‘అనుభవాలే పాఠాలు అవుతాయి’ అనే మాటను అనేకసార్లు విని ఉన్నాం మనం.మరి అనుభవాలే అంకురాలు (స్టార్టప్) అవుతాయా?‘వై నాట్!’ అంటున్నారు మయాంక్ కాలే (27), అమృత్‌సింగ్ (27)మూడు పదుల వయసు దాటకుండానే హెల్త్‌కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’తో ఘన విజయం సాధించి సత్తా చాటారు.స్టార్టప్‌కు సామాజిక కోణం జత చేసి విజయవంతం అయ్యారు...
యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్(యూఎస్)లో చదువుకునే రోజుల్లో చదువును మధ్యలోనే ఆపేయాలని మయాంక్, అమృత్‌లు నిర్ణయించుకున్నప్పుడు వారి వారి తల్లిదండ్రులకు ఎంతమాత్రం నచ్చలేదు.‘ఇంతకీ ఏంచేయాలనుకుంటున్నారు?’ అని అడిగారు.తమ భవిష్యత్ చిత్రపట్టాన్ని రంగుల్లో చూపారు మయాంక్, అమృత్‌లు.వారి వారి తల్లిదండ్రులకు నచ్చిందో లేదో తెలియదుగానీ ‘ముందు చదువు పూర్తి చేయండి. ఆతరువాత ఆలోచిద్దాం’ అన్నారు.
ఇప్పుడు చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి మనం..మయాంక్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు తండ్రికి గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. దీంతో ఒక్కగానొక్క కొడుకైన మయాంక్ ఆఘమేఘాల మీద ఇండియాకు వచ్చాడు. తండ్రి సమస్య సర్జరీ వరకు వెళ్లింది.ఇంటికి, హాస్పిటల్స్‌కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కు ప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడుగానీ చాలామంది హాస్పిటల్స్‌కు వెళ్లడం లేదు. ఇది తన దృష్టిలో నిలిచిపోయింది.
యూనివర్సిటీకి తిరిగి వెళ్లిన తరువాత అమృత్‌తో కలిసి పేషెంట్ల హెల్త్‌కేర్‌కు సంబంధించి డిజిటల్ హెల్త్‌కేర్ రికార్డ్‌లను క్రియేట్ చేసే సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశాడు. దీన్ని మహారాష్ట్రలోని గడ్చిరోలి గ్రామీణ్రపాంతాలలో విజయవంతంగా ప్రయోగించారు.ఈ విజయం వారిలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.చదువులు పూర్తయిన తరువాత ఇండియాకు వచ్చారు మయాంక్, అమృత్.
గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో రకరకాల అప్లికేషన్‌లను డెవలప్ చేయడంప్రా రంభించారు.మన జనాభాలో అతి కొద్దిమందికి మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా చాలామందిలో ‘మెడికల్ ఎడ్యుకేషన్’ ఉండడం లేదు. దీనివల్ల వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్లి లేని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వర్క్‌ప్లేస్ ఇన్సూరెన్సులు పెరుగుతున్నాయి.
అయితే వ్యక్తిగత (రిటైల్) ఇన్సూరెన్స్‌లు తగ్గాయి. దీనికి కారణం ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి పాలసీలు తీసుకోవాలి... మొదలైన విషయాలపై అవగాహన లేకపోవడం... ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పుణె కేంద్రంగా హెల్త్‌కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’కు శ్రీకారం చుట్టారు మయాంక్, అమృత్‌సింగ్.‘లూప్’ ద్వారా వైద్య విషయాలపై అవగాహనతో పాటు, ప్రైమరీ కేర్ (్రపాథమిక ఆరోగ్య సంరక్షణ)కు సంబంధించి డాక్టర్‌తో యాక్సెస్, ఫ్రీ కన్సల్టెషన్‌లు, ఆన్‌లైన్ యోగా సెషన్స్... మొదలైన ప్రయోజనాలు ఉన్నాయి.
కంపెనీలకు, ఇన్సూరెన్స్‌ప్రొవైడర్‌లకు మధ్య ‘లూప్’ సంధానకర్తగా వ్యవహరిస్తోంది.దిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె...మొదలైన పట్టణాలలో ఎన్నో కంపెనీలతో కలిసి పనిచేస్తోంది లూప్.‘మయాంక్, అమృత్‌లకు భారతీయ ఆరోగ్య వ్యవస్థపై మంచి అవగాహన ఉంది. అందుబాటులో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో లూప్ భవిష్యత్‌లో ఎంతోమందికి సహాయంగా నిలవనుంది’ అంటున్నాడు గురుగ్రామ్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ‘ఎలివేషన్ క్యాపిటల్’ భాగస్వామి ఖందూజ.
ప్రస్తుతం ఉద్యోగుల హెల్త్–చెకప్‌కు ఉద్దేశించిన ఫిజికల్ ‘లూప్–క్లీనిక్’లపై ట్రయల్స్ చేస్తున్నారు.‘లూప్’ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది.మయాంక్ (కో–ఫౌండర్ అండ్ సీఈఓ, లూప్), అమృత్ (కో–ఫౌండర్, లూప్)ల లక్ష్యం ఫలించింది అని చెప్పడానికి ఇది చాలు కదా!
ఇంటికి, హాస్పిటల్స్‌కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కుప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment