బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో వరుసగా రెండో ఎపిసోడ్‌లో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. సెప్టెంబర్ 19న ప్రసారమైన ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌ను భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 10కి 10 వికెట్లకు సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొనగా.. నిన్న (సెప్టెంబర్ 20) ప్రసారమైన ఎపిసోడ్‌లో మరో కంటెస్టెంట్ వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొన్నాడు.
19వ తారీఖున ప్రసారమైన ఎపిసోడ్‌లో కుంబ్లేకు సంబంధించిన ప్రశ్నకు ప్రైజ్‌మనీ 12 లక్షల 50 వేల రూపాయలు కాగా.. సెప్టెంబర్ 20న సెహ్వాగ్ గురించిన ప్రశ్నకు ప్రైజ్‌మనీ 3 లక్షల 20 వేల రూపాయలుగా ఉంది.
ఇంతకీ ప్రశ్న ఏంటంటే..?
వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో తాను చేసిన ఏకైక డబుల్ సెంచరీని ఏ స్టేడియంలో చేశాడు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా బారాబతి స్టేడియం, కటక్.. ఈడెన్ గార్డెన్స్ కోల్‌కతా.. హోల్కర్ స్టేడియం, ఇండోర్.. బ్రబోర్న్ స్టేడియం, ముంబైలను ఇచ్చారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి.
గత ఎడిసోడ్‌లోని ప్రశ్న ఏంటంటే..?
భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు (పాక్‌పై) తీసినప్పుడు బౌలర్ ఎండ్‌లో ఉన్న అంపైర్ ఎవరు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా పిలూ రిపోర్టర్, ఎస్ వెంకట్రాఘవన్, డేవిడ్ షెపర్డ్, ఏవీ జయప్రకాశ్ పేర్లు ఇచ్చారు.
ఇదిలా ఉంటే, వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో తాను చేసిన ఏకైక డబుల్ సెంచరీ 2011లో వెస్టిండీస్‌పై చేశాడు. నాటి మ్యాచ్‌లో వీరూ 149 బంతుల్లో 25 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 219 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ (67), సురేశ్ రైనా (55) కూడా అర్ధసెంచరీలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటై 153 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment