
ముచ్చుమర్రిలో నిర్మూనుష్యమైన దారిలో సాగుతున్న మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్
సాక్షి, పగిడ్యాల(నంద్యాల జిల్లా): ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన మొక్కుబడిగా సాగింది. ముచ్చుమర్రిలో నిశ్శబ్ద వాతావరణంలో పర్యటన సాగగా, స్వాగతం పలికేందుకు నాయకులు కరువయ్యారు. ఎప్పటిలాగే బూటక మాటలు చెప్పి చంద్రబాబు వెళ్లిపోయారు.
నందికొట్కూరులో రోడ్‌షోను ముగించుకుని ప్రత్యేక కాన్వాయ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ముచ్చుమర్రికి చేరుకున్నారు. అయితే చంద్ర బాబుకు జనసంచారం లేని నిర్మానుష్యమైన దారులు మాత్రమే స్వాగతం పలికాయి. సుమారు కిలోమీటరు దూరం ఊరిలో ఓపెన్ టాపు వాహనంలో చంద్రబాబు కనిపించినా స్థానికులు ఎవరూ ఆయనను పట్టించుకోకపోవడం గమనార్హం.
స్థానిక నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపించడంతో బాబు ప్రాజెక్టు సందర్శన కేవలం 25 నిముషాల్లోనే ముగిసింది. ఇలా వచ్చి, అలా వెళ్లడం చూసి ఈయనేనా మాజీ ముఖ్యమంత్రి అనే చర్చ కొనసాగింది.
చదవండి: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు?
Comments
Please login to add a commentAdd a comment