Virender Sehwag Slams Pakistan Fans Criticize Hasan Ali.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ మ్యాచ్‌లో హసన్ అలీ హీరో నుంచి జీరో అయ్యాడు. మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచిన హసన్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లతో వేడ్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా వైపు తిప్పేశాడు. అలా జట్టు ఓటమికి హసన్ అలీనే కారణమంటూ పాక్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీనికి తోడూ మ్యాచ్ అనంతరం బాబర్ అజమ్ మాట్లాడుతూ.. '' హసన్ అలీ క్యాచ్ జారవిడవడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్'' అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో హసన్ అలీ పాకిస్తాన్ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆసక్తి కలిగించింది. దీంతో హసన్ అలీకి పలువురు మాజీ క్రికెటర్ల నుంచి మద్దతు పెరుగుతూ వస్తుంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మ్యాచ్ ఓటమికి హసన్ అలీని తప్పుబట్టడంపై ఫేస్‌బుక్ వేదికగా స్పందించాడు.
చదవండి: T20 World Cup 2021: మొన్న షమీ, కోహ్లి.. ఇప్పుడు హసన్ అలీ
''ఒక జట్టు కీలక మ్యాచ్‌లో ఓడిపోతే విమర్శలు రావడం సహజం. కానీ ఒక్క వ్యక్తినే తప్పుబడుతూ విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి చెందడం వెనుక హసన్ అలీ ఒక్కడే కారణం కాదు. అతను మాథ్యూ వేడ్ క్యాచ్‌ను డ్రాప్ చేసి ఉండొచ్చు.. మరి షాహిన్ అఫ్రిదిని తప్పుబట్టరా.. అతను పొదుపుగా బౌలింగ్ చేసి సిక్సర్లు ఇవ్వకుండా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇక్కడ పాక్ అభిమానులు ఒకే కోణంలో ఆలోచిస్తూ అసలు విషయాన్ని వదిలేసి హసన్ అలీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. మొన్న న్యూజిలాండ్‌కు డారిల్ మిచెల్ ఎలాగో.. నిన్న మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ అలాగే కనిపించాడు. అతను జట్టును ఎలా ఫైనల్ చేర్చాడో.. వేడ్ కూడా అలానే చేర్చాడు అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: T20 World Cup 2021: రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment