఘాయిత్యం చేసినందుకు పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నందుకు.. పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలి. రాష్ట్రంలో దాడులు కొనసాగుతున్నందుకు.. పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలి. మీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ దళిత వైద్యుడిపై దాడి చేసినందుకు ప్రాయశ్చితంగా దీక్ష చేయాలి. చంద్రబాబు తప్పు చేసినందుకు పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలి. హిందువుల మనోభావాలతో ఆటలాడితే వెంకటేశ్వరస్వామి చూస్తూ ఊరుకోరు అని మహేష్ అన్నారు.