సాక్షి,ముంబై: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్(ఐబీఎం) తన సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వ్యాపారాన్ని భారతీయ టెక్ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు విక్రయించ నుంది. ఐబీఎం ఇందుకు1.80 బిలియన్ డాలర్లను (సుమారు రూ.12,700కోట్లు) వెచ్చించనుంది. ఈ మేరకు ఒక తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్‌సీఎల్ మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
2019 తొలి అర్ధభాగానికల్లా డీల్ పూర్తిచేసే అవకాశమున్నట్లు హెచ్‌సీఎల్ ప్రకటించింది. డీల్‌లో భాగంగా అధిక వృద్ధికి వీలున్న సెక్యూరిటీ, మార్కెటింగ్, కామర్స్ విభాగాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొడక్టులను ఐబీఎం నుంచి సొంతం చేసుకోనున్నట్లు హెచ్‌సీఎల్ సీఈవో సి.విజయకుమార్ తెలిపారు.
సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల పరిధిలో తమకు మొత్తం 50 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ ఉన్నట్లు ఐబీఎం ఒక ప్రకటనలో తెలిపింది. బిగ్ ఫిక్స్, మార్కెటింగ్ ఆటోమేషన్ ప్రొడక్ట్ యూనికా తదితర ఏడు ఉత్తులను హెచ్‌సీఎల్‌కు విక్రయించనున్నామని తెలిపింది. కాగా ఐబీఎం కూడా అమెరికాకు చెందిన ఐటీ సంస్థ రెడ్ హ్యాట్‌ను 34 బిలియన్ డాలర్ల( రుణంతో సహా) కొనుగోలు చేస్తోంది.
మరోవైపు ఈ మెగా డీల్ వార్తలతో ఇన్వెస్టర్లు హెచ్‌సీఎల్ టెక్ కౌంటర్లో అమ్మకాలకు తెరతీశారు. దీంతో ఈ షేరు ఒక దశలో దాదాపు 7శాతం పతనాన్ని నమోదుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment