ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ త్వరలో మరో సరికొత్త ఫీచర్లను ఎనేబుల్ చేయనున్నట్లు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్రాన్స్‌లేటింగ్, ఇతర దేశాల్లో ట్రెండ్ అవుతున్న ట్వీట్‌లు, సాంప్రదాయలు సైతం యూజర్లకు రికమండ్ చేసేలా ఫీచర్‌ను బిల్డ్ చేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో తదుపరి అప్‌డేట్ వినియోగదారులను వారి అనుకూల సెట్టింగ్‌ల నుండి సిఫార్సు చేసిన ట్వీట్‌లకు మార్చడాన్ని నిలిపివేయడం అని ఆయన చెప్పారు.
In coming months, Twitter will translate & recommend amazing tweets from people in other countries & cultures
— Elon Musk (@elonmusk) January 21, 2023
మరికొన్ని నెలల్లో ట్విటర్ ట్రాన్స్‌లేషన్ అండ్ ఇతర యూజర్ల నుంచి రికమండ్ ట్వీట్‌లు, ఇతర దేశాలు, సంప్రాదాయాలు గురించి తెలుసుకునేలా వీలు కల్పిస్తున్నాం. ప్రత్యేకించి జపాన్ వంటి దేశాల గురించి ప్రతి రోజు ట్విట్‌లను యూజర్లు వీక్షించే వెసలుబాటు కల్పిస్తున్నాం.’ అంటూ మస్క్ ట్విట్‌లో పేర్కొన్నారు.
లక్షల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన నాటి నుంచి ట్విటర్‌లో అనేక మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే గత డిసెంబర్ నెలలో రికమండెడ్ ట్విట్‌లను చూసేలా, ఆఫ్ చేసేలా టోగుల్(ఆన్ ఆఫ్ బటన్) ఫీచర్‌ను స్వైప్ చేసే లెప్ట్ అండ్ రైట్ ఆప్షన్, బుక్ మార్క్ బటన్, వచ్చే నెలలో ఎక్కువ పదాల్ని వినియోగించే ట్వీట్ చేసేలా లాంగ్ ఫారమ్ ఆప్షన్ అందిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
చదవండి👉 ఎలాన్ మస్క్ ఖాతాలో ప్రపంచంలో అత్యంత అరుదైన చెత్త రికార్డ్
Comments
Please login to add a commentAdd a comment