David Warner 164- Australia's dominance over Pakistan on Day 1: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా మొదటి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఆస్ట్రేలియా- పాకిస్తాన్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు గురువారం ఆరంభమైంది.
పెర్త్ వేదికగా మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆది నుంచే దూకుడైన బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లకు చెమటలు పట్టించాడు.
కొరకరాని కొయ్యగా మారి.. టీ20 తరహా ఇన్నింగ్స్‌తో 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్.. దానిని శతకంగా మలచడంలో సఫలమయ్యాడు. మొత్తంగా 211 బంతులు ఎదుర్కొన్న ఈ వెటరన్ ఓపెనర్ 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 164 పరుగులు సాధించాడు.
మరో ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా 41 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే, వీళ్లిద్దరు అందించిన శుభారంభాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు మిగిలిన బ్యాటర్లు. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 16 పరుగులకే పెవిలియన్ చేరగా.. స్టీవ్ స్మిత్ 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇక వన్డే వరల్డ్‌కప్-2023 హీరో ట్రవిస్ హెడ్ మాత్రం 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. వార్నర్ సెంచరీ కారణంగా ఈ మేరకు స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది.
ఇదిలా ఉంటే.. తన కెరీర్‌లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్ మొదటి మ్యాచ్ మొదటి రోజే సెంచరీ బాదడం విశేషం. అంతర్జాతీయ టెస్టుల్లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌కు ఇది 26వ శతకం కాగా.. ఓవరాల్‌గా 49వది.
ఇలా అద్భుత ఇన్నింగ్స్‌తో తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన వార్నర్‌పై క్రికెట్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తుండగా.. పాక్ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘మేమేం పాపం చేశాం వార్నర్ భాయ్?’’ అని బాధపడుతూ ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇందుకు తగ్గట్లుగానే ఇమ్రాన్ సిద్ధికీ అనే ఎక్స్ యూజర్.. ‘‘పాకిస్తాన్ మీద వార్నర్‌కు ఇది ఆరో సెంచరీ.. మేం చేసిన తప్పేంటి భయ్యా!’’ అంటూ వార్నర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో షేర్ చేయడం హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ఆస్ట్రేలియా- పాకిస్తాన్ తొలి టెస్టు తొలి రోజు ఆట మొత్తమంతా డేవిడ్ వార్నర్ ట్రెండింగ్‌లో నిలిచాడు.
A century to silence all the doubters. David Warner came out meaning business today.@nrmainsurance #MilestoneMoment #AUSvPAK pic.twitter.com/rzDGdamLGe
— cricket.com.au (@cricketcomau) December 14, 2023
Its a 6th Century for David Warner Against Pakistan Bhaii Humne Kya bigara hai ? pic.twitter.com/Gry5QkHbaN
— ٰImran Siddique (@imransiddique89) December 14, 2023
Comments
Please login to add a commentAdd a comment