ట్విట్టర్‌కు కేంద్రానికి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు దేశీ సోషల్ మీడియా నెట్ వర్క్ 'కూ' కు వరంగా మారింది. కూ' ను ప్రారంభించిన కేవలం 16 నెలల కాలంలో 10మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుందని సోషల్ మీడియా స్టాటిటిక్స్ సెన్సార్ టవర్ తెలిపింది.
ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం
అమెరికాకు చెందిన ట్విట్టర్‌ను వినియోగించే జాబితాలో భారత్ 22.1 మిలియన్ల యూజర్లతో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో నవంబర్ 14,2019 లో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఎంట్రప్రెన్యూర్ లు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ లు బెంగళూరు కేంద్రంగా 'కూ' ను అందుబాటులోకి తెచ్చారు.
ట్విట్టర్ కు కేంద్రానికి వైరం
2020 నాటికి కూ యాప్ ను 2.6 మిలియన్ల మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. అయితే ట్విట్టర్ భారత్ నిబంధనల్ని ఉల్లంఘిస్తుందంటూ పలువురు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులపై కేంద్రం ట్విట్టర్‌కు పలు ఆదేశాలు జారీ చేసింది. అయినా ట్విట్టర్ లైట్ తీసుకుంది.ముఖ్యంగా 2020-21 మధ్య కాలంలో వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళన, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సర్టిఫైడ్ బ్లూ టిక్ ను తొలగించడం, కేంద్రం తెచ్చిన ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించడంతో కేంద్రానికి - ట్విట్టర్‌ల మధ్య వార్ మొదలైంది. దీంతో కేంద్ర కేబినెట్ మినిస్టర్లు పియూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్‌లు ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి దేశీ నెట్‌వర్క్ కూ'ను వినియోగించడం ప్రారంభించారు. అప్పటి నుంచే ట్విట్టర్ యూజర్లు కాస్త కూ కు అలవాటు పడ్డారు.
దేశీ నెట్ వర్క్
కేంద్రం - ట్విట్టర్‌ల వివాదం కూ' కు ప్లస్ అయ్యింది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర స్థానిక భాషల్లో ఆపరేట్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన ఈ నెట్ వర్క్‌ను 85శాతం మంది యూజర్లు వినియోగిస్తున్నారు. ట్విట్టర్ యూజర్లు కాస్త దాన్ని వదిలేసి కూ ను వినియోగించేందుకు క‍్యూ కడుతున్నారు.వారిలో మంత్రులు,బాలీవుడ్ సెలబ్రిటీస్, క్రికెటర్లతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కూ కో ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ స్థానిక భాషాల్లో దేశీ యాప్‌ను వినియోగించేలా డెవలప్ చేశామన్నారు. త్వరలోనే సౌత్ ఈస్ట్ ఏసియన్ కంట్రీస్, ఈస్ట్రన్ యూరప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
చదవండి : ఫేస్‌బుక్‌లో హింస ఈ రేంజ్‌లో ఉందా!?
Comments
Please login to add a commentAdd a comment