Pak Vs Aus 2nd Test: David Warner Using Hammer To Fix Pitch, See His Wife Reaction - Sakshi
Sakshi News home page

David Warner: వార్నర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఏమైనా చేశావా?!

Published Thu, Mar 17 2022 1:28 PM | Last Updated on Thu, Mar 17 2022 2:45 PM

David Warner Tries To Fix Karachi Pitch With Hammer Became Viral - Sakshi

పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ ఓటమి ఖాయమనుకున్న దశలో కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ అసాధారణ పోరాటానికి తోడు.. మహ్మద్‌ రిజ్వాన్‌ మెరుపు సెంచరీ.. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ 96 పరుగులతో రాణించడంతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ టెస్టు ఫలితంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్న వేళ.. వార్నర్‌ చేసిన ఒక పని సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


విషయంలోకి వెళితే.. బౌలర్‌కు సుగమమైన ల్యాండింగ్‌ కోసం ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సుత్తితో మట్టిని తొలిగించిన సంగతి తెలిసిందే. కాసేపు గ్రౌండ్‌మెన్‌ అవతారం ఎత్తిన కమిన్స్‌ పనిని క్రికెట్‌ ఫ్యాన్స్‌ సరదాగా ట్రోల్‌ చేశారు. తాజాగా వార్నర్‌ కూడా ఐదో రోజు ఆటలో పాకిస్తాన్‌ స్కోరు 4 వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద ఉన్నప్పుడు సుత్తిని తీసుకొచ్చాడు. పిచ్‌పై ఉన్న ఫుట్‌మార్క్స్‌ను తొలగించే పనిలో మట్టిని సరిచేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది.

దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇది చూసిన పాక్‌ అభిమానులు..'' ఏంటి వార్నర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేస్తున్నావా'' అంటూ ఫన్నీ కామెంట్‌ చేశారు. అయితే వార్నర్‌ వీడియోపై అతని భార్య కాండీస్‌ స్పందించింది. '' ఇలాంటి పనిని మన ఇంటి పరిసరాల్లో  కాస్త ఎక్కువగా చేస్తావని ఆశిస్తున్నా'' అంటూ ఫన్నీగా ట్వీట్‌ చేశారు. ఇక తొలి రెండు టెస్టులు డ్రాగా ముగియడంతో కీలకమైన మూడో టెస్టు లాహోర్‌ వేదికగా సోమవారం(మార్చి 21 నుంచి) జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లోనైనా ఫలితం వస్తుందా లేక మళ్లీ డ్రా ఫలితమే కనిపిస్తుందా అనేది చూడాలి.

చదవండి: AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు

PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్‌‌.. ఇప్పుడు పాకిస్తాన్‌ బ్యాటర్‌; సీన్‌ రిపీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement