సుత్తితో క్రీజులోకి ఆసీస్‌ కెప్టెన్‌‌​.. ఎగతాళి చేసిన పాక్‌ అభిమానులు | Pakistan Fans Troll Pat Cummins Looks Like New Thor Entry With Hammer | Sakshi
Sakshi News home page

Pat Cummins: సుత్తితో క్రీజులోకి ఆసీస్‌ కెప్టెన్‌‌​.. ఎగతాళి చేసిన పాక్‌ అభిమానులు

Mar 16 2022 12:18 PM | Updated on Mar 16 2022 1:20 PM

Pakistan Fans Troll Pat Cummins Looks Like New Thor Entry With Hammer - Sakshi

పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సుత్తితో క్రీజులోకి వచ్చి పిచ్‌ను మరమత్తు చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ 53వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. కామెరాన్‌ గ్రీన్‌ బౌలింగ్‌ చేయడానికి సిద్దమయ్యాడు. అయితే బంతి విసిరే సమయంలో ల్యాండింగ్‌ ఏరియా కాస్త గట్టిగా ఉండడంతో గ్రీన్‌కు ఇబ్బందిగా మారింది.

దీంతో సుత్తి పట్టుకొచ్చిన కెప్టెన్‌ కమిన్స్‌ గ్రౌండ్‌మన్‌ అవతారం ఎత్తి.. సుత్తితో మట్టిని కొట్టాడు. కాస్త బలాన్ని ఉపయోగించి బౌలర్‌కు ల్యాండింగ్‌ సుగమమయ్యేలా మట్టిని తొలగించాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఇది చూసిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) కమిన్స్‌ను ''నయా థోర్‌'' అంటూ కామెంట్‌ చేసింది. ఇది చూసిన పాక్‌ అభిమానులు కమిన్స్‌ను ఎగతాళి చేశారు. '' థోర్‌ కంటే నువ్వే బాగున్నావు.. మార్వెల్‌ సినిమాలో నటిస్తావా''.. ''కెప్టెన్‌ కమ్‌ థోర్‌ కమ్‌ కమిన్స్‌'' అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో ధీటుగా బదులిస్తోంది. 506 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ ప్రస్తుతం 106 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. బాబర్‌ అజమ్‌ 129, అబ్దుల్లా షఫీక్‌ 92 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్‌ విజయానికి 263 పరుగులు అవసరం కాగా.. విజయానికి ఆసీస్‌ 8 వికెట్ల దూరంలో ఉంది.

చదవండి: 46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్‌ హీరోయిన్‌

IPL 2022: ఐపీఎల్‌లో తెలుగోళ్లు... తొలి సారిగా అంపైర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement