మోదీ రష్యాలో పర్యటించిన నేపథ్యంలో అమెరికా వ్యాఖ్యలు
వాషింగ్టన్: రష్యాతో భారత్ మైత్రి బంధం మరింత బలపడుతున్నా సరే తమకు మాత్రం వ్యూహాత్మక భాగస్వామిగానే కొనసాగుతుందని అమెరికా పునరుద్ఘాటించింది. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ఇటీవలే రష్యాలో పర్యటించిన నేపథ్యంలో అమెరికా తాజాగా ఇలా స్పందించింది. వాషింగ్టన్‌లో మంగళవారం అమెరికా రక్షణ శాఖ ప్రెస్ సెక్రటరీ ప్యాట్ రైడర్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
‘‘ భారత్ ఎప్పటికీ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామే. దీన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తుంటాం. ఇరుదేశాల సైనిక ఒప్పందాలు, సత్సంబంధాలు కొనసాగుతాయి’ అని స్పష్టంచేశారు. యుద్ధరంగంలో బాంబులు, బుల్లెట్ల నడుమ శాంతి స్థాపన సాధ్యంకాదని ఉక్రెయిన్ దురాక్రమణను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ వ్యాఖ్యానించడం తెల్సిందే. ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై రైడర్ స్పందించారు. ‘‘రష్యా దురాక్రమణను సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేస్తోంది’’ అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment