ఉద్యోగుల తొలగింపులో ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ ‘యూటర్న్’ తీసుకున్నారు. 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ ఆ సంస్థలోని సగానికి పైగా ఉద్యోగుల్ని తొలగించారు. ఇప్పుడు వారిని తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ట్విటర్ ప్రక్షాళనలో భాగంగా మస్క్ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించారు. అయితే తాను ఊహించిన విధంగా కొత్త ఫీచర్లను తయారు చేయాలంటే ఫైర్ చేసిన ఉద్యోగుల పనితనం, అనుభవం అవసరం. కానీ మేనేజ్మెంట్ వారిని గుర్తించకుండానే పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి సాగనంపింది. ఇప్పుడు జరిగిన తప్పిదాన్ని గుర్తించిన ట్విటర్ యాజమాన్యం ఆ ఉద్యోగుల్ని సంప‍్రదించి.. తిరిగి వారు విధుల్లో చేరేలా మంతనాలు జరుపుతోందంటూ’ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
ఆ ఉద్యోగులు ఎవరంటే
ఇటీవల ట్విటర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్‌లోని ఉద్యోగులతో సహా 50 శాతం మంది సిబ్బందిపై వేటు వేసినట్లు ఆ సంస్థ సేఫ్టీ అండ్ ఇంటెగ్రిటీ హెడ్ యోయెల్ రోత్ ఈ వారం ప్రారంభంలో ఒక ట్వీట్‌లో తెలిపారు. ఆ ట్వీట్‌ల ఆధారంగా కమ్యూనికేషన్స్, కంటెంట్ క్యూరేషన్, హ్యూమన్ రైట్స్, మెషిన్ లెర్నింగ్ ఎథిక్స్‌కు బాధ్యత వహించే టీమ్‌లు, ప్రొడక్ట్, ఇంజినీరింగ్ టీమ్‌లు ఉన్నాయి. ఇప్పుడు ట్విటర్ పైన పేర్కొన్నట్లుగా ఏ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని రీ జాయిన్ చేయించుకుంటుంది. తొలగించిన ఉద్యోగులతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారా’ అనే విషయాలు తెలియాల్సి ఉంది.
చదవండి👉 ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment