Pat Cummins History 11 Years Awaited to Win Test Series in Asia Country - Sakshi
Sakshi News home page

Pat Cummins: ఆసీస్‌ కెప్టెన్‌గా కమిన్స్‌ అరుదైన ఫీట్‌..

Mar 25 2022 7:42 PM | Updated on Mar 25 2022 8:30 PM

Pat Cummins History 11 Years Awaited To Win Test Series In Asia Country - Sakshi

పాకిస్తాన్‌ గడ్డపై 24 ఏళ్ల తర్వాత అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు శుభారంభం చేసింది. తొలి రెండు టెస్టులు ఫేలవ డ్రాగా ముగియడం విమర్శలకు దారి తీసింది. కనీసం మూడో టెస్టులోనైనా ఫలితం వస్తుందా అనుకున్న సమయంలో ఆసీస్‌ ఆ ఫీట్‌ను ఎట్టకేలకు సాధించింది. లాహోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా పాక్‌పై 115 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకొని మూడు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఈ విజయంతో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ అరుదైన ఫీట్‌ను సాధించాడు. పాకిస్తాన్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచిన మూడో కెప్టెన్‌గా కమిన్స్‌ నిలిచాడు. ఇంతకముందు 1959/60లో రిచీ బెనార్డ్‌ ఆధ్వర్యంలో తొలిసారి 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1998/99లో మార్క్‌ టేలర్‌ నేతృత్వంలో మూడు టెస్టుల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. అప్పటినుంచి 24 ఏళ్ల పాటు ఆసీస్‌ మళ్లీ పాక్‌లో అడుగుపెట్టలేదు. తాజాగా కమిన్స్‌ నాయకత్వంలో ఆస్ట్రేలియా మరోసారి టెస్టు సిరీస్‌ను గెలిచి సత్తా చాటింది. అంతేకాదు 2011 తర్వాత ఆసియా గడ్డపై ఆస్ట్రేలియా ఒక సిరీస్‌ గెలవడం మళ్లీ ఇదే కావడం విశేషం. ఆఖరిసారి 2011లో లంకపై 1-0తో సిరీస్‌ గెలిచింది. ఆ సమయంలో మైకెల్‌ క్లార్క్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. తాజాగా కమిన్స్‌ 11 ఏళ్ల తర్వాత ఆసియా గడ్డపై సిరీస్‌ విక్టరీ సాధించి అరుదైన ఫీట్‌ అందుకున్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్‌ 235 పరుగులకే ఆలౌటైంది.  73/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో  ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన పాక్‌.. ఓ దశలో చారిత్రక విజయం దిశగా సాగింది. అయితే ఆసీస్‌ బౌలర్లు నాథన్‌ లియోన్‌ (5/83), పాట్‌ కమిన్స్‌ (3/23) పాక్ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (55), ఇమామ్ ఉల్ హక్ (70) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించగా, మిగతా వారంతా దారుణంగా నిరుత్సాహపరిచారు. పాక్‌ జట్టు కేవలం 22 పరుగుల వ్యవధిలో తన చివరి ఐదు వికెట్లు కోల్పోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు) చెలరేగిన కమిన్స్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికవగా, సిరీస్‌ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఉస్మాన్ ఖవాజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక ఇరు జట్ల మధ్య తొలి వన్డే లాహోర్‌ వేదికగానే మార్చి 29న జరగనుంది.

చదవండి: PAK VS AUS 3rd Test: తిప్పేసిన లియోన్‌.. పాక్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన ఆసీస్‌

ENG vs WI: చరిత్రలో రెండోసారి మాత్రమే.. 145 ఏళ్ల రికార్డు బద్దలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement