Software Products
-
ఆరోగ్యానికి వారధి
‘అనుభవాలే పాఠాలు అవుతాయి’ అనే మాటను అనేకసార్లు విని ఉన్నాం మనం.మరి అనుభవాలే అంకురాలు (స్టార్టప్) అవుతాయా?‘వై నాట్!’ అంటున్నారు మయాంక్ కాలే (27), అమృత్‌సింగ్ (27)మూడు పదుల వయసు దాటకుండానే హెల్త్‌కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’తో ఘన విజయం సాధించి సత్తా చాటారు.స్టార్టప్‌కు సామాజిక కోణం జత చేసి విజయవంతం అయ్యారు... యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్(యూఎస్)లో చదువుకునే రోజుల్లో చదువును మధ్యలోనే ఆపేయాలని మయాంక్, అమృత్‌లు నిర్ణయించుకున్నప్పుడు వారి వారి తల్లిదండ్రులకు ఎంతమాత్రం నచ్చలేదు.‘ఇంతకీ ఏంచేయాలనుకుంటున్నారు?’ అని అడిగారు.తమ భవిష్యత్ చిత్రపట్టాన్ని రంగుల్లో చూపారు మయాంక్, అమృత్‌లు.వారి వారి తల్లిదండ్రులకు నచ్చిందో లేదో తెలియదుగానీ ‘ముందు చదువు పూర్తి చేయండి. ఆతరువాత ఆలోచిద్దాం’ అన్నారు. ఇప్పుడు చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి మనం..మయాంక్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు తండ్రికి గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. దీంతో ఒక్కగానొక్క కొడుకైన మయాంక్ ఆఘమేఘాల మీద ఇండియాకు వచ్చాడు. తండ్రి సమస్య సర్జరీ వరకు వెళ్లింది.ఇంటికి, హాస్పిటల్స్‌కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కు ప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడుగానీ చాలామంది హాస్పిటల్స్‌కు వెళ్లడం లేదు. ఇది తన దృష్టిలో నిలిచిపోయింది. యూనివర్సిటీకి తిరిగి వెళ్లిన తరువాత అమృత్‌తో కలిసి పేషెంట్ల హెల్త్‌కేర్‌కు సంబంధించి డిజిటల్ హెల్త్‌కేర్ రికార్డ్లను క్రియేట్ చేసే సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశాడు. దీన్ని మహారాష్ట్రలోని గడ్చిరోలి గ్రామీణ్రపాంతాలలో విజయవంతంగా ప్రయోగించారు.ఈ విజయం వారిలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.చదువులు పూర్తయిన తరువాత ఇండియాకు వచ్చారు మయాంక్, అమృత్. గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో రకరకాల అప్లికేషన్లను డెవలప్ చేయడంప్రా రంభించారు.మన జనాభాలో అతి కొద్దిమందికి మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా చాలామందిలో ‘మెడికల్ ఎడ్యుకేషన్’ ఉండడం లేదు. దీనివల్ల వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్లి లేని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వర్క్‌ప్లేస్ ఇన్సూరెన్సులు పెరుగుతున్నాయి. అయితే వ్యక్తిగత (రిటైల్) ఇన్సూరెన్స్‌లు తగ్గాయి. దీనికి కారణం ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి పాలసీలు తీసుకోవాలి... మొదలైన విషయాలపై అవగాహన లేకపోవడం... ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పుణె కేంద్రంగా హెల్త్‌కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’కు శ్రీకారం చుట్టారు మయాంక్, అమృత్‌సింగ్.‘లూప్’ ద్వారా వైద్య విషయాలపై అవగాహనతో పాటు, ప్రైమరీ కేర్ (్రపాథమిక ఆరోగ్య సంరక్షణ)కు సంబంధించి డాక్టర్‌తో యాక్సెస్, ఫ్రీ కన్సల్టెషన్లు, ఆన్లైన్ యోగా సెషన్స్... మొదలైన ప్రయోజనాలు ఉన్నాయి. కంపెనీలకు, ఇన్సూరెన్స్ప్రొవైడర్లకు మధ్య ‘లూప్’ సంధానకర్తగా వ్యవహరిస్తోంది.దిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె...మొదలైన పట్టణాలలో ఎన్నో కంపెనీలతో కలిసి పనిచేస్తోంది లూప్.‘మయాంక్, అమృత్లకు భారతీయ ఆరోగ్య వ్యవస్థపై మంచి అవగాహన ఉంది. అందుబాటులో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో లూప్ భవిష్యత్‌లో ఎంతోమందికి సహాయంగా నిలవనుంది’ అంటున్నాడు గురుగ్రామ్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ‘ఎలివేషన్ క్యాపిటల్’ భాగస్వామి ఖందూజ. ప్రస్తుతం ఉద్యోగుల హెల్త్–చెకప్‌కు ఉద్దేశించిన ఫిజికల్ ‘లూప్–క్లీనిక్’లపై ట్రయల్స్ చేస్తున్నారు.‘లూప్’ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది.మయాంక్ (కో–ఫౌండర్ అండ్ సీఈఓ, లూప్), అమృత్ (కో–ఫౌండర్, లూప్)ల లక్ష్యం ఫలించింది అని చెప్పడానికి ఇది చాలు కదా! ఇంటికి, హాస్పిటల్స్‌కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కుప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. -
సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: ప్రస్తుత విధానాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ భారత్‌ను సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడంపై ఐటీ సంస్థలు దృష్టి పెట్టాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సూచించారు. వినూత్నమైన మేడిన్ ఇండియా ఉత్పత్తులను అందించాలని పేర్కొన్నారు. దేశీ వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్లు, యాప్స్ రూపకల్పన ద్వారా కరోనా వైరస్‌పరమైన భారీ సవాళ్లను పరిశ్రమ అసాధారణ రీతిలో ఎదుర్కొందని ప్రశంసించారు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఐటీ, కమ్యూనికేషన్స్ రంగంలోకి భారీ పెట్టుబడులు వచ్చాయని.. ప్రపంచమంతా భారత్‌ని విశ్వసించడమే ఇందుకు కారణమని ప్రసాద్ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్ రూపకల్పన పోటీల విజేతలను ప్రకటించిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వీకన్సోల్ అనే వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్ రూపొందించిన కేరళకు చెందిన టెక్జెన్సియా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఈ పోటీలో విజేతగా నిల్చింది. విజేతకు రూ. 1 కోటి ఆర్థిక సహాయం, అదనంగా మూడేళ్ల పాటు నిర్వహణ వ్యయాల కోసం రూ. 10 లక్షలు అందించడం జరుగుతుందని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సర్వ్ వెబ్స్, పీపుల్‌లింక్ యూనిఫైడ్ కమ్యూనికేషన్స్, ఇన్‌స్ట్రైవ్ సాఫ్ట్‌ల్యాబ్స్ సంస్థలు రూపొందించిన ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేయడానికి ఆస్కారమున్న సొల్యూషన్స్‌గా జ్యూరీ ఎంపిక చేసింది. వీటికి తలో రూ. 25 లక్షల మద్దతు లభించనుంది. -
ఐబీఎం - హెచ్‌సీఎల్ మెగా డీల్
సాక్షి,ముంబై: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్(ఐబీఎం) తన సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వ్యాపారాన్ని భారతీయ టెక్ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు విక్రయించ నుంది. ఐబీఎం ఇందుకు1.80 బిలియన్ డాలర్లను (సుమారు రూ.12,700కోట్లు) వెచ్చించనుంది. ఈ మేరకు ఒక తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్‌సీఎల్ మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2019 తొలి అర్ధభాగానికల్లా డీల్ పూర్తిచేసే అవకాశమున్నట్లు హెచ్‌సీఎల్ ప్రకటించింది. డీల్‌లో భాగంగా అధిక వృద్ధికి వీలున్న సెక్యూరిటీ, మార్కెటింగ్, కామర్స్ విభాగాలకు చెందిన సాఫ్ట్వేర్ ప్రొడక్టులను ఐబీఎం నుంచి సొంతం చేసుకోనున్నట్లు హెచ్‌సీఎల్ సీఈవో సి.విజయకుమార్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల పరిధిలో తమకు మొత్తం 50 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ ఉన్నట్లు ఐబీఎం ఒక ప్రకటనలో తెలిపింది. బిగ్ ఫిక్స్, మార్కెటింగ్ ఆటోమేషన్ ప్రొడక్ట్ యూనికా తదితర ఏడు ఉత్తులను హెచ్‌సీఎల్‌కు విక్రయించనున్నామని తెలిపింది. కాగా ఐబీఎం కూడా అమెరికాకు చెందిన ఐటీ సంస్థ రెడ్ హ్యాట్‌ను 34 బిలియన్ డాలర్ల( రుణంతో సహా) కొనుగోలు చేస్తోంది. మరోవైపు ఈ మెగా డీల్ వార్తలతో ఇన్వెస్టర్లు హెచ్‌సీఎల్ టెక్ కౌంటర్లో అమ్మకాలకు తెరతీశారు. దీంతో ఈ షేరు ఒక దశలో దాదాపు 7శాతం పతనాన్ని నమోదుచేసింది. -
ఇన్ఫోసిస్‌పై ట్రంప్ ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాల కారణంగా.. ఈసారి ఇన్ఫోసిస్ లాభాల మీద ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. తాను తీసుకునే టాప్ 3 విధాన నిర్ణయాల్లో ఇమ్మిగ్రేషన్ ఒకటని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. దానివల్ల సంస్థ లాభాల మీద ప్రభావం పడొచ్చని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా చెప్పారు. అయితే, ఈ ప్రభావం ఎంత ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చన్న విషయంపై మాత్రం కంపెనీ ఇంకా ఒక అంచనాకు రాలేకపోతోంది. భారతీయ ఉద్యోగులైతే తక్కువ జీతాలతోనే తాత్కాలిక వర్క్ పర్మిట్ వీసాలతో విదేశాలకు కూడా పంపి అక్కడ పనిచేయించుకోవడం సులభం అనేది ఇక్కడి కంపెనీల భావన. అమెరికన్లను అక్కడ ఉద్యోగాల్లోకి తీసుకుంటే వారికి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేతప్ప అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దొరకరనే సమస్య మాత్రం లేదని సిక్కా అంటున్నారు. అక్కడ కూడా కావల్సినన్ని యూనివర్సిటీలున్నాయని, కావల్సినంత మంది ఇంజనీర్లు దొరుకుతారని చెప్పారు. అయితే.. ఇప్పుడు అక్కడివారిని ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే అమెరికా మార్కెట్‌ను కాగ్నిజెంట్ లాంటి పోటీదారులకు వదులుకోవాల్సి వస్తుంది. అందుకే ఎలాగోలా ఖర్చు పెరిగినా సరే.. అక్కడి ప్రాజెక్టులను మాత్రం వదులుకోకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ తన వార్షిక రెవెన్యూ వృద్ధి లక్ష్యాలను మూడు నెలల్లో రెండోసారి తగ్గించుకుంది. చాలావరకు పాశ్చాత్య దేశాల క్లయింట్లు ఖర్చు తగ్గించుకోవాలని నిర్ణయించడంతో ఇక్కడి సాఫ్ట్వేర్ సేవల ఎగుమతి కంపెనీలకు ఆదాయం తగ్గుతోంది. ఈ ప్రభావం ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీల మీద కూడా పడింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకెంత తీవ్రంగా ఉంటుందో చూడాలి. -
మొబైల్స్‌కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై!!
స్మార్ట్ఫోన్ల తయారీ నిలిపివేత * ఇదివరకే ఫీచర్ ఫోన్ల వ్యాపారం విక్రయం * సాఫ్ట్వేర్ ఉత్పత్తులపైనే అధిక దృష్టి హెల్సింకి: అలవాటు లేని వ్యాపారాలకు స్వస్తి చెప్పాలని సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిర్ణయించుకుంది. ఒకవైపు ప్రత్యర్థుల నుంచి విపరీతమైన పోటీ.. మరొకవైపు లూమియా, విండోస్ ఫోన్ల వ్యూహాలు బెడిసికొట్టడంతో... స్మార్ట్ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెండేళ్ల క్రితం నోకియా నుంచి 7.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ ప్రయోగానికి స్వస్తి పలకనుంది. తాజాగా కంపెనీ దాదాపు 1,850 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే నోకియా ఉద్యోగుల్లో చాలావరకూ ఇక మైక్రోసాఫ్ట్‌లో పనిచేయరు. నోకియాను కొనుగోలు చేసినపుడు దాని 25 వేల మంది ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్ తీసుకుంది. తాజాగా తొలగిస్తున్న వారిలో 1,350 మంది ఫిన్లాండ్కి చెందిన వారైతే.. మిగిలిన వారు వివిధ దేశాల్లో పనిచేస్తున్నవారు ఉంటారని అంచనా. స్మార్ట్ఫోన్ల తయారీ బంద్! స్మార్ట్ఫోన్ల డిజైన్, తయారీకి దూరంగా ఉంటామని మైక్రోసాఫ్ట్‌కు ఫిన్లాండ్లో చీఫ్ షాప్ స్టివార్డ్‌గా వ్యవహరిస్తున్న కల్లే కీలి చెప్పారు. సాఫ్ట్‌వేర్‌పైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ‘ఎక్కడైతే మేం ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నామో.. ఆ విభాగంపైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తాం’ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా తెలిపారు. అంటే కంపెనీ విండోస్-10 మొబైల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, క్లౌడ్ సేవలకు ఇక ప్రాధాన్యమివ్వనుంది. ఫాక్స్‌కాన్‌కు ఫీచర్ ఫోన్ల వ్యాపారం విక్రయం మైక్రోసాఫ్ట్ ఇటీవలే నోకియా ఫీచర్ ఫోన్ల హక్కులను హెచ్ఎండీ గ్లోబల్‌కు, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ సంస్థ ఎఫ్ఐహెచ్ మొబైల్‌కు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది. దీంతో హెచ్ఎండీ గ్లోబల్, ఎఫ్ఐహెచ్ మొబైల్ సంస్థలు నోకియా బ్రాండ్ మొబైళ్లను, ట్యాబ్లెట్స్ను సంయుక్తంగా తయారుచేసి విక్రయిస్తాయి. కాగా అంతర్జాతీయంగా గత త్రైమాసికంలో 24 లక్షల విండోస్ ఫోన్ల అమ్మకం జరిగిందని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ తెలిపింది. ఇది మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్లో 0.7 శాతం. 2015 తొలి త్రైమాసికంలో విండోస్ ఫోన్ మార్కెట్ 2.5 శాతంగా ఉండేది. ఇక ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్ 84 శాతంగా, యాపిల్ ఓఎస్ ఫోన్ల మార్కెట్ 15 శాతంగా ఉందని గార్ట్నర్ తెలియజేసింది. కాగా మైక్రోసాఫ్ట్ తొలిసారి 1986లో ఐపీవోకు వచ్చింది. తర్వాత 1990 నుంచి విస్తరణ దిశగా అడుగులు వేస్తూ వచ్చింది. 2011 మేలో స్కైప్ టెక్నాలజీస్‌ను 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇదే కంపెనీ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు. అటుపై 2014లో నోకియాను 7.2 బిలియన్ డాలర్లకు విలీనం చేసుకుంది.