న్యూయార్క్: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ కొనుగోలు విషయంలో ముందుకే వెళ్లాలని ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముందుగా అనుకున్న రేటుకే డీల్‌ను పూర్తి చేస్తానని ఆఫర్ చేస్తూ కంపెనీకి ఆయన ఈ మేరకు లేఖ పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ వార్తలతో ట్విటర్ షేరు ఒక్కసారిగా ఎగిసింది. దాదాపు 13 శాతం పెరిగి 47.95కి చేరింది. దీంతో షేర్లలో ట్రేడింగ్ నిల్చిపోయింది. షేరు ఒక్కింటికి 54.20 డాలర్ల చొప్పున మొత్తం 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేస్తానంటూ మస్క్ గతంలో ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, ఆ తర్వాత వివిధ కారణాలు చూపి మస్క్ వెనక్కి తగ్గడంతో వివాదం కోర్టుకు చేరింది. ట్విటర్‌ను కొనుగోలు చేసేలా మస్క్‌ను ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్ .. ఈ నెలలో తదుపరి విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment