
దేశీయంగా పేరొందిన మైక్రో బ్లాగింగ్ సోషల్ వేదిక కూ... క్రికెట్ ప్రేమికుల కోసం సబ్సే బడా స్టేడియం పేరిట వినూత్న క్రికెట్ అనుభవాన్ని అందిస్తోంది. తాజాగా ప్రారంభమవుతున్న టి 20 వరల్డ్ కప్‌ను పురస్కరించుకుని అందిస్తున్న ఈ వేదిక ద్వారా దేశీయ భాషలన్నింటిలోనూ క్రికెట్‌ను ఆస్వాదించవచ్చు. అదే విధంగా ఈ యాప్ వేదికగా ఇంటరాక్టివ్ సెషన్స్, వీరేంద్ర సెహ్వాగ్, నిఖిల్ చోప్రా, వెంకటేష్ ప్రసాద్, వినోద్ కాంబ్లీ తదితర లెజండరీ క్రికెటర్స్ పంచుకునే విశేషాలు, కామెంటేటర్స్, సెలబ్రిటీస్, యూజర్స్‌తో ముచ్చట్లు, లైవ్ మ్యాచ్ అప్‌డేట్స్, కూ ఆఫ్ ద మ్యాచ్ పేరిట అనాలసిస్, కూ ఫ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, పోల్ ఆఫ్ ద మ్యాచ్...వగైరాలన్నీ ఇందులో చోటు చేసుకోనున్నాయి.
దీనితో పాటే కూ క్రియేటర్ కప్ పేరిట ఒక యూజర్ కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. ఇది మ్యాచ్‌లు, క్రీడాకారులు, విశేషాలపై అప్పటికప్పుడు మీమ్స్, వీడియోస్ సృష్టించే కంటెంట్ క్రియేటర్ల సృజనాత్మక ప్రతిభకు అద్దం పడుతుంది. క్రికెట్ అభిమానులు తమ ఫేవరెట్ క్రికెటర్లకు స్థానిక భాషలో అభినందనలు తెలియజెప్పగలిగే అవకాశం దేశంలోనే తొలిసారి తాము అందిస్తున్నామని కూ యాప్ ప్రతినిధులు ఈ సందర్భంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment