Mayank
-
జనరల్ నాలెడ్జ్‌కు కేరాఫ్ అడ్రస్
ఫ్రెండ్స్, ఈరోజు మనం మయాంక్ గురించి తెలుసుకుందాం. పన్నెండేళ్ల వయసులో పాపులర్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అమితాబ్ బచ్చన్ నుంచి బహుమతిని అందుకున్నాడు. ప్రైజ్ మనీతో పాటు ఒక కారును కూడా తీసుకున్నాడు. ‘కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు సంతోషంగా ఉంది. కేబీసిలో ΄ాల్గొనే అవకాశం రావడం, అమితాబ్ సర్‌తో షోలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ బహుమతి గెలుచుకున్న రోజు తన సంతోషాన్ని ప్రకటించాడు మయాంక్.మయాంక్‌ను మెచ్చుకోవడమే కాదు అతడి తండ్రిని....‘ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించాడు?’ అని అడిగాడు అమితాబ్. హరియాణాలోని మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్‌కు పాఠ్య విషయాలే కాదు ప్రపంచంలో జరిగే పరిణామాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం. వాటి గురించి టీచర్లను అడుగుతుంటాడు. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలను చదువుతుంటాడు.అలా చదివిన జ్ఞానం వృథా పోలేదు.దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిలో పడేలా చేసింది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా మయాంక్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. క్విజ్ పోటీలు ఉన్నప్పుడే జనరల్ నాలెడ్జ్‌పై దృష్టి పెట్టడం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దాంతోబాటు చరిత్రలో ఏం జరిగిందో కూడా పుస్తకాలు చదువుతూ తెలుసుకోవాలి.న్యూస్‌పేపర్ రోజూ చదవడం మరచిపోవద్దు.‘జననరల్ నాలెడ్జ్‌కు ఆకాశమే హద్దు’ అంటున్నాడు మయాంక్. నిజమే కదా!మనం ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. మరి ఈరోజు నుంచే మీ ప్రయత్నం మొదలు పెట్టండి. ‘జనరల్ నాలెడ్జ్‌లో దిట్ట’ అనిపించుకోండి. -
మయాంక్ మెరుపు బౌలింగ్
బెంగళూరు: అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నిప్పులు చెరిగే బంతులతో మరోసారి లక్నో పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ హడలెత్తించాడు. వేగానికితోడు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఐపీఎల్ టోర్నీ లో లక్నో జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. మయాంక్ (3/14) దెబ్బకు సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. మయాంక్‌తోపాటు డికాక్, నికోలస్ పూరన్ రాణించడంతో... మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (56 బంతుల్లో 81; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), పూరన్ (21 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. మహిపాల్ లామ్రోర్ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఆట ఆడగా... పటిదార్, గ్రీన్, మ్యాక్స్‌వెల్ వికెట్లను తీసి లక్నో విజయంలో కీలకపాత్ర పోషించిన మయాంక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ మయాంక్ మూడు వికెట్టు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం అందుకున్నాడు. డికాక్, పూరన్ మెరుపులతో... లక్నో జట్టు ఓపెనర్ డికాక్ ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాప్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అతను 3 బౌండరీలు, సిరాజ్ మూడో ఓవర్లో 2 సిక్స్‌లు బాదాడు. దీంతో కెపె్టన్ కేఎల్ రాహుల్ (20; 2 సిక్స్‌లు) తక్కువే చేసినా... దేవదత్ పడిక్కల్ (6) విఫలమైనా... లక్నో ఇన్నింగ్స్‌పై ఏమాత్రం ప్రభావం పడలేదు. 36 బంతుల్లో డికాక్ ఫిఫ్టీ పూర్తవగా జట్టు స్కోరు 12వ ఓవర్లోనే వందకు చేరింది. స్టొయినిస్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించగా, ఆఖర్లో పూరన్ మెరుపులతో లక్నో భారీస్కోరు చేయగలిగింది. 19, 20వ ఓవర్లను పూర్తిగా ఆడిన పూరన్ 5 సిక్స్‌లతో 33 పరుగులు పిండుకున్నాడు. కోహ్లి అవుటవడంతోనే... బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభంలో కొద్ది సేపే బాగుంది. కెపె్టన్ డు ప్లెసిస్ బౌండరీలతో వేగం పెంచగా, నవీనుల్ నాలుగో ఓవర్లో కోహ్లి సిక్స్‌తో టచ్‌లోకి వచ్చాడు. మరుసటి ఓవర్ తొలి బంతికి కోహ్లి ఫోర్ కొట్టడంతో స్కోరు 40/0 వద్ద బాగానే ఉంది. అక్కడే కోహ్లి నిష్క్రష్కమించగా, మరుసటి ఓవర్లో డుప్లెసిస్ (19; 3 ఫోర్లు) రనౌటయ్యాడు. చెత్త షాట్ ఆడిన మ్యాక్స్‌వెల్ (0) పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతే 43 పరుగులకే ముగ్గురు హిట్టర్లను కోల్పోయిన బెంగళూరు కష్టాల్లో పడింది. మయాంక్ అద్భుత బంతికి గ్రీన్ (9) బౌల్డ్ కాగా.. అనూజ్ (11) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన లామ్రోర్ సిక్స్‌లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. 20 బంతుల్లో 46 పరుగుల సమీకరణం ఆర్సీబీలో కొత్త ఆశలు రేపగా... మరుసటి బంతికి కార్తీక్ (4) అవుట్ కావడంతోనే బెంగళూరు ఖేల్ ఖతమైంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) డాగర్ (బి) టాప్లీ 81; కేఎల్ రాహుల్ (సి) డాగర్ (బి) మ్యాక్స్‌వెల్ 20; పడిక్కల్ (సి) అనూజ్ (బి) సిరాజ్ 6; స్టొయినిస్ (సి) డాగర్ (బి) మ్యాక్స్‌వెల్ 24; పూరన్ (నాటౌట్) 40; బదోని (సి) డుప్లెసిస్ (బి) యశ్ దయాళ్ 0; కృనాల్ పాండ్యా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–53, 2–73, 3–129, 4–143, 5–148. బౌలింగ్: రీస్ టాప్లీ 4–0–39–1, యశ్ దయాళ్ 4–0–24–1, సిరాజ్ 4–0–47–1, మ్యాక్స్‌వెల్ 4–0–23–2, మయాంక్ డాగర్ 2–0–23–0, గ్రీన్ 2–0–25–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) పడిక్కల్ (బి) సిద్ధార్థ్ 22; డుప్లెసిస్ (రనౌట్) 19; పటిదార్ (సి) పడిక్కల్ (బి) మయాంక్ యాదవ్ 29; మ్యాక్స్‌వెల్ (సి) పూరన్ (బి) మయాంక్ యాదవ్ 0; గ్రీన్ (బి) మయాంక్ యాదవ్ 9; అనూజ్ (సి) పడిక్కల్ (బి) స్టొయినిస్ 11; మహిపాల్ (సి) పూరన్ (బి) యశ్ ఠాకూర్ 33; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 4; మయాంక్ డాగర్ (రనౌట్) 0; టాప్లీ (నాటౌట్) 3; సిరాజ్ (సి) పూరన్ (బి) నవీనుల్ 12; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–40, 2–42, 3–43, 4–58, 5–94, 6–103, 7–136, 8–137, 9–138, 10–153. బౌలింగ్: సిద్ధార్థ్ 3–0–21–1, కృనాల్ పాండ్యా 1–0–10–0, నవీనుల్ 3.4–0–25–2, మయాంక్ యాదవ్ 4–0–14–3, రవి బిష్ణోయ్ 3–0–33–0, యశ్ ఠాకూర్ 4–0–38–1, స్టొయినిస్ 1–0–9–1. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X కోల్‌కతా వేదిక: విశాఖపట్నం రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
LSG Vs PBKS: లక్నో సూపర్‌గా... సొంతగడ్డపై జెయింట్స్ గెలుపు
ఐపీఎల్ కొత్త సీజన్‌ను ఓటమితో మొదలు పెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వెంటనే కోలుకుంది. సొంతగడ్డపై సత్తా చాటి గెలుపు బోణీ చేసింది. బ్యాటింగ్‌లో డికాక్, కృనాల్, పూరన్ కీలక పాత్ర పోషించగా... మయాంక్ యాదవ్, మొహసిన్ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. ముఖ్యంగా తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన 21 ఏళ్ల మయాంక్ యాదవ్ తాను వేసిన 24 బంతుల్లో తొమ్మిది బంతులను గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంగా వేయడం విశేషం. భారీ ఛేదనలో 100కు పైగా తొలి వికెట్ భాగస్వామ్యంతో మంచి పునాది వేసుకున్నా... చివరకు పంజాబ్ కింగ్స్‌కు పరాజయం తప్పలేదు. బ్యాటర్ల నిర్లక్ష్యపూరిత షాట్లతో ఆ జట్టు వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. లక్నో: ఐపీఎల్లో లక్నో తొలి విజయంతో పాయింట్ల ఖాతా తెరిచింది. శనివారం జరిగిన పోరులో లక్నో 21 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కృనాల్ పాండ్యా (22 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (21 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు భారీ స్కోరుకు బాటలు వేశారు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు సాధించింది. శిఖర్ ధావన్ (50 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), జానీ బెయిర్‌స్టో (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 70 బంతుల్లోనే 102 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ యాదవ్ (3/27) పంజాబ్‌ను దెబ్బ కొట్టాడు. సమష్టి ప్రదర్శన... రబాడ ఓవర్లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్‌తో లక్నో ఇన్నింగ్స్‌ను డికాక్ ధాటిగా ప్రారంభించగా... అర్‡్షదీప్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన కేఎల్ రాహుల్ (15) అదే ఓవర్లో వెనుదిరిగాడు. పడిక్కల్ (9) విఫలం కాగా... రాహుల్ చహర్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన స్టొయినిస్ (19) తర్వాతి బంతికే అవుటయ్యాడు. 34 బంతుల్లో డికాక్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... చహర్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో పూరన్ జోరు ప్రదర్శించాడు. పూరన్ వెనుదిరిగిన తర్వాత కృనాల్ కూడా చెలరేగడంతో జట్టు భారీ స్కోరు చేయగలిగింది. శతక భాగస్వామ్యం... ఛేదనలో పంజాబ్‌కు ధావన్, బెయిర్‌స్టో ఘనమైన ఆరంభాన్ని అందించారు. సిద్ధార్థ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన ధావన్... మొహసిన్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. దాంతో 6 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 61 పరుగులకు చేరింది. 30 బంతుల్లోనే ధావన్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగా, కృనాల్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో బెయిర్‌స్టో దూకుడు చూపించాడు. ఎట్టకేలకు 12వ ఓవర్లో మయాంక్ యాదవ్ ఈ జోడీని విడదీయగా, క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు ప్రభ్‌సిమ్రన్ (7 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. అయితే 13 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయినపంజాబ్ కింగ్స్ ఓటమి దిశగా పయనించింది. గెలుపు కోసం 23 బంతుల్లో 59 పరుగులు చేయాల్సిన స్థితిలో ధావన్ అవుట్ కావడం జట్టు అవకాశాలకు దాదాపుగా తెర వేసింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) జితేశ్ (బి) అర్‡్షదీప్ 54; రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) అర్‡్షదీప్ 15; పడిక్కల్ (సి) ధావన్ (బి) స్యామ్ కరన్ 9; స్టొయినిస్ (బి) చహర్ 19; పూరన్ (బి) రబాడ 42; బదోని (సి) బెయిర్‌స్టో (బి) కరన్ 8; కృనాల్ పాండ్యా (నాటౌట్) 43; రవి బిష్ణోయ్ (సి) (సబ్) తనయ్ 0; మొహసిన్ (రనౌట్) 2; నవీన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–35, 2–45, 3–78, 4–125, 5–146, 6–189, 7–189, 8–197. బౌలింగ్: స్యామ్ కరన్ 4–0–28–3, అర్‡్షదీప్ 3–0–30–2, రబాడ 4–0–38–1, రాహుల్ చహర్ 3–0–42–1, హర్‌ప్రీత్ బ్రార్ 2–0–14–0, హర్షల్ పటేల్ 4–0–45–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (సి) డికాక్ (బి) మొహసిన్ 70; బెయిర్‌స్టో (సి) స్టొయినిస్ (బి) మయాంక్ 42; ప్రభ్‌సిమ్రన్ (సి) నవీన్ (బి) మయాంక్ 19; జితేశ్ (సి) నవీన్ (బి) మయాంక్ 6; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 29; కరన్ (సి)పూరన్ (బి) మొహసిన్ 0; శశాంక్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–102, 2–128, 3–139, 4–141, 5–141. బౌలింగ్: సిద్ధార్థ్ 2–0–21–0, నవీన్ 4–0–43–0, మొహసిన్ 4–0–34–2, కృనాల్ 3–0–26–0, బిష్ణోయ్ 3–0–25–0, మయాంక్ యాదవ్ 4–0–27–3. ఐపీఎల్లో నేడు గుజరాత్ X హైదరాబాద్ వేదిక: అహ్మదాబాద్ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X చెన్నై వేదిక: విశాఖపట్నం రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నిధుల కొరత, వ్యూహాత్మక భాగస్వాముల వేటలో ‘కూ’
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ తదుపరి దశ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిధులు సమీకరించడం లేదా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకునే యోచనలో ఉంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడుల రాక మందగించిన నేపథ్యంలో ’కూ’ ప్లాట్‌ఫామ్ విస్తృతంగా వృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించగలిగే భాగస్వామితో చేతులు కలపాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. (మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్: ఫాక్స్‌కాన్ పోస్ట్ వైరల్) స్టార్టప్ వ్యవస్థకు 2023 అత్యంత కష్టతరమైన సంవత్సరాల్లో ఒకటని మయాంక్ చెప్పారు. నిధుల ప్రవాహం ఒక్కసారిగా నిల్చిపోయిందని, దాదాపు బ్రేక్ఈవెన్కి దగ్గర్లో ఉన్నవి లేదా ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు మాత్రమే నిధులు లభించాయని తెలిపారు. మరో ఆరు నెలలు సమయం లభించి ఉంటే తాము దేశీయంగా ట్విటర్‌ను (ప్రస్తుతం ఎక్స్) అధిగమించి ఉండేవారమని, కానీ పరిస్థితుల వల్ల ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) -
ఆరోగ్యానికి వారధి
‘అనుభవాలే పాఠాలు అవుతాయి’ అనే మాటను అనేకసార్లు విని ఉన్నాం మనం.మరి అనుభవాలే అంకురాలు (స్టార్టప్) అవుతాయా?‘వై నాట్!’ అంటున్నారు మయాంక్ కాలే (27), అమృత్‌సింగ్ (27)మూడు పదుల వయసు దాటకుండానే హెల్త్‌కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’తో ఘన విజయం సాధించి సత్తా చాటారు.స్టార్టప్‌కు సామాజిక కోణం జత చేసి విజయవంతం అయ్యారు... యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్(యూఎస్)లో చదువుకునే రోజుల్లో చదువును మధ్యలోనే ఆపేయాలని మయాంక్, అమృత్‌లు నిర్ణయించుకున్నప్పుడు వారి వారి తల్లిదండ్రులకు ఎంతమాత్రం నచ్చలేదు.‘ఇంతకీ ఏంచేయాలనుకుంటున్నారు?’ అని అడిగారు.తమ భవిష్యత్ చిత్రపట్టాన్ని రంగుల్లో చూపారు మయాంక్, అమృత్‌లు.వారి వారి తల్లిదండ్రులకు నచ్చిందో లేదో తెలియదుగానీ ‘ముందు చదువు పూర్తి చేయండి. ఆతరువాత ఆలోచిద్దాం’ అన్నారు. ఇప్పుడు చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి మనం..మయాంక్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు తండ్రికి గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. దీంతో ఒక్కగానొక్క కొడుకైన మయాంక్ ఆఘమేఘాల మీద ఇండియాకు వచ్చాడు. తండ్రి సమస్య సర్జరీ వరకు వెళ్లింది.ఇంటికి, హాస్పిటల్స్‌కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కు ప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడుగానీ చాలామంది హాస్పిటల్స్‌కు వెళ్లడం లేదు. ఇది తన దృష్టిలో నిలిచిపోయింది. యూనివర్సిటీకి తిరిగి వెళ్లిన తరువాత అమృత్‌తో కలిసి పేషెంట్ల హెల్త్‌కేర్‌కు సంబంధించి డిజిటల్ హెల్త్‌కేర్ రికార్డ్లను క్రియేట్ చేసే సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశాడు. దీన్ని మహారాష్ట్రలోని గడ్చిరోలి గ్రామీణ్రపాంతాలలో విజయవంతంగా ప్రయోగించారు.ఈ విజయం వారిలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.చదువులు పూర్తయిన తరువాత ఇండియాకు వచ్చారు మయాంక్, అమృత్. గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో రకరకాల అప్లికేషన్లను డెవలప్ చేయడంప్రా రంభించారు.మన జనాభాలో అతి కొద్దిమందికి మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా చాలామందిలో ‘మెడికల్ ఎడ్యుకేషన్’ ఉండడం లేదు. దీనివల్ల వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్లి లేని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వర్క్‌ప్లేస్ ఇన్సూరెన్సులు పెరుగుతున్నాయి. అయితే వ్యక్తిగత (రిటైల్) ఇన్సూరెన్స్‌లు తగ్గాయి. దీనికి కారణం ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి పాలసీలు తీసుకోవాలి... మొదలైన విషయాలపై అవగాహన లేకపోవడం... ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పుణె కేంద్రంగా హెల్త్‌కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’కు శ్రీకారం చుట్టారు మయాంక్, అమృత్‌సింగ్.‘లూప్’ ద్వారా వైద్య విషయాలపై అవగాహనతో పాటు, ప్రైమరీ కేర్ (్రపాథమిక ఆరోగ్య సంరక్షణ)కు సంబంధించి డాక్టర్‌తో యాక్సెస్, ఫ్రీ కన్సల్టెషన్లు, ఆన్లైన్ యోగా సెషన్స్... మొదలైన ప్రయోజనాలు ఉన్నాయి. కంపెనీలకు, ఇన్సూరెన్స్ప్రొవైడర్లకు మధ్య ‘లూప్’ సంధానకర్తగా వ్యవహరిస్తోంది.దిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె...మొదలైన పట్టణాలలో ఎన్నో కంపెనీలతో కలిసి పనిచేస్తోంది లూప్.‘మయాంక్, అమృత్లకు భారతీయ ఆరోగ్య వ్యవస్థపై మంచి అవగాహన ఉంది. అందుబాటులో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో లూప్ భవిష్యత్‌లో ఎంతోమందికి సహాయంగా నిలవనుంది’ అంటున్నాడు గురుగ్రామ్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ‘ఎలివేషన్ క్యాపిటల్’ భాగస్వామి ఖందూజ. ప్రస్తుతం ఉద్యోగుల హెల్త్–చెకప్‌కు ఉద్దేశించిన ఫిజికల్ ‘లూప్–క్లీనిక్’లపై ట్రయల్స్ చేస్తున్నారు.‘లూప్’ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది.మయాంక్ (కో–ఫౌండర్ అండ్ సీఈఓ, లూప్), అమృత్ (కో–ఫౌండర్, లూప్)ల లక్ష్యం ఫలించింది అని చెప్పడానికి ఇది చాలు కదా! ఇంటికి, హాస్పిటల్స్‌కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కుప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. -
స్టార్ హీరో ఇంట పెళ్లి సందడి, ఫొటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అతడి సోదరి సనా కపూర్ కొత్త పెళ్లికూతురిగా ముస్తాబైంది. నటుడు మనోజ్- సీమ దంపతుల కుమారుడు మయాంక్‌తో శుక్రవారం ఏడడుగులు నడిచింది. ఈ సందర్భంగా కొత్త జంట సనా- మయాంక్‌ల ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో మెహందీ ఫొటోల్లో సనా ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. సంగీత్‌లో డ్యాన్సులు చేస్తూ పెళ్లి సందడిని రెట్టింపు చేసింది కపూర్ ఫ్యామిలీ. షాహిద్- మీరా రాజ్‌పుత్‌ల హడావుడి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా సుప్రియ పాఠక్, పంకజ్ కపూర్ల గారాల కూతురు సనా గతంలో షాందార్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన సోదరుడు షాహిద్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటించారు. View this post on Instagram A post shared by Sanah Kapur (@sanahkapur15) View this post on Instagram A post shared by Vivaan Shah (@thesurrealvivaanshah) View this post on Instagram A post shared by Vivaan Shah (@thesurrealvivaanshah) View this post on Instagram A post shared by Mayank Pahwa (@mayankpahwa_13) View this post on Instagram A post shared by Vivaan Shah (@thesurrealvivaanshah) -
పరాజయం పిలిచింది...
మ్యాచ్‌లో విజయానికి 17 బంతుల్లో 21 పరుగులు కావాలి... చేతిలో 9 వికెట్లు ఉన్నాయి...ఇలాంటి స్థితిలో ఎంత బలహీన జట్టయినా గెలుపును అందుకుంటుంది. కానీ అలా చేయగలిగితే అది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎందుకవుతుంది.. గత మ్యాచ్‌లాగే పేలవ బ్యాటింగ్‌లో తడబడిన టీమ్ చివరకు 18 పరుగులు మాత్రమే చేసి ఓట మిని ఆహ్వానించింది. మరోసారి అతి జాగ్రత్తకు పోయిన కెప్టెన్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నా, పంజా బ్‌కు పరాజయం తప్పలేదు. బ్యాటింగ్‌లో మెరుపు ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో కూడా ప్రత్యేకత కనబర్చడంతో నైట్‌రైడర్స్ చివరి క్షణాల్లో మరో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆఖరి బంతికి సిక్సర్ కొడితే స్కోరు సమమయ్యే అవకాశం ఉండగా మ్యాక్స్‌వెల్ కొట్టిన షాట్ బౌండరీకి రెండంగుళాలు ముందు పడి ఫోర్‌గా మారడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. అబుదాబి: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ లక్ష్యాన్ని కాపాడుకుంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్ సత్తా చాటింది. శనివారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 2 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 58; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. శుబ్‌మన్ గిల్ (47 బంతుల్లో 57; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 74; 6 ఫోర్లు), మయాంక్ (39 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. సూపర్ కార్తీక్ పవర్ ప్లేలో 25/1... 10 ఓవర్లలో 60/2... 15 ఓవర్లకు 101/3. ఈ స్కోరు చూస్తే ఎవరికైనా కోల్‌కతా ఇన్నింగ్స్ ఎంత నెమ్మదిగా సాగిందో అర్థమవుతోంది. 150 పరుగులు దాటితే అదే గొప్ప అని భావించారంతా. కానీ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ధాటికి చివరి 30 బంతుల్లో 63 పరుగులు సాధించిన కోల్‌కతా ప్రత్యర్థికి మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో కార్తీక్ ఆటే హైలైట్. గత మ్యాచ్ హీరో రాహుల్ త్రిపాఠి (4), రాణా (2), మోర్గాన్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), రసెల్ (5) వేగంగా పరుగులు చేయడంలో విఫలమైన వేళ.. కార్తీక్ స్వేచ్ఛగా ఆడాడు. జట్టు స్కోరు 63/3 వద్ద క్రీజులోకి వచ్చిన అతను... అప్పటికే క్రీజులో కుదురుకున్న గిల్‌కు అవకాశమిస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో గిల్ 42 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. మరోవైపు అర్‡్షదీప్ వేసిన 16వ ఓవర్లో మూడు బౌండరీలతో కార్తీక్ దూకుడు పెంచాడు. అదే ఊపులో వరుసగా 4, 6, 4 బాది జోర్డాన్ బౌలింగ్‌లో 18 పరుగులు రాబట్టాడు. షమీ వేసిన మరుసటి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు బాదిన కార్తీక్ 22 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. వెంటనే గిల్ రనౌట్‌గా వెనుదిరగడంతో నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మారని తీరు... మొదట్లో ప్రశాంతంగా సాగిన పంజాబ్ ఇన్నింగ్స్ చివర్లో బోల్తా కొట్టింది. ఎలాగైనా జట్టును గెలిపించేందుకు బరిలోకి దిగిన రాహుల్ రెండో ఓవర్లోనే ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అతను అడపాదడపా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ నడిపించాడు. మరోవైపు మయాంక్ ధాటిగా ఆడాడు. ప్రసిధ్ బౌలింగ్‌లో సిక్స్‌తో సహా రెండు ఫోర్లు బాదిన మయాంక్... కమలేశ్ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలతో జోరు పెంచాడు. కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో రాహుల్ 42 బంతుల్లో అర్ధసెంచరీ అందుకోగా... మయాంక్ 33 బంతుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు.తొలి వికెట్‌కు 115 పరుగుల్ని జోడించిన ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ పంజాబ్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. 34 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన స్థితిలో మయాంక్ ఔటయ్యాడు. చేతిలో ఇంకా 9 వికెట్లుండటంతో పంజాబ్ విజయం దాదాపు ఖాయంగానే తోచింది. కానీ తర్వాతే ఇన్నింగ్స్ తడబడింది. నరైన్ బంతికి పూరన్ (16) క్లీన్‌బౌల్డ్ కావడంతో పతనం ప్రారంభమైంది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్: రాహుల్ త్రిపాఠి (బి) షమీ 4; గిల్ (రనౌట్) 57; రాణా (రనౌట్) 2; మోర్గాన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) బిష్ణోయ్ 24; కార్తీక్ (రనౌట్) 58; రసెల్ (సి) ప్రభ్ సిమ్రన్ (బి) అర్‡్షదీప్ 5; కమిన్స్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–12, 2–14, 3–63, 4–145, 5–150, 6–164. బౌలింగ్: షమీ 4–0–30–1, అర్‡్షదీప్ 4–1–25–1, జోర్డాన్ 4–0–37–0, ముజీబ్ 4–0–44–0, బిష్ణోయ్ 4–0–25–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) ప్రసిధ్ 74; మయాంక్ (సి) గిల్ (బి) ప్రసి«ధ్ 56; పూరన్ (బి) నరైన్ 16; ప్రభ్ సిమ్రన్ (సి) రాణా (బి) ప్రసిధ్ 4; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 10; మన్దీప్ (సి) (సబ్) గ్రీన్ (బి) నరైన్ 0; జోర్డాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–115, 2–144, 3–149, 4–151, 5–158. బౌలింగ్: కమిన్స్ 4–0–29–0, ప్రసి«ధ్ 4–0–29–3, కమలేశ్ 3–0–40–0, వరుణ్ 4–0–27–0, నరైన్ 4–0–28–2, రాణా 1–0–7–0. నరైన్ బౌలింగ్‌పై సందేహాలు! కోల్‌కతా జట్టుకు కొత్త సమస్య వచ్చి పడింది! పంజాబ్‌తో మ్యాచ్‌ను గెలిపించిన జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫీల్డ్ అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. అతని బౌలింగ్ సందేహాస్పదంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉందని వారు నివేదిక ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి అతనిపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఐపీఎల్లో నరైన్ బౌలింగ్‌ను కొనసాగించవచ్చని, మరో సారి యాక్షన్‌పై సందేహం వ్యక్తం చేస్తే సస్పెండ్ చేస్తామని గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. -
పార్లేలో 10 వేల ఉద్యోగాలకు ఎసరు
ముంబై: అమ్మకాలు పడిపోతుండటంతో వివిధ రంగాల సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే కూడా ఈ జాబితాలో చేరనుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడంతో వచ్చే ఏడాది కాలంలో సుమారు 10,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి రావొచ్చని పార్లే ప్రోడక్ట్స్ విభాగం హెడ్ మయాంక్ షా తెలిపారు. సామాన్యుల కోసం ఉద్దేశించిన చౌక ఉత్పత్తులపై కూడా అధిక స్థాయిలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధింపు, డిమాండ్ మందగమనం వంటి అంశాలు ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. పార్లేకు సొంతంగా 10 తయారీ యూనిట్లు ఉండగా, థర్డ్ పార్టీ తయారీ సంస్థలు 125 దాకా ఉన్నాయి. బిస్కెట్ తయారీతో పాటు ఇతర వ్యాపార విభాగాల్లో పార్లేలో ప్రస్తుతం లక్ష మంది పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ‘ఇప్పటికైతే ఉద్యోగులెవరినీ తొలగించలేదు. కానీ పరిస్థితులు మెరుగుపడకపోతే ఈ చర్యలు తీసుకోవాల్సి రావొచ్చు’ అని మయాంక్ షా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ విక్రయ పరిమాణం ఉండే చౌక ఉత్పత్తుల అమ్మకాలు 7–8 శాతం పడిపోగా, తక్కువ విక్రయ పరిమాణం.. అధిక ధర ఉండే ఉత్పత్తుల అమ్మకాలు 8–9 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. మొత్తం మీద బిస్కెట్ల విభాగం అమ్మకాల వృద్ధి గతంలో రెండంకెల స్థాయిలో ఉండేదని.. ప్రస్తుతం 2.5 శాతానికి పడిపోయిందని షా పేర్కొన్నారు. చౌక ఉత్పత్తుల విభాగం మొత్తం బిస్కెట్ల వ్యాపారంలో నాలుగో వంతే ఉన్నప్పటికీ.. అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయాల్సినందున ఇందులో ఎక్కువ మంది సిబ్బంది ఉంటారని షా చెప్పారు. గతంలో కేజీకి రూ. 100 లోపు ధర ఉండే బిస్కెట్లకు ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు ఉండేదని ఆయన తెలిపారు. అయితే, 2017లో బిస్కెట్లను కూడా 18 శాతం జీఎస్టీ శ్లాబులో చేర్చినప్పట్నుంచీ పరిశ్రమకు సమస్యలు ప్రారంభమయ్యాయని షా చెప్పారు. అధిక జీఎస్టీ కారణంగా చౌక ఉత్పత్తుల రేట్లను కూడా తాము పెంచాల్సి వచ్చిందని, దీంతో డిమాండ్ పడిపోయిందని ఆయన తెలిపారు. జీఎస్‌టీపరమైన సమస్యలు సరిదిద్దాలంటూ పరిశ్రమ కోరుతున్నప్పటికీ .. ఇప్పటి వరకూ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. అయితే, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
రాయుడును వీడని ‘3డి’
సాక్షి క్రీడా విభాగం: మరోసారి ప్రపంచ కప్ అవకాశం మన అంబటి తిరుపతి (ఏటీ) రాయుడు చేజారింది. జట్టులో నాలుగో స్థానానికి ఎంపికైన విజయ్ శంకర్ గాయం నుంచి తప్పుకున్నా... అదే స్థానానికి చివరి వరకు పోటీ పడిన రాయుడుకు మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ప్రపంచ కప్ స్టాండ్ బై ఆటగాళ్లలో అతని పేరు ఉన్నా, అసలు సమయానికి మాత్రం ఆ చాన్స్ మయాంక్ ఎగరేసుకుపోయాడు. పునరాగమనం తర్వాత నిలకడైన ప్రదర్శనతో ‘4’కు సరైనవాడు అని కోహ్లితో ప్రశంసలు పొందినా...న్యూజిలాండ్ గడ్డపై భారత టాప్ స్కోరర్‌గా నిలిచినా దురదృష్టవశాత్తూ రాయుడును సెలక్టర్లు గుర్తించలేదు. ఇప్పుడు జట్టు ఉన్న పరిస్థితుల్లో మిడిలార్డర్లో సమర్థంగా ఆడగల సత్తా రాయుడుకి ఉందనడంలో సందేహం లేదు. ఓపిగ్గా ఇన్నింగ్స్‌ను నడిపించడంతో పాటు అవసరమైన సమయంలో ధాటిగా ఆడగల నైపుణ్యం అతని సొంతం. సెలక్టర్ల ఎంపిక ప్రక్రియే కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. ఓపెనర్ ధావన్ గాయపడితే ఒక మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పంత్‌ను ఎంపిక చేశారు. ఇప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ తప్పుకుంటే ఇప్పటి వరకు ఒక్క వన్డే కూడా ఆడని ఓపెనర్‌ను ఎంచుకున్నారు. తనను కాదని శంకర్‌ను ఎంపిక చేస్తూ ‘త్రీ డైమెన్షనల్ ఆటగాడు’ అంటూ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించడం... పరోక్షంగా దానిపై సెటైర్ విసురుతూ ‘వరల్డ్ కప్ చూసేందుకు 3డి అద్దాలు కొన్నాను’ అంటూ రాయుడు ట్వీట్ చేయడం వివాదం రేపింది. ఏదో స్థానం కోల్పోయిన బాధలో అన్నాడు పాపం కాబట్టి చర్య తీసుకోవడం లేదు అని బీసీసీఐ పెద్దలు కొందరు అప్పట్లో వ్యాఖ్యానించినా... ఆ విషయాన్ని వారంతా తేలిగ్గా వదిలి పెట్టలేదని అర్థమవుతోంది. తమనే ప్రశ్నించిన రాయుడుకు మళ్లీ అవకాశం ఇవ్వరాదనే సంకేతం తాజా ఎంపికలో కనిపించిందనడంలో సందేహం లేదు. ఇదీ మయాంక్ రికార్డు... భారత్ తరఫున ఆస్ట్రేలియాతో 2 టెస్టులు ఆడి ఆకట్టుకున్న కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో ఇంకా అరంగేట్రమే చేయలేదు. దేశవాళీ వన్డేల్లో (లిస్ట్ ఎ) 75 మ్యాచ్‌లలో 48.71 సగటుతో 3,605 పరుగులతో అతనికి చెప్పుకోదగ్గ రికార్డు ఉంది. అతని స్ట్రయిక్ రేట్ కూడా 100.72 కావడం విశేషం. ముఖ్యంగా గత రెండేళ్లలో అతను 61.60 సగటుతో వన్డేల్లో పరుగులు చేశాడు. ఐపీఎల్లో కూడా ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్... గత ఏడాది భారత ‘ఎ’ తరఫున ఇంగ్లండ్ గడ్డపై 4 వన్డేల్లో 71.75 సగటు, 105.90 స్ట్రయిక్ రేట్‌తో 287 పరుగులు సాధించడం అతని ఎంపికకు కారణమైంది. ప్రపంచ కప్‌కు ఎంపిక చేసేందుకు బీసీసీఐకి రాసిన లేఖలో ‘సరైన టాపార్డర్ బ్యాట్స్‌మన్’ కావాలని టీమ్ మేనేజ్మెంట్ కోరడాన్ని బట్టి చూస్తే అతడిని ఓపెనింగ్ స్థానానికే ఎంపిక చేశారని అర్థమవుతోంది. -
ఐదేళ్లలో 12 కొత్త కార్లు..
సనంద్: టాటా మోటార్స్ దేశీయ ప్యాసింజర్ వాహన విభాగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లలో 10–12 ప్రయాణికుల వాహనాల (కార్లు)ను తీసుకురావాలని భావిస్తోంది. కొత్త ఉత్పత్తులను ఆల్ఫా, ఒమెగా అనే రెండు ప్లాట్‌ఫామ్‌లపై అభివృద్ధి చేయనున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. ఈ ఉత్పత్తులతో ప్రయాణికుల వాహనాల విభాగంలో కంపెనీ స్థానం పటిష్టమవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘‘రానున్న ఐదేళ్లలో దేశీయ ఆటోమోటివ్ మార్కెట్ ఎన్నో విభాగాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇందులో ఉప విభాగాలు కూడా ఏర్పడతాయి. ప్రస్తుత విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూనే కొత్త వాటిల్లోకీ ప్రవేశించాలన్నది టాటా మోటార్స్ ప్రణాళిక’’ అని పరీక్ తెలిపారు. ఎన్ని కొత్త ఉత్పత్తులు తీసుకురానున్నారు? అన్న మీడియా ప్రశ్నకు.. రెండు నూతన మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌లలో 10 నుంచి 12 వాహనాలను తీసుకురానున్నట్టు తెలిపారు. కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలన్న ప్రక్రియలో భాగంగా ప్రయాణికుల వాహన అభివృద్ధికి ప్లాట్‌ఫామ్‌లను రెండింటికి పరిమితం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎస్‌యూ వీ హారియర్‌తో కొత్త ఉత్పత్తుల విడుదలను కంపెనీ వేగవంతం చేయనుంది. ప్రస్తుతం ప్యాసింజర్ వాహన విభాగంలో కంపెనీకి 70% మార్కెట్ వాటా ఉంది. 4.3 మీటర్ల పొడవుతో ఆల్ఫా ప్లాట్ఫామ్లో వాహనాలను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఎస్‌యూవీలు, పెద్ద వాహన ఉత్పత్తులను ఒమెగా ప్లాట్‌ఫామ్ నుంచి తీసుకురానున్నట్టు చెప్పారు. సరఫరాదారుల కుదింపు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విడిభాగాల సరఫరాదారులను 400కు తగ్గించుకోనుంది. ప్రస్తుతం సరఫరాదారుల సంఖ్య 600గా ఉంది. కంపెనీ లాభార్జన వ్యూహంలో ఇది కూడా భాగమే. సనంద్ప్లాంట్లో ఉత్పత్తిని పెంచాలన్నది కంపెనీ ప్రణాళిక. ఈ ప్లాంట్‌లో అక్టోబర్ నుంచి టియాగో, టిగోర్ వాహనాలను నెలకు 12,500 యూనిట్ల తయారీకి తీసుకెళ్లనుంది. టర్న్ అరౌండ్ విధానంలో భాగంగా సరఫరాదారులను క్రమబద్ధీకరించే పనిని చేపట్టినట్టు, ప్రస్తుతం ఇది కొనసాగుతోందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ జి ఖాత్రి తెలిపారు. సంఖ్యపై ఆయన స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఖర్చులను తగ్గించుకునేందుకేనన్నారు. సనంద్ ప్లాంట్‌లో నానో కోసం విడిభాగాలను సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను టిగోర్, టియాగో వాహనాలకు విడిభాగాలను అందించే విధంగా అభివృద్ధి చేసినట్టు ఖాత్రి వెల్లడించారు. -
పీఎన్బీ స్కాం : మోదీ బంధువులు బుక్కయ్యారు
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న భారీ కుంభకోణ కేసులో ఇప్పటికే సీబీఐ రెండు ఛార్జ్షీట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్కాంను దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నీరవ్ మోదీ బంధువులకు సమన్లు జారీచేసింది. కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోదీ తండ్రి దీపక్ మోదీ, సోదరి పూర్వి మెహతా, ఆమె భర్త మయాంక్ మెహతాలకు సమన్లు జారీచేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. పీఎన్బీ కుంభకోణ కేసు విచారణలో భాగంగా ఈ సమన్లను పంపినట్టు పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా వచ్చే వారం మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి చెందిన స్పెషల్ కోర్టులో హాజరు కావాలని వీరికి ఆదేశాలు జారీచేసినట్టు ఈడీ ఇన్వెస్టిగేటర్లు తెలిపారు. ముంబై ఆఫీసులో వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. ఈ నెల తొలి వారంలోనే నీరవ్ మోదీ బంధువులకు సమన్లు జారీచేశామని ఈడీ ఇన్వెస్టిగేటర్లు చెప్పారు. తమ ముందు హాజరు కావడానికి వారికి 15 రోజుల సమయమిచ్చినట్టు పేర్కొన్నారు. నీరవ్ మోదీ, ఆయన గ్రూప్ కంపెనీలు, అంకుల్ మెహుల్ చౌక్సి, ఆయన డైమాండ్ కంపెనీలు కలిసి పీఎన్‌బీఐలో దాదాపు రూ.13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయి. ఒకవేళ ఈ సమన్లకు నీరవ్ తండ్రి, సోదరి, బావ స్పందించకపోతే, మరోసారి నోటీసులు జారీచేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. నీరవ్ తండ్రి దీపక్ బెల్జియంకు చెందిన వాడు కాగ, పూర్వి, ఆమె భర్త హాంకాంగ్‌లో స్థిరపడ్డారు. మెయిల్ ద్వారా ఈ సమన్లను అధికారులు వారికి జారీచేశారు. పూర్వి ఇప్పటికే ఈడీ కనుసన్నల్లో ఉన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా భారత్‌కు మనీ లాండరింగ్‌కు పాల్పడటానికి నీరవ్‌కు ఆమె సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆమె భర్త కూడా ఇదే కార్యకలాపాలతో నీరవ్‌కు సాయపడినట్టు తెలుస్తోంది. వీరందరూ కలిసి 2011 నుంచి 2017 మధ్యలో ముంబైలోని బ్యాంకుకు చెందిన బ్రాడీ హౌజ్ బ్రాంచు ఆఫీసర్లతో కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు వెల్లడైంది. స్కాం బయటపడటానికి కొన్ని రోజుల ముందే నీరవ్ మోదీ, ఆయన భార్య, అంకుల్ మెహుల్ చౌక్సిలు దేశం విడిచి పారిపోయారు. జనవరి 31న ఈ కేసులో సీబీఐ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని పీఎన్బీ కుంభకోణం ఈడీ కూడా మనీ లాండరింగ్ విచారణ చేపడుతోంది. -
బావ అలా చేశారంటే మేమే షాకయ్యాం...
బీజింగ్ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో పాల్పడిన వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన సెలబ్రిటీల స్టార్, డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం దేశ ప్రజల మాత్రమే కాక, అతని సన్నిహితులు కూడా నీరవ్‌ను చీదరించుకోవడం ప్రారంభించారు. హాంకాంగ్‌లో ఉన్న నీరవ్ బావ మయాంక్ మెహతా సైతం నీరవ్ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బావ పీఎన్బీలో రూ.13,600 కోట్ల కుంభకోణానికి పాల్పడటం నిజంగా తమల్ని షాక్‌కి, ఆశ్చర్యానికి గురిచేసిందని నీరవ్ సోదరి పూర్వి భర్త మయాంక్ మెహతా ఇండియా టుడేతో అన్నారు. పూర్వి మెహతా ఫ్లాట్‌లో నీరవ్ తలదాచుకున్నాడనే వార్తల నేపథ్యంలో ఇండియా టుడే టీమ్, వారిని ఆశ్రయించింది. హాంకాంగ్‌లో వారు నివసించే ఎస్టోరియల్ కోర్టు హౌజింగ్ కాంప్లెక్స్‌కు వెళ్లిన ఇండియా టుడే టీమ్‌కు తొలుత అక్కడ నిరాశే ఎదురైంది. ఇక్కడ నీరవ్ లేదా పూర్వి పేరుతో ఎవరూ లేరంటూ వీరి ముఖం మీదనే ఆ ఫ్లాట్‌లో ఉంటున్న వారు తలుపులు వేసేశారు. అయితే ఈ బిల్టింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న ఆమె, తనకు పూర్వి సోదరుడు మోదీ తెలుసని తెలిపింది. కానీ ఇటీవల మోదీ ఇక్కడ కనిపించలేదని పేర్కొంది. అనంతరం మయాంక్‌తో ఇండియా టుడే మాట్లాడింది. మోదీ ఇలా చేస్తారని తాము అసలు ఊహించలేదని, మొత్తం సమస్యను అర్థం చేసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. మోదీ అంకుల్ ఎందుకు గూగుల్‌లో కనిపిస్తున్నారంటూ తమ పిల్లలు అడుగుతున్నారని, నిజాలను మాత్రం తోసిపుచ్చలేమని, వారితో తాము ఇక సంబంధాలు పెట్టుకోవాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు. పూర్వి గురించి ప్రస్తావించగా, తన భార్య ట్రావెలింగ్‌లో ఉందని తెలిపారు. అయితే పూర్వి ఫ్లాట్‌లోనే ఉన్నట్టు ఈ బిల్టింగ్ స్టాఫ్‌గా పనిచేసే సిబ్బంది చెప్పారు. మోదీ ప్రొవిజనల్ అరెస్ట్‌పై స్పందించిన మయాంక్.. ఇదే సరియైన ప్రక్రియ అని, మా ఇంటిని ప్రభుత్వం సెర్చ్ చేసుకోవచ్చని, మా ఇంట్లో నీరవ్ ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తనకు తెలుసని పేర్కొన్నారు. కాగ, ఇటీవలే నీరవ్‌మోదీ హాంకాంగ్‌లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. అతన్ని ప్రొవిజనల్ అరెస్ట్ చేయాలంటూ హాంకాంగ్ అథారిటీలను భారత్ కోరింది. దీనిపై హాంకాంగ్ సైతం సానుకూలంగా స్పందించింది. -
ఫైనల్లో భారత్ ‘ఎ’
మయాంక్, మనీష్ సెంచరీల మోత దక్షిణాఫ్రికా ‘ఎ’పై విజయం నేడు ఆసీస్‌తో అమీతుమీ చెన్నై: మయాంక్ అగర్వాల్ (133 బంతుల్లో 176; 20 ఫోర్లు; 5 సిక్సర్లు), మనీష్ పాండే (85 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో ముక్కోణపు సిరీస్‌లో భారత్ ‘ఎ’ జట్టు ఫైనల్‌కు చేరింది. చిదంబరం స్టేడియంలో గురువారం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ సేన 34 పరుగుల తేడాతో గెలిచింది. శుక్రవారం ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో తుది పోరు జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 371 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మయాంక్, ఉన్ముక్త్ (77 బంతుల్లో 64; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు సెంచరీ (106) భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత పాండే, మయాంక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. టి20 తరహా హిట్టింగ్తో సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో పరుగులు ధారాళంగా వచ్చాయి. ఈ జోడి రెండో వికెట్‌కు 203 పరుగులు జోడించడం విశేషం. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ (86 బంతుల్లో 113; 10 ఫోర్లు; 6 సిక్సర్లు), ఖాయా జోండో (60 బంతుల్లో 86; 7 ఫోర్లు; 5 సిక్సర్లు) వేగంగా ఆడి విజయం కోసం ప్రయత్నించినా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. హెండ్రిక్స్ (109 బంతుల్లో 76; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించాడు. అక్షర్ పటేల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఫైనల్ భారత్ ‘ఎ’ ఆసీస్ ‘ఎ’ ఉదయం 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం