strategic partner
-
భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామి
వాషింగ్టన్: రష్యాతో భారత్ మైత్రి బంధం మరింత బలపడుతున్నా సరే తమకు మాత్రం వ్యూహాత్మక భాగస్వామిగానే కొనసాగుతుందని అమెరికా పునరుద్ఘాటించింది. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ఇటీవలే రష్యాలో పర్యటించిన నేపథ్యంలో అమెరికా తాజాగా ఇలా స్పందించింది. వాషింగ్టన్లో మంగళవారం అమెరికా రక్షణ శాఖ ప్రెస్ సెక్రటరీ ప్యాట్ రైడర్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘‘ భారత్ ఎప్పటికీ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామే. దీన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తుంటాం. ఇరుదేశాల సైనిక ఒప్పందాలు, సత్సంబంధాలు కొనసాగుతాయి’ అని స్పష్టంచేశారు. యుద్ధరంగంలో బాంబులు, బుల్లెట్ల నడుమ శాంతి స్థాపన సాధ్యంకాదని ఉక్రెయిన్ దురాక్రమణను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ వ్యాఖ్యానించడం తెల్సిందే. ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై రైడర్ స్పందించారు. ‘‘రష్యా దురాక్రమణను సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేస్తోంది’’ అని ఆయన అన్నారు. -
నిధుల కొరత, వ్యూహాత్మక భాగస్వాముల వేటలో ‘కూ’
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ తదుపరి దశ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిధులు సమీకరించడం లేదా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకునే యోచనలో ఉంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడుల రాక మందగించిన నేపథ్యంలో ’కూ’ ప్లాట్‌ఫామ్ విస్తృతంగా వృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించగలిగే భాగస్వామితో చేతులు కలపాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. (మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్: ఫాక్స్‌కాన్ పోస్ట్ వైరల్) స్టార్టప్ వ్యవస్థకు 2023 అత్యంత కష్టతరమైన సంవత్సరాల్లో ఒకటని మయాంక్ చెప్పారు. నిధుల ప్రవాహం ఒక్కసారిగా నిల్చిపోయిందని, దాదాపు బ్రేక్ఈవెన్కి దగ్గర్లో ఉన్నవి లేదా ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు మాత్రమే నిధులు లభించాయని తెలిపారు. మరో ఆరు నెలలు సమయం లభించి ఉంటే తాము దేశీయంగా ట్విటర్‌ను (ప్రస్తుతం ఎక్స్) అధిగమించి ఉండేవారమని, కానీ పరిస్థితుల వల్ల ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) -
చైనాకు చెక్ పెట్టాలంటే భారత్‌తోనే సాధ్యం
వాషింగ్టన్: అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ మైక్ గిల్డే కీలకవ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అగ్రరాజ్యానికి భారత్ ముఖ్య భాగస్వామి అవుతుందని, చైనాకు చెక్‌పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫౌండేషన్ గురువారం ఏర్పాటు చేసిన సెమినార్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు. భారత్ నుంచి చైనాకు రెండు సవాళ్లు ఎదరవుతాయని గిల్డే పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని చైనాను బలవంతం చేస్తున్నారని, కానీ చైనా వాస్తవానికి పక్కనున్న భారత్‌ను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ ఆసియాలో భారత్ బలమైన దేశంగా ఉండటం అమెరికా, జపాన్‌కు అవసరం అన్నారు. భారత్‌తో జాగ్రత్తగా ఉండాలనేలా చైనాను అప్రమత్తం చేయాలని సూచించారు. భారత్, అమెరికా సైన్యాలు గతేడాది అక్టోబర్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించిన విషయాన్ని గిల్డే గుర్తు చేశారు. అప్పుడే చైనాకు భారత సవాల్ అవుతుందని అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లోనే తాను ఎక్కువ సమయం గడిపినట్లు చెప్పుకొచ్చారు. చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో అన్ని వేల మంది రష్యా సైనికులు చనిపోయారా? -
శ్రీలంక వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ
శ్రీలంక ప్రధాని విక్రమసింఘెతో మంత్రి కేటీఆర్ భేటీ అక్టోబర్‌లో రాష్ట్ర పర్యటనకు విక్రమసింఘె సుముఖత సాక్షి, హైదరాబాద్: భారత్‌తో కలసి దక్షిణాసియాలో బలమైన శక్తిగా ఎదిగేందుకు శ్రీలంకకు అనేక అవకాశాలు ఉన్నాయని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె వ్యాఖ్యానించారు. రెండు రోజుల శ్రీలంక పర్యటనలో భాగంగా రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు శుక్రవారం విక్రమసింఘెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన పురోగతిని మంత్రి కేటీఆర్ ఆయనకు వివరించారు. పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్, ఐటీ విధానం, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల వివరాలు తెలియజేశారు. బలమైన శక్తిగా ఎదిగేందుకు శ్రీలంక చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. భారత్‌లోని తెలంగాణతో పాటు ఐదు దక్షిణాది రాష్ట్రాలను వ్యూహాత్మక భాగస్వాములుగా గుర్తిస్తున్నట్లు విక్రమసింఘె వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఐటీ రంగం విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. టీ హబ్ తరహా నమూనాను శ్రీలంకలోనూ అనుసరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన విక్రమసింఘె.. అక్టోబర్‌లో రాష్ట్ర పర్యటనకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఉమ్మడి భాగస్వామ్యానికి ప్రతిపాదనలు శ్రీలంక ప్రధానితో భేటీ సందర్భంగా కేటీఆర్ ఉమ్మడి భాగస్వామ్యానికి సంబంధించి పలు ప్రతిపాదనలు అందజేశారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. తెలంగాణ ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టడంలో శ్రీలంక కంపెనీలు ప్రధాన భూమిక పోషించాల్సిందిగా కోరారు. కొలంబోలో జరిగిన హ్యూమన్ క్యాపిటల్ సమ్మిట్‌కు ఆహ్వానించినందుకు శ్రీలంక ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ శ్రీలంకకు చెందిన పలు వాణిజ్య, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. తెలంగాణకు నేరుగా విమాన సౌకర్యం కల్పించాలని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ సీఈవో కెప్టెన్ సురెన్ రటవట్టెను కోరారు. మంత్రి కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ఉన్నారు. -
రష్యాతో భారత సంబంధాలు అపూర్వం: మోదీ
-
రష్యాతో భారత సంబంధాలు అపూర్వం: మోదీ
రష్యాతో భారతదేశానికి ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం అపూర్వమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత దేశానికి రష్యా పెట్టని కోటలా ఎప్పుడూ మంచి అండగా ఉంటోందని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపిన అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఒకసారి బ్రెజిల్‌లోను, మరోసారి ఆస్ట్రేలియాలోను ఇప్పటికి రెండుసార్లు తాను వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసినట్లు తెలిపారు. సైనికుల శిక్షణపై భారత్, రష్యాల మధ్య ఒప్పందం కుదిరింది. పుతిన్‌కు భారత్‌లో ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామని మోదీ అన్నారు. రష్యా సహాయంతో మరో 10 అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రెండు దేశాల మధ్య 2000 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వార్షిక సదస్సులను ప్రారంభించినప్పుడు పుతిన్ కూడా రష్యాకు ప్రధానమంత్రిగానే ఉన్నారన్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం మరి దేంతోనూ పోల్చలేమని ఆయన స్పష్టం చేశారు. చరిత్రలో అత్యంత క్లిష్టమైన సందర్భాలు వచ్చినప్పుడు కూడా భారతదేశానికి రష్యా చాలా నిబద్ధత కలిగిన మద్దతుదారుగా ఉందని అన్నారు. అంతరిక్ష పరిశోధనలో భారతదేశానికి మరింత సహకారం అందిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ముందు నుంచి భారతదేశానికి రష్యా మద్దతుగా నిలుస్తోందని, కొన్ని దశాబ్దాలుగా భారత్‌తో రక్షణ ఒప్పందాలను కలిగి ఉందని ఆయన అన్నారు.