నిధుల కొరత, వ్యూహాత్మక భాగస్వాముల వేటలో ‘కూ’    | India's Koo On The Hunt For Strategic Partner Amid Funding | Sakshi
Sakshi News home page

నిధుల కొరత, వ్యూహాత్మక భాగస్వాముల వేటలో ‘కూ’   

Sep 18 2023 2:08 PM | Updated on Sep 18 2023 3:05 PM

India Koo On The Hunt For Strategic Partner - Sakshi

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ కూ తదుపరి దశ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిధులు సమీకరించడం లేదా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకునే యోచనలో ఉంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు మయాంక్‌ బిదావత్కా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడుల రాక మందగించిన నేపథ్యంలో ’కూ’ ప్లాట్‌ఫామ్‌ విస్తృతంగా వృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించగలిగే భాగస్వామితో చేతులు కలపాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. (మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్‌: ఫాక్స్‌కాన్‌ పోస్ట్‌ వైరల్‌)

స్టార్టప్‌ వ్యవస్థకు 2023 అత్యంత కష్టతరమైన సంవత్సరాల్లో ఒకటని మయాంక్‌ చెప్పారు. నిధుల ప్రవాహం ఒక్కసారిగా నిల్చిపోయిందని, దాదాపు బ్రేక్‌ఈవెన్‌కి దగ్గర్లో ఉన్నవి లేదా ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు మాత్రమే నిధులు లభించాయని తెలిపారు. మరో ఆరు నెలలు సమయం లభించి ఉంటే తాము దేశీయంగా ట్విటర్‌ను (ప్రస్తుతం ఎక్స్‌) అధిగమించి ఉండేవారమని, కానీ పరిస్థితుల వల్ల ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. (గణేష్‌ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement