స్టార్టప్స్ కు ఆరు ఆర్థిక సూత్రాలు | Six economic principles to startaps | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్ కు ఆరు ఆర్థిక సూత్రాలు

Published Mon, Mar 21 2016 12:44 AM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM

స్టార్టప్స్ కు ఆరు ఆర్థిక సూత్రాలు - Sakshi

స్టార్టప్స్ కు ఆరు ఆర్థిక సూత్రాలు

ప్రస్తుతం స్టార్టప్ బూమ్ నడుస్తోంది.  కొన్ని స్టార్టప్స్ విజయవంతమవ్వవు. మరికొన్ని విఫలమౌతాయి. విజయానికి... కొన్ని అంశాలను స్టార్టప్స్ ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.

 స్టార్టప్ ప్రారంభానికి ముందు..
స్టార్టప్ ఏర్పాటు ఒకే రోజులో జరిగిపోదు. దానికి కసరత్తు కావాలి. అంటే ఇతరత్ర పనులన్నింటినీ వదిలేసి దానిపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. ఏదైనా ఉద్యోగం చేస్తుంటే వదిలేయాలి. జాబ్ వదిలేయడానికి ముందే మన వద్ద 6 నెలల వరకు ఎలాంటి ఆర్థిక కష్టం రాకుండా ఉండటానికి సరిపడ డబ్బును సమకూర్చుకోవాలి. ఎప్పుడూ ఒక స్థిర ఆదాయ మార్గాన్ని కలిగి ఉండాలి. దీని వల్ల స్టార్టప్ ప్రారంభ దశలో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్స్, బాండ్స్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు, అద్దె వంటి రెగ్యులర్ ఇన్‌కమ్ (స్థిర ఆదాయం) మార్గాలుగా పరిగణలోకి తీసుకోవచ్చు.

 బీమా తప్పనిసరి
ఒక కొత్త కంపెనీ/సంస్థను ప్రారంభించామంటే.. అందులో చాలా రిస్క్ ఉంటుంది. ఇలాంటి రిస్క్‌ను తగ్గించుకోవాలంటే అందుకు ఇన్సూరెన్స్ ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. గడ్డు పరిస్థితులను ఎదుర్కోడానికి బీమా తప్పనిసరి. ఇన్వెస్ట్‌మెంట్ దారులెన్నో

స్టార్టప్ ప్రమాదంలో ఉందని భావించినప్పటి నుంచి రక్షణాత్మక పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. మూలధనాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. దాని కోసం ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్, ప్రభుత్వ బాండ్లు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్, కంపెనీ బాండ్స్, ఎఫ్‌ఎంపీలు, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు బిజినెస్ ఒక్కసారిగా తగ్గినా కూడా వచ్చే వడ్డీ ద్వారా ఖర్చులను భరించవచ్చు.

 ప్రత్యామ్నాయాలు.
స్టార్టప్ ప్రారంభించినప్పటి నుంచి బిజినెస్ బాగుంటే పర్వాలేదు. ఏ సమస్య లేదు. అదే ఒకవేళ వ్యాపారం సరిగా లేకపోతే? అప్పుడేలా? ఇలాంటి పరిస్థితులను ముందే ఊహించాలి. అంటే బిజినెస్ బాగుంటే ఎలా ఉంటుంది? బాగోలేకపోతే ఎలా? అనే రెండు అంశాలను ముందే గమనించి తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవాలి. అప్పుడు స్టార్టప్ ఏర్పాటు తర్వాత ప్రతికూల పరిస్థితులు ఎదురైనా భయపడం.

 మార్కెటింగ్ సంగతేంటి?
కొత్తగా ఏ కొత్త ఉత్పత్తిని తీసుకువచ్చినా కూడా దాన్ని మార్కెటింగ్ చేయాలంటే అడ్వర్టైజింగ్ తప్పనిసరి. ఇదే ఫార్ములా స్టార్టప్‌కు కూడా వర్తిస్తుంది. కావలసిన మార్కెట్‌ను లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. తర్వాత ప్రచారానికి మీడియాను సిద్ధం చేసుకోవాలి. ప్రస్తుతం చాలా స్టార్టప్స్.. ఫేస్‌బుక్, లింక్డ్ ఇన్ వంటి తదితర సామాజిక మాధ్యమాలను ప్రచారం కోసం వినియోగించుకుంటున్నాయి. సోషల్ మీడియా, పీఆర్ ఏజెన్సీలు, అడ్వర్టైజింగ్ సంస్థలకు వెచ్చించే ఖర్చును సాధ్యమైనంత తగ్గించుకుంటే మంచిది.

 ఖర్చులపై నియంత్రణ పాటించండి
అనవసరపు ఖర్చులన్నింటినీ తగ్గించుకోండి. అలాగే ప్యాకేజింగ్, పోస్టేజ్, ప్రింటింగ్ పేపర్ తదితర వ్యయాలకు ప్రాధాన్యమివ్వండి.  వీటిని నియంత్రిస్తే చాలా వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. పెద్ద మొత్తంలో కొనడం, పోస్టుల బదులు ఈ-మెయిల్ సంభాషణ చేయడం వంటి మార్గాలను అవలంభించండి. అలాగే ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేసిన పర్వాలేదనిపిస్తే అదే చేయండి. దానివల్ల ఆఫీస్ స్పేస్ అద్దె, ఎలక్ట్రిసిటీ వ్యయం, ప్రయాణ ఖర్చులు వంటివి తగ్గుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement