హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం చైనా పర్యటన కోసం ఆర్థిక శాఖ గురువారం 1.22 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. కోటి రూపాయలను అడ్వాన్స్‌గా డ్రా చేసుకోవడానికి అనుమతించింది. ఇందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ మరో జీవోను జారీ చేసింది. విమాన చార్జీలు, రవాణా చార్జీలు, మెమోంటోలు, శాలువాలు, గిఫ్ట్ ల కొనుగోళ్లతో పాటు రోజువారీ అలెవెన్స్‌ల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం చైనాలో పర్యటించనున్న విషయం తెలిసిందే.