Shaheen Afridi Vs David Warner: పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టులో మూడోరోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సమయంలో వార్నర్, పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది నువ్వా-నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. అదేంటి ఇద్దరు గొడవపడ్డారా అనే సందేహం వద్దు. విషయంలోకి వెళితే.. అఫ్రిది వేసిన ఒక ఓవర్ చివరి బంతిని వార్నర్ డిఫెన్స్ ఆడాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఖవాజా పరుగు తీయడానికి ముందుకు రాగా వార్నర్ 'నో రన్' అంటూ గట్టిగా అరిచాడు.
ఇంతలో బంతి అందుకునేందుకు వచ్చిన అఫ్రిది అటు వైపు వెళ్లకుండా వార్నర్ మీదకు దూసుకొచ్చాడు. అతన్ని కొట్టేందుకు వెళుతున్నాడా అన్నట్లుగా దూసుకెళ్లాడు. తానేమైనా తక్కువ తిన్నానా అన్నట్లుగా వార్నర్ కూడా అఫ్రిదికి ఎదురెళ్లాడు. ఇద్దరు క్లోజ్‌గా వచ్చి ఒకరి కళ్లలో ఒకరు సీరియస్‌గా చూసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మొహాల్లో నవ్వులు విరపూశాయి. ఇది చూసిన మిగతా క్రికెటర్లు కూడా వీరి చర్యకు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. వార్నర్ 4, ఖవాజా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌట్ అయింది. కేవలం 20 పరుగుల వ్యవధిలో పాకిస్తాన్ చివరి ఆరు వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ జట్టుకు 123 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రావల్పిండి, కరాచీలో కాకుండా లాహోర్ పిచ్ కాస్త బౌలర్లకు కూడా సహకరిస్తుండటంతో ఈ టెస్టులో ఫలితం తేలే అవకాశం ఉంది. ఈ టెస్టులో నాలుగో రోజు ఆట అత్యంత కీలకం. ఆసీస్ ఎన్ని పరుగులు చేసి పాక్ కు లక్ష్యాన్ని నిర్దేశించనుందనేదానిమీద ఆ జట్టు విజయావకాశాలు ముడిపడి ఉన్నాయి.
చదవండి: ICC Suspend SA Cricketer: సౌతాఫ్రికా క్రికెటర్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ
PAK vs AUS: 20 పరుగుల వ్యవధిలో ఆలౌట్.. పేరును సార్థకం చేసుకున్న పాక్ జట్టు
Some fun banter between Warner vs Shaheen!!!!pic.twitter.com/EuQHjljMSp
— Johns. (@CricCrazyJohns) March 23, 2022
Comments
Please login to add a commentAdd a comment