సాక్షి, గుంటూరు: బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి. అంతేగానీ విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పోతిన వెంకట మహేష్ చురకలు అంటించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ పాయింట్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు.
లడ్డూలో కల్తీ జరగలేదని స్వయంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని ఆయన ప్రకటించారు. ఇక.. అసలు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అసలు ఆయనకు సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ల మీద మీకు నమ్మకం ఉందా?.
గొడ్డు మాంసం తినొచ్చని ఒకసారి పవనే అంటారు. అలాంటిది సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి?. పవన్ చేస్తున్నది ప్రాయశ్చిత దీక్ష కాదని.. రాజకీయ దీక్ష అని ఎద్దేవా చేశారు. టీటీడీ దేవాలయాలకు వెళ్లలేని పవన్..సనాతన ధర్మం గురించి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని మహేష్ అన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలని, పవన్ మాత్రం మత విశ్వాసాలు అడ్డుపెట్టుకుని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోతిన మహేష్ మండిపడ్డారు.
పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలనుకుంటే చేయొచ్చు. అసలు ఆ దీక్ష ఎందుకు చేస్తారో ఆయనకుకు తెలుసా?. తప్పును క్షమించమని చేస్తారు. జానీ మాస్టర్ ఓ మైనర్‌పై అఘాయిత్యం చేసినందుకు పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నందుకు.. పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలి. రాష్ట్రంలో దాడులు కొనసాగుతున్నందుకు.. పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలి. మీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ దళిత వైద్యుడిపై దాడి చేసినందుకు ప్రాయశ్చితంగా దీక్ష చేయాలి. చంద్రబాబు తప్పు చేసినందుకు పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలి. హిందువుల మనోభావాలతో ఆటలాడితే వెంకటేశ్వరస్వామి చూస్తూ ఊరుకోరు అని మహేష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment