
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో డేవిడ్ వార్నర్, షాహిన్ అఫ్రిది వ్యవహారం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మూడోరోజు ఆటలో ఆఖరి ఓవర్ సందర్భంగా వార్నర్, అఫ్రిది 'నువ్వా-నేనా' అన్నట్లు ఒకరి కళ్లలోకి ఒకరు సీరియస్‌గా చూసుకున్నారు. ఇదంతా కేవలం సరదాతో చేశారు. కానీ దీనికి సంబంధించిన ఫోటోపై సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి.
తాజాగా నాలుగోరోజు ఆటలో వార్నర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అఫ్రిది వేసిన ఒక అద్భుత బంతికి వార్నర్ క్లీన్‌బౌల్డ్ అవ్వాల్సి వచ్చింది. అలా వార్నర్‌పై అఫ్రిది పైచేయి సాధించాడు. అయితే పెవిలియన్ వెళ్తున్న వార్నర్‌కు అఫ్రిది షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఆ సన్నివేశానికి మిగతా ఆటగాళ్లు అలా చూస్తుండిపోయారు. ఇక అభిమానులు కూడా ఈ ఫోటోపై స్పందించారు. నిన్నేమో కత్తులు దూసుకున్నారు... ఇవాళ చేతులు కలిపారు. మొత్తానికి శుభం కార్డు పడింది అంటూ కామెంట్ చేశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో దూకుడైన ఆటతీరు కనబరుస్తుంది. పాక్ బౌలర్లకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజాలు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించిన అనంతరం 51 పరుగులు చేసిన వార్నర్ అఫ్రిది బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 294 పరుగులు ఆధిక్యంలో ఉంది. ఇక మరో సెషన్ మాత్రమే మిగిలి ఉండడంతో రోజంతా ఆడి పాక్ ముందు భారీ స్కోరు పెట్టాలని ఆసీస్ నిర్ణయించుకుంది.
చదవండి: PAK vs AUS: 'నువ్వా- నేనా' అంటూ కత్తులు దూసుకున్న వార్నర్, అఫ్రిది
PAK vs AUS: 20 పరుగుల వ్యవధిలో ఆలౌట్.. పేరును సార్థకం చేసుకున్న పాక్ జట్టు
Shaheen Afridi hitting the stumps >>>>>>>
— ESPNcricinfo (@ESPNcricinfo) March 24, 2022
(via @TheRealPCB)pic.twitter.com/NHVNhKxK6d