సాక్షి, విజయవాడ: సంక్రాంతిని కూటమి ప్రభుత్వం దోచుకుందని.. దోపిడీకి ఏ మార్గాన్ని వదలడం లేదంటూ వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్(Pothina Mahesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంక్రాంతి(Sankranti)ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారు. సంక్రాంతి సంబరాలను క్యాసినో స్థాయికి తీసుకెళ్లారు. పాఠశాలలను కూడా జూద కేంద్రాలుగా మార్చేశారు’’ అని దుయ్యబట్టారు.
‘‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాల బరుల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేల కోట్లు సంపాదించారు. మద్యాన్ని ఏరులై పారించారు. రికార్డింగ్ డాన్స్‌లు చేయించారు. పండుగను అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకున్నారు. పేదలు ఈ సంక్రాంతి పండుగకు దూరమయ్యారు. తాగు... తిను.. ఊగు అనే కొత్త నినాదాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది’’ అంటూ పోతిన మహేష్ ధ్వజమెత్తారు.
‘‘సంక్రాంతి సంబరాలను ఆర్గనైజింగ్ క్రైమ్‌గా మార్చేశారు. జూదం అధికారికమే అనేలా కూటమి అనుమతులిచ్చింది. ఐపీఎల్ మాదిరి కోడి ప్రీమియర్ లీగ్‌లు పెట్టారు. పనులు చేసుకోవద్దు.. వ్యసనాలకు అలవాటు పడండని చంద్రబాబు ప్రజలకు చెప్పదలచుకున్నారా సమాధానం చెప్పాలి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు కోడి పందాల్లో పాల్గొన్నారు. మహిళా బౌన్సర్లను పెట్టి విష సంస్కృతి తెచ్చారు. మైనర్లు సైతం గుండాట, పేకాట ఆడారు. కోడి పందాలు ఆడుకోవచ్చని అనుమతులుచ్చారా.. హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలి’’ అని మహేష్ నిలదీశారు.
‘‘భీమవరంలో క్యాసినో సెంటర్ పెట్టారు. కుక్కుట శాస్త్రం ప్రకారం రూ.కోటి 25 లక్షలతో ముహూర్తం పెట్టి ఆడించారు. చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. కోడి పందాల బరులకు టీడీపీ, జనసేన ట్యాక్స్ కట్టించుకున్నారు. స్కూళ్లలో కోళ్ల పందాలు పెట్టి విద్యార్ధులకు ఏం సందేశం ఇస్తారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. గోదావరి జిల్లాలకు ధీటుగా కృష్ణాజిల్లాలో 320కి పైగా కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు’’ అని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
..ఇదేం పాలన అని జనం చంద్రబాబు, పవన్‌ను తిట్టుకుంటున్నారు. వైఎస్ జగన్‌ను అనవసరంగా వదులుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విజనరీ ఎవరని ప్రజల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రాన్ని కోడి పందాలు.. పేకాటకు కేరాఫ్‌గా మార్చాలనుకుంటున్నారా చంద్రబాబు?. అశ్లీల నృత్యాలేనా పర్యాటకం అభివృద్ధి అంటే. ఇదేనా చంద్రబాబు మీ విజన్ 2047 అంటే. కోడి పందాలను ప్రమోట్ చేసిన ఒక్క సెలబ్రిటీ మీదనైనా కేసు పెట్టారా?. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను చంద్రబాబు, పనన్ సర్వ నాశనం చేస్తున్నారు.
ఇదీ చదవండి: పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?
..పేకాట, కోడి పందాలు.. అశ్లీల నృత్యాలు చూడాలంటే ఏపీకి వెళ్లాలని పొరుగు రాష్ట్రాల్లోని ప్రజలు అనుకుంటున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు కట్టిన జగన్ అసలైన విజనరీ. ఉపాధి అవకాశాలు కల్పించలేమని పవన్ చెప్పిన కొద్దిసేపటికే ఇద్దరు యువకులు చనిపోయారు. ఇద్దరి చావుకు కారణమైన పవన్‌పై కేసు పెట్టాలా వద్దా?. పవన్ పదే పదే సనాతన ధర్మం.. సంస్కృతి అంటున్నారు. కోడి పందాలు, పేకాట, గుండాట ఆడటమే ధర్మమా?
..అశ్లీల నృత్యాలే మన సంస్కృతా... పవన్ సమాధానం చెప్పాలి. ఇటీవల పవన్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అడిగేవాడు లేక జనసేన కార్యకర్తలు బరితెగించారు. నేషనల్ హైవేపై టోల్ గేట్ పెట్టడమేంటి?. కోడి పందాలు నిర్వహించినందుకు పవన్ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదు. పార్టీలో చేర్చుకున్న భూకబ్జాదారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment