Micro Blogging web site
-
ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!
ట్విటర్‌కు పోటీగా మరో మైక్రోబ్లాగింగ్ సైట్ వస్తోంది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్‌డోర్సే ‘బ్లూస్కై’ అనే యాప్ బీటా వర్షన్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. టెక్‌క్రంచ్ కథనం ప్రకారం.. బ్లూస్కై ప్రస్తుతం ఇన్వైట్-ఓన్లీ బీటా వర్షన్ అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 17న అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను ఇప్పటివరకు 2 వేల మంది ఎంపిక చేసిన యూజర్లు ఇన్స్టాల్ చేసుకున్నట్లు డేటా.ఏఐ అనే యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది. ట్విటర్ మాదిరిగానే బ్లూస్కై యూజర్ ఇంటర్ఫేస్ను కూడా చాలా సింపుల్‌గా రూపొందించారు. 256 అక్షరాల వరకు నిడివితో యూజర్లు చాలా తేలికగా పోస్ట్‌లు చేయొచ్చు. ప్లస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా సులువుగా ఫొటోలు జోడించొచ్చు. ట్విటర్లో ఉన్న ‘వాట్ ఈజ్ హాపెనింగ్?’ అన్న ఆప్షన్‌కు బదులుగా ఇందులో ‘వాట్స్అప్?’ అనే ఆప్షన్ ఉంది. అలాగే బ్లూస్కైలో షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ వంటి ఆప్షన్స్‌తో పాటు కొత్తవారిని కూడా యాడ్ చేసే అడ్వాన్స్డ్ ఫీచర్ ఇందులో ఉంది. (ఇదీ చదవండి: లేఆఫ్స్ వేళ ఫ్రెంచ్ కంపెనీ సంచలనం.. కొత్తగా 12 వేల మందికి ఉద్యోగాలు!) యాప్ మధ్యలో ఇచ్చిన డిస్కవర్ ట్యాబ్ ద్వారా.. యూజర్లు ఎవరిని ఫాలో అవ్వాలి, సజెషన్స్, తాజా అప్డేట్స్ ఫీడ్‌ను తెలుసుకోవచ్చు.అలాగే నోటిఫికేషన్స్ ట్యాబ్ ద్వారా లైక్స్, రిపోర్ట్స్, ఫాలోస్, రిప్లయిస్ వంటివి చూసుకోవచ్చు. అయితే ఇందులో ప్రస్తుతానికి డెరెక్ట్ మెసేజ్ (డీఎం) ఫీచర్ లేదు. ట్విటర్ మాదిరిగానే బ్లూస్కైలో కూడా యూజర్లు సెర్చ్, ఫాలో, తమకు పోస్ట్‌లకు సంబంధించిన అప్డేట్లను హోం టైమ్‌లైన్‌లో చూసుకోవచ్చు. ఈ బ్లూస్కై ప్రాజెక్ట్‌ను 2019లోనే అభివృద్ధి చేసినప్పటికీ దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి, మరింతగా అభివృద్ధి చేసి 2022లో స్వతంత్ర కంపెనీగా ఆవిష్కరించారు. జాక్ డోర్సే ట్విటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ బ్లూస్కై గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత 2022 అక్టోబర్‌లో ఏ యాప్‌తో అయినా సరే పోటీ విధింగా బ్లూస్కైని రూపొందిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలియజేశారు. బ్లూస్కై గతేడాది 13బియన్ డాలర్ల నిధులను సమీకరించింది. -
వావ్! ట్విటర్లో అదిరిపోయే ఆ సరికొత్త ఫీచర్ వచ్చేస్తోంది!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ త్వరలో మరో సరికొత్త ఫీచర్లను ఎనేబుల్ చేయనున్నట్లు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్రాన్స్‌లేటింగ్, ఇతర దేశాల్లో ట్రెండ్ అవుతున్న ట్వీట్లు, సాంప్రదాయలు సైతం యూజర్లకు రికమండ్ చేసేలా ఫీచర్‌ను బిల్డ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో తదుపరి అప్డేట్ వినియోగదారులను వారి అనుకూల సెట్టింగ్‌ల నుండి సిఫార్సు చేసిన ట్వీట్లకు మార్చడాన్ని నిలిపివేయడం అని ఆయన చెప్పారు. In coming months, Twitter will translate & recommend amazing tweets from people in other countries & cultures — Elon Musk (@elonmusk) January 21, 2023 మరికొన్ని నెలల్లో ట్విటర్ ట్రాన్స్లేషన్ అండ్ ఇతర యూజర్ల నుంచి రికమండ్ ట్వీట్లు, ఇతర దేశాలు, సంప్రాదాయాలు గురించి తెలుసుకునేలా వీలు కల్పిస్తున్నాం. ప్రత్యేకించి జపాన్ వంటి దేశాల గురించి ప్రతి రోజు ట్విట్లను యూజర్లు వీక్షించే వెసలుబాటు కల్పిస్తున్నాం.’ అంటూ మస్క్ ట్విట్లో పేర్కొన్నారు. లక్షల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన నాటి నుంచి ట్విటర్లో అనేక మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే గత డిసెంబర్ నెలలో రికమండెడ్ ట్విట్లను చూసేలా, ఆఫ్ చేసేలా టోగుల్(ఆన్ ఆఫ్ బటన్) ఫీచర్‌ను స్వైప్ చేసే లెప్ట్ అండ్ రైట్ ఆప్షన్, బుక్ మార్క్ బటన్, వచ్చే నెలలో ఎక్కువ పదాల్ని వినియోగించే ట్వీట్ చేసేలా లాంగ్ ఫారమ్ ఆప్షన్ అందిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. చదవండి👉 ఎలాన్ మస్క్ ఖాతాలో ప్రపంచంలో అత్యంత అరుదైన చెత్త రికార్డ్ -
ట్విటర్‌కు షాక్: లక్షలకొద్దీ కొత్త యూజర్లతో ప్రత్యర్థులకు పండగ
న్యూఢిల్లీ: టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌ను ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత అనేక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు ట్విటర్‌కు గుడ్ బై చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారట. ప్రత్యామ్నాయాలను ప్లాట్‌ఫారమ్ వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్స్‌కు కలిసి వస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా మాస్టోడాన్‌కు లక్షలమంది కొత్త వినియోగదారులు జత అవుతున్నారు. మాస్టోడాన్ ఆవిష్కారం ఎపుడు? దాదాపు ట్విటర్లానే పనిచేసే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ మాస్టోడాన్. 2016లో యూజెన్ రోచ్కోచే దీన్ని స్థాపించారు. ద్వేషపూరిత ప్రసంగాలను, పోస్ట్‌లను నియంత్రిస్తూ స్వీయ-హోస్ట్ సోషల్ నెట్వర్కింగ్ సేవలందించే ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. అయితే ట్విటర్ టేకోవర్ తరువాత నెలకొన్న గందరగోళం నేపథ్యంలో జర్నలిస్టులు, నటులతోపాటు, ఇతర సెలబ్రిటీలు మాస్టోడాన్‌కి షిప్ట్ అవుతున్నారట. ముఖ్యంగా జర్నలిస్ట్ మోలీ జోంగ్-ఫాస్ట్ నటుడు, హాస్యనటుడు కాథీ గ్రిఫిన్ ఇప్పటికే మాస్టోడాన్‌కు మారిపోయారు. మాస్టోడాన్ వ్యవస్థాపకుడు, సీఈవో ట్వీట్ ప్రకారం ఈ ప్లాట్‌ఫారమ్‌లో అంతకుముందెన్నడూ లేని విధంగా యూజర్లు పెరిగారు. ప్రస్తుతం మాస్టోడాన్‌కు 6,55,000 మంది నెలవారీ వినియోగ దారులుండగా, అక్టోబర్ 27న మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన గత వారం రోజుల్లో 230,000 మందికి పైగా కొత్త యూజర్లు చేరారు. మరోవైపు తన ఫోటో, పేరుతో కామెడీ ఖాతా తెరిచిన నటి కాథీ గ్రిఫిన్ ట్విటర్ ఖాతాను బ్యాన్ చేశారు మస్క్. బ్లూస్కీ సోషల్: ట్విటర్ ఫౌండర్, మాజీ సీఈవో జాక్ డోర్సే గత వారం లాంచ్ చేసిన కొత్త బ్లాక్‌చెయిన్ ఆధారిత సోషల్ మీడియా బ్లూస్కీ సోషల్‌లో రెండు రోజుల్లోనే 30,000 మందికి పైగా సైన్ అప్ చేశారు. మస్క్-ట్విటర్ డీల్ తరువాత ప్రత్యామ్నాయంగా ఈ యాప్‌వైపు మొగ్గు తున్నారు యూజర్లు. కూ: ఇండియాకుచెందిన బహుళ-భాషా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ యాప్ ఇటీవల 50 మిలియన్ల డౌన్లోడ్లను దాటేసింది. యాప్ ఈ సంవత్సరం ప్రారంభం నుండి వినియోగదారులు, గడిపిన సమయం, ఎంగేజ్మెంట్లో భారీ పెరుగుదలను సాధించింది. 2020లో ప్రారంభించిన ఈ యాప్ 10 భాషల్లో అందుబాటులో ఉంది. ఇండియాలో దాదాపు అన్ని ప్రభుత్వరంగ శాఖలు, ఉన్నతా ధికారులు ప్రభుత్వరంగ ఉద్యోగులు, కూ యాప్‌లో నమోదై ఉండటం గమనార్హం. The number of people who switched over to #Mastodon in the last week alone has surpassed 230 thousand, along with many returning to old accounts bumping the network to over 655 thousand active users, highest it's ever been! Why? 👉 https://t.co/9Ik30hT3xR — Mastodon (@joinmastodon) November 3, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4961499954.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4961499954.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ట్విటర్ ఉద్యోగుల తొలగింపులో ‘యూటర్న్’
ఉద్యోగుల తొలగింపులో ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ ‘యూటర్న్’ తీసుకున్నారు. 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ ఆ సంస్థలోని సగానికి పైగా ఉద్యోగుల్ని తొలగించారు. ఇప్పుడు వారిని తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ట్విటర్ ప్రక్షాళనలో భాగంగా మస్క్ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించారు. అయితే తాను ఊహించిన విధంగా కొత్త ఫీచర్లను తయారు చేయాలంటే ఫైర్ చేసిన ఉద్యోగుల పనితనం, అనుభవం అవసరం. కానీ మేనేజ్మెంట్ వారిని గుర్తించకుండానే పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి సాగనంపింది. ఇప్పుడు జరిగిన తప్పిదాన్ని గుర్తించిన ట్విటర్ యాజమాన్యం ఆ ఉద్యోగుల్ని సంప్రదించి.. తిరిగి వారు విధుల్లో చేరేలా మంతనాలు జరుపుతోందంటూ’ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఆ ఉద్యోగులు ఎవరంటే ఇటీవల ట్విటర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్‌లోని ఉద్యోగులతో సహా 50 శాతం మంది సిబ్బందిపై వేటు వేసినట్లు ఆ సంస్థ సేఫ్టీ అండ్ ఇంటెగ్రిటీ హెడ్ యోయెల్ రోత్ ఈ వారం ప్రారంభంలో ఒక ట్వీట్లో తెలిపారు. ఆ ట్వీట్ల ఆధారంగా కమ్యూనికేషన్స్, కంటెంట్ క్యూరేషన్, హ్యూమన్ రైట్స్, మెషిన్ లెర్నింగ్ ఎథిక్స్‌కు బాధ్యత వహించే టీమ్‌లు, ప్రొడక్ట్, ఇంజినీరింగ్ టీమ్‌లు ఉన్నాయి. ఇప్పుడు ట్విటర్ పైన పేర్కొన్నట్లుగా ఏ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని రీ జాయిన్ చేయించుకుంటుంది. తొలగించిన ఉద్యోగులతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారా’ అనే విషయాలు తెలియాల్సి ఉంది. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ -
‘ఎలాన్ మస్క్‌కు ఊహించని షాక్’..ట్విట్టర్ ఉద్యోగుల వార్నింగ్
ఎలాన్ మస్క్- ట్విట్టర్ కొనుగోలు ఒప్పొందం గడువు దగ్గర పడుతున్న వేళ తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే? మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తే ఆ సంస్థకు చెందిన 75 శాతం మంది ఉద్యోగులపై వేటు పడనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో మస్క్‌కు ట్విట్టర్ ఉద్యోగులు వార్నింగ్ ఇచ్చారు. డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీ ఎలాన్ మస్క్‌కు డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల లోపు మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని తీర్పిచ్చింది. దీంతో ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మస్క్ బాస్ అయితే తమ ఉద్యోగాలు ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మస్క్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ ట్విట్టర్ ఉద్యోగులు యాజమాన్యానికి బహిరంగంగా లేఖ రాశారు. టైమ్ నివేదిక ప్రకారం..కొనుగోలు డీల్ శుక్రవారంతో ముగియనుండగా..తొలగింపుల్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.‘మస్క్ నిర్ణయం అనాలోచితమైంది. నిర్లక్ష్యమైంది. యూజర్లను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. కస్టమర్లు తమ ప్లాట్‌ఫామ్‌పై పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లుతుంది. వేధింపులు, బెదిరింపులు లాంటి వాతావరణంలో మేం పనిచేయలేం’ అని లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు పలు డిమాండ్లను సంస్థ ముందుంచారు. చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించడంతో పాటు ఉద్యోగులకు ఇతర ప్రయోజనాల్ని కొనసాగించాలని తెలిపారు. సిద్ధాంత పరంగా ట్విట్టర్‌కు మస్క్‌ల మధ్య అంతరాయం ఉంది.‘యాజమాన్యం ఉద్యోగుల పట్ల వారి జాతి, లింగం, వైకల్యం, రాజకీయ విశ్వాసాల ఆధారంగా వివక్ష చూపకూడదని మేము కోరుతున్నాము’ అని లేఖలో తెలిపారు. ఎలాన్ మస్క్‌కు నష్టమే ట్విట్టర్ ఉద్యోగులపై వేటు మస్క్‌కు నష్టమే తప్పా లాభం లేదని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అంతేకాదు కంపెనీ ఎవరి యాజమాన్యంలో ఉన్నా రాబోయే నెలల్లో ఉద్యోగాల కోత ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పింది. ఇక ఉద్యోగులపై మాస్ లే ఆఫ్స్ నిస్సందేహంగా ట్విట్టర్ రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయని, అందులో హానికరమైన కంటెంట్‌ను నియంత్రించే సామర్థ్యం, భద్రతా సమస్యలను ఎదుర్కోవడం వంటి వాటిపై ప్రభావం చూపుతుందని వాషింగ్టన్ నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉 ‘ఎలాన్ మస్క్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది’..విడుదల ఎప్పుడు, ధర ఎంత! -
ట్విట్టర్‌ను అమ్మేయండి..కొంటా : ఎలాన్ మస్క్
న్యూయార్క్: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ కొనుగోలు విషయంలో ముందుకే వెళ్లాలని ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముందుగా అనుకున్న రేటుకే డీల్‌ను పూర్తి చేస్తానని ఆఫర్ చేస్తూ కంపెనీకి ఆయన ఈ మేరకు లేఖ పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వార్తలతో ట్విటర్ షేరు ఒక్కసారిగా ఎగిసింది. దాదాపు 13 శాతం పెరిగి 47.95కి చేరింది. దీంతో షేర్లలో ట్రేడింగ్ నిల్చిపోయింది. షేరు ఒక్కింటికి 54.20 డాలర్ల చొప్పున మొత్తం 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేస్తానంటూ మస్క్ గతంలో ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత వివిధ కారణాలు చూపి మస్క్ వెనక్కి తగ్గడంతో వివాదం కోర్టుకు చేరింది. ట్విటర్‌ను కొనుగోలు చేసేలా మస్క్‌ను ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్ .. ఈ నెలలో తదుపరి విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ట్విటర్ డీల్‌కు మస్క్ బ్రేకులు
లండన్: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కొనుగోలు చేసే అంశం కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ట్విటర్ చూపుతున్న స్పామ్, నకిలీ ఖాతాల సంఖ్యపై మస్క్ సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డీల్‌ను తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్యలో స్పామ్, నకిలీ ఖాతాలు అయిదు శాతం కన్నా తక్కువే ఉంటాయంటూ మార్చి త్రైమాసిక ఫలితాల్లో ట్విటర్ వెల్లడించిన వార్తను తన ట్వీట్‌కు ఆయన జత చేశారు. ‘మొత్తం యూజర్లలో నకిలీ ఖాతాల సంఖ్య నిజంగానే అయిదు శాతం కన్నా తక్కువే ఉందని «ధ్రువీకరించే వివరాలు అందేవరకూ ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా ఆపుతున్నాం‘ అని మస్క్ వెల్లడించారు. అయితే, ఈ ఒక్క అంశం వల్ల ట్విటర్ టేకోవర్ ఒప్పందానికి విఘాతమేదైనా కలుగుతుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అటు ట్విటర్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇద్దరు టాప్ మేనేజర్లను తొలగించిన ట్విటర్.. కీలక స్థానాలకు మినహా ఇతరత్రా నియామకాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని పేర్కొంది. డీల్ నుంచి బైయటపడేందుకు సాకు.. డీల్ నుంచి బైటపడటానికి మస్క్.. నకిలీ ఖాతాల సాకును చూపుతున్నట్లుగా అనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. తద్వారా టేకోవర్ కోసం 44 బిలియన్ డాలర్లు వెచ్చించే బదులు పరిహారం కింద గరిష్టంగా 1 బిలియన్ డాలర్లు కట్టి మస్క్ తప్పించుకునే యోచనలో ఉండొచ్చని పేర్కొన్నాయి. ఇన్వెస్టర్ల అభిమతానికి విరుద్ధంగా ట్విటర్‌పై దృష్టి పెట్టడం వల్ల టెస్లా వ్యాపారం గాడి తప్పే అవకాశం ఉండటం కూడా ఇందుకు కారణం కావచ్చని వివరించాయి. మరోవైపు, కంపెనీ షేరు కుదేలయ్యే రకంగా చేసి, మరింత చవకగా దక్కించుకోవాలని మస్క్ భావిస్తుండవచ్చని మరికొందరు పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ట్విటర్ షేరు కుదేల్.. టేకోవర్ డీల్‌కు బ్రేకులు పడ్డాయన్న వార్తలతో ట్విటర్ షేరు శుక్రవారం ఒక దశలో ఏకంగా 10 శాతం పైగా పతనమై 40.01 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అటు టెస్లా ఆరు శాతం పైగా ఎగిసి 775 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. షేరు ఒక్కింటికి 54.20 డాలర్లు ఇస్తానంటూ మస్క్ ఆఫర్ ఇచ్చిన రోజున ట్విటర్ షేరు సుమారు 45 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ఆ తర్వాత డీల్ వార్తలతో 50 డాలర్ల పైకి ఎగిసింది. కానీ తాజా పరిస్థితులతో 40 డాలర్ల స్థాయికి పడిపోయింది. -
అభ్యంతరకర భాష..అడ్డుకోవడమే లక్ష్యం: కూ యాప్
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు సవ్యమైన భాష, వ్యాఖ్యలను ప్రోత్సహించడానికి ధేశీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫార్మ్ కూ ఆధ్వర్యంలోని బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మైసూర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు యాప్‌కు చెందిన కంటెంట్ నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి, అలాగే యూజర్లకు ఆన్లైన్లో సురక్షితమైన పరిస్థితులను కల్పించడానికి ఈ రెండు సంస్థలూ కలిసి పనిచేయనున్నాయి. ఆన్లైన్ బెదిరింపులు, అసంబద్ధ ఆరోపణల వాతావరణం నుండి యూజర్లకు రక్షణ కల్పించడానికి మరియు పారదర్శకమైన ప్లాట్ఫార్మ్ రూపొందించడానికి ఒప్పందం సహాయపడుతుందని ఈ సందర్భంగా ఇరు సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
ట్విట్టర్‌ను వదిలేస్తున్నారు,'కూ' కు క్యూ కట్టేస్తున్నారు
ట్విట్టర్‌కు కేంద్రానికి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు దేశీ సోషల్ మీడియా నెట్ వర్క్ 'కూ' కు వరంగా మారింది. కూ' ను ప్రారంభించిన కేవలం 16 నెలల కాలంలో 10మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుందని సోషల్ మీడియా స్టాటిటిక్స్ సెన్సార్ టవర్ తెలిపింది. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం అమెరికాకు చెందిన ట్విట్టర్‌ను వినియోగించే జాబితాలో భారత్ 22.1 మిలియన్ల యూజర్లతో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో నవంబర్ 14,2019 లో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఎంట్రప్రెన్యూర్ లు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ లు బెంగళూరు కేంద్రంగా 'కూ' ను అందుబాటులోకి తెచ్చారు. ట్విట్టర్ కు కేంద్రానికి వైరం 2020 నాటికి కూ యాప్ ను 2.6 మిలియన్ల మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. అయితే ట్విట్టర్ భారత్ నిబంధనల్ని ఉల్లంఘిస్తుందంటూ పలువురు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులపై కేంద్రం ట్విట్టర్‌కు పలు ఆదేశాలు జారీ చేసింది. అయినా ట్విట్టర్ లైట్ తీసుకుంది.ముఖ్యంగా 2020-21 మధ్య కాలంలో వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళన, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సర్టిఫైడ్ బ్లూ టిక్ ను తొలగించడం, కేంద్రం తెచ్చిన ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించడంతో కేంద్రానికి - ట్విట్టర్ల మధ్య వార్ మొదలైంది. దీంతో కేంద్ర కేబినెట్ మినిస్టర్లు పియూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్‌లు ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి దేశీ నెట్వర్క్ కూ'ను వినియోగించడం ప్రారంభించారు. అప్పటి నుంచే ట్విట్టర్ యూజర్లు కాస్త కూ కు అలవాటు పడ్డారు. దేశీ నెట్ వర్క్ కేంద్రం - ట్విట్టర్ల వివాదం కూ' కు ప్లస్ అయ్యింది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర స్థానిక భాషల్లో ఆపరేట్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన ఈ నెట్ వర్క్‌ను 85శాతం మంది యూజర్లు వినియోగిస్తున్నారు. ట్విట్టర్ యూజర్లు కాస్త దాన్ని వదిలేసి కూ ను వినియోగించేందుకు క్యూ కడుతున్నారు.వారిలో మంత్రులు,బాలీవుడ్ సెలబ్రిటీస్, క్రికెటర్లతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కూ కో ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ స్థానిక భాషాల్లో దేశీ యాప్‌ను వినియోగించేలా డెవలప్ చేశామన్నారు. త్వరలోనే సౌత్ ఈస్ట్ ఏసియన్ కంట్రీస్, ఈస్ట్రన్ యూరప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి : ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!? -
‘కూ’ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే...
చేతిలో కత్తి ఉన్నవాడికి భయపడని లోకం నోటిలో బూర ఉన్నవాడికి వణికి చస్తుంది. ఏదో ఒకటి ఊదేస్తాడు వాడు.. ఉన్నదీ లేనిదీ. అదీ జడుపు. ట్విట్టర్ వచ్చి మనిషికొక బూర ఇచ్చింది. ‘మిస్టర్ ప్రెసిడెంట్.. వాటీజ్ దిస్ అండీ..!’ అని కామన్ మ్యాన్ తన బూర ఊదొచ్చు. ‘మిత్రోం..’ అని మన మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. దేవుడితో డైరెక్టుగా మాట్లాడినట్లు కామన్ మ్యాన్‌తో కనెక్ట్ అవొచ్చు. అంతటి మహా ట్విట్టర్‌తో సరిపడక ఇప్పుడు భారత ప్రభుత్వం ‘కూ’ (Koo) అనే సొంత బూరల యాప్‌ను క్రియేట్ చేసుకుంది. ఇంకా కొన్ని దేశాలు ఇలాంటి ‘సొంత బూర’ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌తో ప్రభుత్వాలకు ఎందుకు పడటం లేదు? ట్విట్టర్‌పై ఉన్న విమర్శలు ఏమిటి? ఆ విమర్శలు ప్రభుత్వానివా, ప్రజలవా? ‘ఐ యామ్ నౌ ఆన్ కూ..’ అని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయుష్ గోయల్ మంగళవారం ఒక ట్వీట్ పెట్టారు. ‘కూ’ అనేది ఇండియన్ ట్విట్టర్. మనం సొంతంగా డెవలప్ చేసుకున్నది. మేడ్ ఇన్ ఇండియా! అయితే ట్విట్టర్ ఎంత శక్తిమంతమైనదో చూడండి. ‘కూ’లో చేరిన సంగతిని కూడా మంత్రిగారు మళ్లీ ట్విట్టర్లోనే పెట్టవలసి వచ్చింది! ఆయనతోపాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ‘కూ’లో అకౌంట్ తెరిచారు. కొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా ‘కూ’ లోకి చేరాయి. ‘కూ’లో ప్రత్యేకతలకు మళ్లీ వద్దాం. అసలు ట్విట్టర్‌కు పోటీగా ‘కూ’ను మన ప్రభుత్వం ఎందుకు వృద్ధి చేసింది? డిజ్అగ్రిమెంట్! ఒప్పుదలకు అనంగీకారం. ట్విట్టర్ ఏం చేస్తే అది చెల్లుబాటు అవడం భారత్‌కే కాదు.. ప్రపంచంలోని దేశాలకు, దేశాధినేతలకు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తెచ్చిపెడుతోంది. సోషల్ మీడియాలో అత్యంత శక్తిమంతమైన మైక్రో–బ్లాగ్ ప్లాట్‌ఫారమ్ అయిన ట్విటర్ ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ హద్దులు మీరుతోందన్న విమర్శలు.. ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌ని బ్యాన్ చేశాక ఎక్కువయ్యాయి. ట్విట్టర్ ఎంతో.. ‘కూ’ అంత ట్విట్టర్ అమెరికన్ మేడ్. కూ మేడిన్ ఇండియా. కూ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే ఓటీపీ అవసరం. ట్విట్టర్‌కు ఓటీపీ అక్కర్లేదు. ‘కూ’ యాప్ హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళ్, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒడియా, అస్సామీ, ఇంకా ఇతర భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం కోసం అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావత్కా అనేవారు పది నెలల క్రితం ‘కూ’ని రూపొందించారు. మోదీ తన మన్‌కీ బాత్‌లో వారిద్దరినీ ప్రశంసించారు కూడా. ఇప్పుడిప్పుడు కూ దేశానికి అలవాటవుతోంది. కూ ని గూగుల్ ప్లే నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్విట్టర్ లో మనం షేర్ చేసుకునేవన్నీ ‘కూ’లోనూ చేసుకోవచ్చు. చదవండి: 500 మంది ట్విటర్ ఖాతాలు రద్దు కూలో చేరిన కంగనా: ట్విటర్‌కు కౌంటర్ వారి ఖాతాలను బ్లాక్ చేస్తుంది మార్చి 21 వస్తే ఈ ఏడాదికి ట్విట్టర్‌కు పదిహేనేళ్లు నిండుతాయి. కువకువలాడే పక్షి ట్విట్టర్ గుర్తు. ఆ పక్షి గూడు హెడ్ క్వార్టర్స్ ఉన్నది కాలిఫోర్నియాలో. ట్విట్టర్ బాస్ జాక్ డోర్సీ. ట్విట్టర్లో ఎవరైనా అకౌంట్ తీసుకోవచ్చు. ఎవరు ఏదైనా, ఎవరు ఎవరితోనైనా మాట్లాడొచ్చు. అయితే ఆ మాటల వల్ల ఎవరి మనోభావాలూ దెబ్బతినేందుకు లేదు. ఆ మాటలు విద్వేషాలకు కారణం అవకూడదు. స్త్రీలను ఏ విధంగానూ కించపరచకూడదు. ప్రభుత్వాలను కూలదోయకూడదు. ఇవన్నీ జాక్ డోర్సీ పెట్టిన నిబంధనలు. వాటిని యూజర్స్ ఎవరైనా ఏ రూపంలోనైనా అతిక్రమిస్తే ట్విట్టర్ ఆ అతిక్రమించిన వారి ఖాతాలను బ్లాక్ చేస్తుంది. ఇక వాళ్లు ట్వీట్ ఇవ్వలేరు. ట్వీట్లు పొందలేరు. ప్రముఖులకైతే అదొక అవమానం.. ట్విట్టర్ తమ అకౌంట్‌ను తొలగించిందంటే! చూడండి మరి. ప్రముఖుల కంటే ప్రముఖమైన మైక్రో–బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియన్ మాజీ రేసర్, ప్రస్తుతం అడల్ట్ స్టార్ అయిన రెనీ గ్రేసీల అకౌంట్లను ట్విట్టర్ ఈమధ్యనే తొలగించింది. జనవరి 6న అమెరికా పాలనా భవనం ‘క్యాపిటల్ హిల్’ లో అరాచకానికి ట్రంప్ పెట్టిన ట్వీట్లే పెట్రోలు పోశాయని నమ్మిన ట్విట్టర్ ఆయన అకౌంట్‌ని బ్లాక్ చేసింది. ఇక రెనీ గ్రేసీ ట్విట్టర్ గూడును వదిలిపెట్టవలసి రావడానికి కారణం.. పోర్న్‌స్టార్‌గా నానాటికీ ఆమె ఫొటోలు ‘ప్రఖ్యాతిగాంచడం’. (ట్విటర్‌కు షాక్: దేశీ ట్విటర్ ‘కూ’ జోరు) వీళ్లిద్దరే కాదు.. హాలీవుడ్ నటి రోస్ మెక్‌గోవన్, అమెరికన్ గాయని బ్యాంక్స్, అమెరికన్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ ష్రేలీ, అమెరికన్ ర్యాపర్ కర్టిస్ జాక్సన్, అమెరికన్ గాయని కోర్ట్నీ లవ్, స్వీడిష్ యూ ట్యూబర్ ప్యూడీపీ, బ్రిటిష్ గాయని అడేర్, మన దేశం నుంచి బాలీవుడ్ నేపథ్య గాయకుడు అభిజీత్ భట్టాచార్య, బాలీవుడ్ నటుడు కమాల్‌ఖాన్.. ట్విట్టర్ ఆగ్రహానికి గురై గూడు కోల్పోయిన వారిలో ఉన్నారు. మంచి పనే. తిన్నగా లేనివారిని తీసివేయవలసిందే. మరి ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించేవారిని ట్విట్టర్ తొలగించడం లేదు కదా అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. ప్రశ్నిస్తున్నది ప్రజలే కనుక, ప్రజలకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉంటుంది కనుక, ఆ స్వేచ్ఛను అకౌంట్ క్లోజ్ చేయడం ద్వారా హరించడం అప్రజాస్వామ్యం అవుతుంది కనుక తాము ఆ పని చేయబోమని ట్విట్టర్ తరచు చెబుతూనే ఉంటుంది. సహజంగానే ప్రభుత్వాలను సంతృప్తిపరచని ధోరణి ఇది. మన దేశంలోనే చూడండి. రైతు ఉద్యమానికి ట్విట్టర్ వేదికగా ప్రపంచవ్యాప్త మద్దతు లభిస్తుండటంతో ప్రభుత్వం ట్విట్టర్‌పై అసంతృప్తితో ఉంది. సెన్సార్ విధించాయి. ట్విట్టర్‌పై అసంతృప్తితో లోగడ ట్విట్టర్‌ను బ్యాన్ చేసిన, మళ్లీ యాక్సెస్ ఇచ్చిన దేశాలు కూడా ఉన్నాయి. కొన్ని దేశాలు సెన్సార్ విధించాయి. ఫ్రాన్స్, ఇజ్రాయిల్, పాకిస్తాన్, రష్యా, దక్షిణ కొరియా, టాంజానియా, టర్కీ, వెనిజులా, చైనా, ఈజిప్టు, ఇరాన్, ఉత్తర కొరియా, టర్క్మెనిస్తాన్, బ్రిటన్లు ‘ఆన్ అండ్ ఆఫ్’ ట్విట్టర్‌ను నిషేధిస్తూ, నిషేధాన్ని సడలిస్తూ వస్తున్నాయి. ఇండియా ఆ స్థాయిలో నిషేధించలేదు కానీ, అల్లర్లను ప్రేరేపించే ప్రమాదం ఉన్న కొన్ని అకౌంట్లను ట్విట్టర్ చేత బ్లాక్ చేయించగలిగింది. ఏమైనా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ట్విట్టర్ మీదే ఆధారపడి పరుగులు తీస్తున్నాయి. దేశాధినేతల మనసులోని మాట ప్రజలకు తెలియాలంటే మునుపు సుదీర్ఘమైన ప్రెస్ మీట్లు, ఆ ఏర్పాట్లు అవసరం అయ్యేవి. ఇప్పుడు పీఎం గానీ, ప్రెసిడెంటు గానీ ఇంట్లో కూర్చొని క్షణాల్లో, అదీ రెండంటే రెండే ముక్కల్లో దేశాన్నంతటినీ ఉద్దేశించి వర్తమానం ఇవ్వగలుగుతున్నారు. ఇక ప్రజా ఉద్యమాలకైతే ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్‌లు పెద్ద చోదకశక్తి. బ్లాక్ లైవ్జ్ మేటర్, మీటూ, బ్రింగ్ బ్యాక్ అవర్ గర్ల్స్, ఐస్ బకెట్ చాలెంజ్, స్కూల్ స్ట్రయిక్ 4 క్లైమేట్, నెవర్ అగైన్ వంటి ఎన్నో ఉద్యమాలకు ట్విట్టర్ తొలి వేదిక అయింది. ప్రజా ఉద్యమాల వరకు ప్రభుత్వం సహిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ప్రజాఉద్యమాలను మాత్రం సీరియస్‌గా తీసుకుంటుంది. అయితే ట్విట్టర్‌కు ఈ ఉద్యమాలతో సంబంధం ఉండదు. ఒక పరిమితి వరకు భావ వ్యక్తీకరణకు ప్లాట్‌ఫామ్ అవుతుంది. వ్యక్తీకరణ మితి మీరితే అకౌంట్లు బ్లాక్ చేస్తుంది.. పౌరులవైనా, రాజకీయ నాయకులవైనా. ఒక పెద్ద ఆన్లైన్ ప్రజాస్వామ్య రాజ్యం ట్విట్టర్. ఆ ప్రజాస్వామ్యం దుర్వినియోగం అవుతున్నట్లు అనిపించినప్పుడు పోటీగా తామూ ఒక ట్విట్టర్‌ను పెట్టుకోవాలన్న ఆలోచన ప్రభుత్వాలకు కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు మన దేశం ప్రారంభించిన ‘కూ’ కూడా ఒక ప్రత్యామ్నాయ ట్విట్టర్ వంటిదే. -
‘కూ యాప్’కు తెలుగువారి ఆదరణ
సాక్షి, హైదరాబాద్ : ట్విట్టర్ తరహాలో అందుబాటులోకి వచ్చిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ‘కూ యాప్’కి తెలుగు వారి నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోందని సంస్థ సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. తమ యాప్ విశేషాలను పంచుకునేందుకు ఆన్లైన్ పత్రికా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 2020లో ప్రారంభమైన తమ యాప్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో విజేతగా నిలిచిందన్నారు. ప్రస్తుతం హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ భాషలలో అందుబాటులో ఉందన్నారు. కేవలం కొన్ని నెలల్లోనే ప్రపంచపు అతిపెద్ద తెలుగు మైక్రో బ్లాగ్‌గా అవతరించిందని తెలిపారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు మరెందరో తమ యాప్‌ని వినియోగిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో ప్రొడక్ట్ మేనేజర్ సాయి రామ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమలపై ఆర్బీఐ గవర్నర్ దృష్టి
ముంబై: దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మరింత దృష్టి సారిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్వీట్లో దాస్ ఈ వివరాలను వెల్లడించారు. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి కేవలం అరశాతంగా నమోదయిన నేపథ్యంలో గవర్నర్ పారిశ్రామిక బృందాలతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. డిసెంబర్ రిటైల్ (2.19%), టోకు ధరలు (3.80%) తగ్గిన పరిస్థితుల్లో ఆర్బీఐ రెపో రేటును (ప్రస్తుతం 6.5%) తగ్గించాలని ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పాలసీ విధానాలు, తీసుకునే నిర్ణయాల విషయంలో ఆర్బీఐ తమ వాదనలకు ప్రాధాన్యమివ్వడం లేదని కూడా పలు సందర్భాల్లో పారిశ్రామిక ప్రతినిధుల నుంచి విమర్శ వస్తోంది. కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7వ తేదీన ద్వైమాసిన ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. వరుస సమావేశాలు... ఆర్బీఐ గవర్నర్‌గా డిసెంబర్ 12న బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు ప్రభుత్వ బ్యాంకర్లతో, ఒకసారి ప్రైవేటు బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ సమావేశమయ్యారు. లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతసహా దిద్దుబాటు చర్యల పరిధిలో (పీసీఏ) ఉన్న 11 బ్యాంకులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు తర్వాత లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), నాన్– బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ఎంఎస్ఎంఈ ప్రతినిధులతో సమావేశం అనంతరం ఈ రంగం అభివృద్ధిపై సలహాలకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీనీ ఏర్పాటు చేయడం గమనార్హం. ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.25 కోట్ల వరకూ రుణం ఉండి, చెల్లించలేకపోతున్న రుణాన్ని, ఒకేసారి పునర్వ్యవస్థీకరించడానికి కూడా ఆర్బీఐ అనుమతించింది. -
వాట్సాప్‌కు షాకిస్తూ...
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌కు పతంజలి సంస్థ షాకిచ్చింది. వాట్సాప్‌కు పోటీగా కొత్త యాప్‌ను రూపకల్పన చేసింది. కింభో పేరిట యాప్ రూపకల్పన చేసి ఆవిష్కరించింది. యోగా గురు రాందేవ్ బాబా ఈ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం పతంజలి ప్రతినిధి ఎస్కే తిజారావాలా ట్వీట్ చేశారు. ‘ఇకపై భారత్ మాట్లాడుతుంది. వాట్సాప్‌కు గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఈ స్వదేశీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోండి’ అంటూ తిజారావాలా ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో కలిసి స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను పతంజలి విడుదల చేసింది. రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా అందించనున్నట్టు ప్రకటించింది. అంతేకాదు పతంజలి సిమ్ యూజర్లకు ఆ సంస్థ ఉత్పత్తులపై పదిశాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సాప్‌ను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయటం విశేషం. -
యాహూలో ట్విటర్ విలీనం!
న్యూయార్క్: మైక్రో బ్లాగింగ్ వైబ్‌సైట్ ట్విటర్ యాహూలో విలీనం అయ్యే అవకాశముంది. ఈ మేరకు ట్విటర్ అధికారులు యాహూ సీఈవో మరిస్సా మేయర్‌తో విలీన అవకాశాలను చర్చించినట్లు సమాచారం. మేనేజ్మెంట్ సమావేశంలో ఇరు సంస్థల ప్రధాన అధికారులు విస్తృతంగా సమాలోచనలు జరిపినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. యాహూ-ట్విటర్ సమాచార మార్పిడి ద్వారా మార్కెట్లో పట్టు పెంచుకోవాలని చూస్తున్నాయి. త్వరలో బిడ్డింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే విలీన వ్యాఖ్యలపై కంపెనీ స్పందించజాలదని ట్విటర్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. టెలికం దిగ్గజం వెరిజోన్‌తో యాహూ కోర్ ఇంటర్నెట్ వ్యాపారం కోసం త్వరలో రెండో రౌండ్ వేలం జరగనుంది.