Social media policy
-
పిల్లలకు సోహెల్ మీడియా
సోషల్ మీడియా.. ప్రపంచాన్ని శాశిస్తున్న ప్రచారమాధ్యమం. ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), స్నాప్‌చాట్, టిక్‌టాక్.. వంటి ఫ్లాట్‌ఫామ్‌లు కొంతకాలం కిందట అనుసంధాన వేదికలుగా మాత్రమే పనిచేశాయి. ప్రశంసలందుకున్నాయి. కానీ రానురాను పరిస్థితి మారింది. అశ్లీల కంటెంట్, నకిలీ వార్తల వ్యాప్తి, సైబర్ బుల్లీయింగ్ మాధ్యమాలను ముంచెత్తాయి. ఇవి ఎన్నికలనూ శాసిస్తున్నాయి. పెద్దలమాట సరేసరి.. పిల్లలపై ఇవి చూపుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇటీవలే ఆ్రస్టేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించింది. దేశంలో పెద్ద దుమారమే రేపింది. అయినా ఆ్రస్టేలియా తరహాలోనే పలు దేశాలు కఠినమైన ప్రైవసీ చట్టాలు, మైనర్లపై నిషేధం వంటి విధానాల ద్వారా సోషల్ మీడియాను ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నించాయి. ఆయ దేశాల వివరాలు, అవి చేస్తున్న ప్రయత్నాలు ఓసారి చూద్దాం. ఆ్రస్టేలియాసోషల్ మీడియా మినిమమ్ ఏజ్ బిల్లు ప్రకారం ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ యజమాని మెటా నుంచి టిక్‌టాక్ వరకు మైనర్లు లాగిన్ కాకుండా నిరోధించాలని బిల్లు తీసుకొచ్చింది. వీటి అమలును ఉల్లంఘిస్తే 32 మిలియన్ డాలర్ల వరకు జరిమానాలు విధించనుంది. ఏడాదిలో ఈ నిషేధం అమల్లోకి రానుంది. జనవరి నుంచి అమలు చేసే పద్ధతులపై ట్రయల్ ప్రారంభమవుతుంది. స్పెయిన్16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే బిల్లును స్పెయిన్ జూన్‌లో ప్రవేశపెట్టింది. దీని అమలు, వయస్సు ధ్రువీకరణ వంటివాటిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం విధానాలను రూపొందించాల్సింది ఉంది.దక్షిణ కొరియా ఈ దేశం 2011లోనే సిడ్రెల్లా చట్టం రూపొందించింది. దీని ప్రకారం 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆన్‌లైన్‌గేమ్స్ ఆడకూడదు. ఒక దశాబ్దం తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ‘చాయిస్ పర్మిట్’వ్యవస్థను ఏర్పాటు చేసింది. వారి పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలో నిర్ణయించే అధికారాన్ని తల్లిదండ్రులకు ఇచ్చింది. అతికొద్ది మంది మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించారు. 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదించారు. దీనిని యువజన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును ‘సిండ్రెల్లా’చట్టం మాదిరిగా యువతను నియంత్రించే వివక్షాపూరిత ప్రయత్నమని విమర్శిస్తున్నాయి. ఫ్రాన్స్ గత ఏడాదే ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల వయస్సును ధ్రువీకరించాలని, 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారికి తల్లిదండ్రుల అనుమతిని పొందాలని ఫ్రాన్స్ 2023 జూన్‌లో చట్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే సోషల్ నెట్‌వర్క్‌కు ప్రపంచ ఆదాయంలో ఒక శాతం వరకు జరిమానా విధిస్తారు. ఈ చట్టం ఈయూ చట్టానికి అనుగుణంగా ఉందని యూరోపియన్ కమిషన్ ఇంకా ధ్రువీకరించలేదు. దీంతో అమలులోకి రాలేదు. ఇటలీఇక్కడ 14 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరం. ఆపై వయసున్న వారిపై ఎలాంటి నిషేధాలు లేవు. ఎవరి సమ్మతీ అవసరం లేదు. జర్మనీఈ దేశ నిబంధనల ప్రకారం 13 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగించాలి. ఈ నియంత్రణలు సరిపోవని, ప్రస్తుత చట్టాలను సక్రమంగా అమలు చేయాలని బాలల రక్షణ న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి దీనికంటే ముందుకెళ్లే ఉద్దేశంలో ఆ దేశం లేదు. బెల్జియం 13 ఏళ్లు నిండిన పిల్లలకు మాత్రమే సోషల్ మీడియాలో అకౌంట్ ఉండాలని, అది తల్లిదండ్రుల అనుమతితోనే చేయాలని 2018లో బెల్జియం చట్టం చేసింది.నార్వేఇక నార్వేలో సోషల్ నెట్‌వర్క్‌లకు ఉపయోగించడానికి కనీస వయస్సు 13 సంవత్సరాలు. అయినా 12 ఏళ్ల పిల్లల్లో ఎక్కువ మంది, తొమ్మిదేళ్ల పిల్లల్లో సగానికిపైగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో కనీస వయోపరిమితిని 15 సంవత్సరాలుగా నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల అమలులో విఫలమైన నేపథ్యంలో సమర్థవంతమైన మార్గాలను అన్వేíÙస్తోంది. నెదర్లాండ్స్ ఇక్కడ సోషల్ మీడియాను ఉపయోగించడానికి వయో పరిమితి లేదు. పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి అక్కడి ప్రభుత్వం తరగతి గదుల్లో మొబైల్ పరికరాలను నిషేధించింది. ఇది 2024 జనవరి నుంచి అమల్లో ఉంది. అయితే డిజిటల్ పాఠాలకు, వైద్య అవసరాలు, వైకల్యాలు ఉన్నవారికి మినహాయింపులు వర్తిస్తాయి.చైనా2021 నుంచి మైనర్లకు యాక్సెస్ ఆంక్షలు అమలు చేస్తున్న చైనా ఇందుకు మంచి ఉదాహరణ. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. దీంతో సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిరోధించడం ఇక్కడ సులభం. టిక్‌టాక్ వంటి చైనీస్ డౌయిన్‌లో 14 ఏళ్లలోపు వినియోగదారులకు పరిమితి ఉంది. రోజుకు 40 నిమిషాలు మాత్రమే వినియోగించాలనే నిబంధన ఉంది. పిల్లలు అంతకంటే ఎక్కువసేపు ఆన్లైన్లో గేమ్స్ ఆడటానికి కూడా అనుమతి లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డీఫ్ ఫేక్‌పై పోరు.. నేడు, రేపు కీలక సమావేశం
సాక్షి, ఢిల్లీ: ఇంటర్నెట్లో డీప్ ఫేక్ వీడియోల వ్యాప్తి ఈమధ్య ఆందోళన కలిగిస్తోంది. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు, ఆకతాయిలు అశ్లీల, నకిలీ.. విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారు. సాధికారత, వృద్ధి, సృజనాత్మకతకు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్ బలమైన సాధనమే అయినప్పటికీ.. కొంతమంది దాన్ని దుర్వినియోగం చేయడం గమనార్హం. ఈ తరుణంలో డీప్‌ఫేక్ తరహా వ్యవహారాల కట్టడికి కేంద్రం రంగంలోకి దిగింది. నేడు,రేపు(నవంబర్ 23,24వ తేదీల్లో) సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులతో కేంద్ర ఐటీ శాఖ సమావేశం కానుంది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం.. గురువారం జరిగే సమావేశంలో మార్ఫింగ్ కంటెంట్(ఫొటోలు, వీడియోలు) అంశాల కట్టడిపై, శుక్రవారం జరిగే భేటీలో ఐటీ నిబంధనలపై చర్చించనున్నారు. డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తి కట్టడికి అవసరమైతే కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. ఈ తరుణంలో.. చట్టం రూపకల్పన, ఇతరత్రా అంశాలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ప్రతినిధులతో కేంద్రం సమాలోచనలు జరిపే అవకాశాలూ కనిపిస్తున్నాయి. వాస్తవానికి డీఫ్ ఫేక్ కంటెంట్ వ్యవహారం ఇంటర్నెట్లో చాలాకాలంగా కొనసాగుతున్నప్పటికీ.. నటి రష్మిక మందన్న వీడియో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వెంటనే పలువురు ప్రముఖుల విషయంలోనూ ఇలాంటి వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డీప్ ఫేక్ వంటి సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. తాజాగా.. బుధవారం జరిగిన జీ20 వర్చువల్ సమ్మిట్ ముగింపు ప్రసంగంలోనూ ప్రధాని మోదీ డీప్‌ఫేక్ సమస్యను ప్రస్తావించడం గమనార్హం. ‘‘ఏఐ ప్రతికూల ప్రభావాల గురించి ప్రపంచం ఆందోళన చెందుతోంది. సమాజానికి డీప్‌ఫేక్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవడంతో పాటు డీప్‌ఫేక్‌ల నుంచి సమాజాన్ని కాపాడేందుకు కృషి చేయాలి’’ అని ప్రధాని మోదీ జీ20 సభ్య దేశాలకు పిలుపు కూడా ఇచ్చారు. -
రష్మిక ఫేక్ వీడియో : సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం మరోసారి రెడ్ సిగ్నల్
న్యూఢిల్లీ: తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి నటి రష్మిక మందన్నకు చెందినడీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66డీ ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష, జరిమానా తప్పదంటూ రిమైండర్ జారీ చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో డీప్‌ఫేక్‌లకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను, ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను తాజా సర్క్యులేషన్లో మరోసారి గుర్తు చేసింది. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66డీ ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి ఎవరైనా వ్యక్తుల పట్ల మోసపూరితంగా వ్యవహరించినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా నేరం రుజువైతే మూడేళ్ల దాకా జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది. ప్రభుత్వం, లేదా బాధిత వ్యక్తులు కోరిన వెంటనే సోషల్ మీడియా వెబ్ సైట్లు ఆయా కంటెంట్ వివరాలను 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుంది. IT మధ్యవర్తి నియమాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు 10 రకాల కంటెంట్‌కి సంబంధించిన పోస్టులను తప్పక తొలగించాలి. ముఖ్యంగా దేశ సమగ్రత, శాంతి భద్రతలు, సార్వభౌమత్వం, విదేశాలతో సంబంధాలు, ఇతర దేశాలను అవమానించడం, నేరాలకు పాల్పడేందుకు ప్రోత్సహించే చర్యలు, ఒక వ్యక్తి లేదా ప్రభుత్వాన్ని కించపర్చేలా మాట్లాడడం నేరంగా పరిగణిస్తారు. అలాగే అసభ్యకరమైన కంటెంట్, లింగ విద్వేషం రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల ప్రైవసీని దెబ్బ తీసే కంటెంట్, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేలా ప్రోత్సహించడం, జాతి, మతం, రంగును అవమానించడం, భారతీయ చట్టాలలో నేరంగా వెల్లడించిన పనులను ప్రోత్సహించే కంటెంట్ వంటివి ఎవరైనా పోస్ట్ చేస్తే వాటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రభుత్వం కోరితే ఆ సమాచారాన్ని ముందుగా పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో స్పందించిన కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులకు భద్రత, విశ్వాసం కల్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇవ్వడం తోపాటు ఇలాంటి ఫేక్ వీడియోపై సోషల్ మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లకు, ఇన్ఫ్లుయెన్సర్లకు కేంద్రం భారీ షాక్!
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లు, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్లపై కేంద్రం దృష్టిసారించింది. ఆదాయపుపన్ను నిబంధనల్ని ఉల్లంఘించిన క్రియేటర్లపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్రియేటర్లను, ఇన్ఫ్లుయెన్సర్లను కేంద్ర విభాగానికి చెందిన ఇన్ ట్యాక్స్ అధికారులు విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆదాయాలు, లాభాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించాల్సి ఉందంటూ పీటీఐ తన కథనంలో పేర్కొంది. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ గత వారం, కేరళకు చెందిన 10 మంది యూట్యూబ్ చానల్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా రంగానికి చెందిన ఆర్టిస్టులు, యాక్టర్స్లను ఐటీ అధికారులు విచారించారు. సోషల్ మీడియాలో ప్రభావశీలురుగా చెలామణి అవుతున్నవారు, కంటెంట్ క్రియేటర్లు ఊహించని విధంగా సంపాదిస్తున్నారని, కానీ ఇన్ కమ్ ట్యాక్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నోటీసులు జారీ ఇక, కేరళకు చెందిన కంటెంట్ క్రియేటర్ల నుంచి ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు మరిన్ని వివరాలు రాబట్టారని, బాధ్యతాయుతంగా పన్నులు చెల్లించేలా ప్రోత్సాహిస్తూ వారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నివేదికల ప్రకారం..ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. ఇందులో వారి బ్రాండ్ ఎండార్స్మెంట్లు, చెల్లింపులు, చెల్లించని ప్రమోషన్లు, డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వినియోగం, ఖర్చలు, ఆయా సంస్థల నుంచి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా చేసే ప్రకటనల రూపంలో జరిపే చెల్లింపులపై చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించారు. కేరళతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియాను ప్రభావితం చేసే వారిపై ఇలాంటి చర్యలే తీసుకున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్ల కార్యకలాపాలు నిర్వహించే సంస్థల గురించి ఆరాతీస్తున్నారు. కొత్త నిబంధనలు గత ఏడాది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) వ్యాపారం లేదా వృత్తిలో పొందే ప్రయోజనాలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఒక వ్యక్తి ఏడాదిలో రూ. 20,000 కంటే ఎక్కువ ప్రయోజనాలు లేదా అవసరాలు తీర్చుకుంటే.. సదరు వ్యక్తి 10 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. చదవండి👉 ‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు! -
ఎవరి ‘గోడ’ వారిదే!
మనం శబ్దాన్ని గుర్తిస్తాం, శబ్దానికి చెవినిస్తాం, ఫెళఫెళార్భాటంగా సాగే శబ్దవిప్లవాలకు స్పందిస్తాం. నీటిని గుర్తిస్తాం కానీ చాపకింద నీటిని చటుక్కున గుర్తించలేకపోతాం. వాస్తవం ఏమిటంటే, మనం వెంటనే పోల్చుకోలేని నిశ్శబ్దాలూ, నిశ్శబ్ద విప్లవాలూ; చాప కింద నీరు లాంటి నిరంతర పరిణామాలూ కూడా ఉంటాయి. సాధారణంగా అవే మనిషి జీవితాన్ని, అతని నమ్మకాల్ని తలకిందులు చేస్తాయి. అతనికి తెలియకుండానే అతని కరచరణాలను కట్టడి చేసి శాసిస్తాయి. సాంకేతికత అలాంటి ఒక నిశ్శబ్ద విప్లవం. ఎప్పుడో చరిత్రపూర్వయుగంలో మనిషి కనిపెట్టిన చక్రం, ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలపాటు అతని భవిష్యత్తును నిర్దేశించింది; అతని జీవ నాన్ని, అతను కూడా ఊహించలేనన్ని కొత్త కొత్త మలుపులు తిప్పింది. చక్రం తిప్పనిదేముంది? ఉన్న సాంకేతికత పోయి కొత్త సాంకేతికత రావడానికీ, అది కొత్త కొత్త మార్పులు కొని తేవడానికీ నిన్నమొన్నటివరకూ ఎక్కువ సమయం పట్టేది. ఆ లోపల ‘పాత’ అనేది సంప్రదాయంగా ఘనీభవించిపోయి కొత్తను అడ్డుకునేది; కాలగమనాన్ని తన అరచేతులతో ఆపడానికి ప్రయత్నించేది. అలాంటి సంప్రదాయ శాసనం నుంచి బయటపడి తన ఉనికిని స్థాపించుకోవడానికి ‘కొత్త’ ఎంతో పెనుగులాడేది, ఆ ఘర్షణలో సంప్రదాయానిదే పై చేయి అయేది. కానీ ఆధునికకాలం దగ్గరికి వచ్చేసరికి సాంకేతికత ఒక మహావిజృంభణగా మారిపోయింది. ఒక మహావిప్లవరూపం ధరించింది. అప్పటికి కొత్త అనుకున్న సాంకేతికతకు అలవాటు పడే లోపలే దానిని పాతగా మార్చివేస్తూ అంతకన్నా కొత్తదైన సాంకేతికత అడుగుపెట్టడం ప్రారంభించింది. అందువల్ల పాతకు సంప్రదాయంగా ఘనీభవించే వ్యవధి బాగా తగ్గిపోయి, కొత్త సాంకేతికత ముందు అది కూడా తలవంచి దారినివ్వడం అనివార్యమైంది. ఆ విధంగా సంప్రదాయ, సాంకేతికతల బలాబలాలు తారుమారైపోయాయి. కొత్త సాంకేతికత రెండు మూడు తరాల కాలవ్యవధిలో అడుగుపెట్టడం కూడా పోయి ఒకే తరంలో, కళ్ళు మూసి తెరచే లోగానే ప్రత్యక్షం కావడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ఏదైనా సమాచారాన్ని ‘రియల్ టైమ్’లో ప్రపంచవ్యాప్తం చేయడమూ; పుటలకు పుటలు మనం రాసినదానిని మనం కోరుకున్న భాషలోకి తక్షణం తర్జుమా చేసి ఇవ్వడమే కాదు; కీబోర్డుమీద చిటికెనవేలితో నొక్కితే చాలు, మన గురించిన మొత్తం సమాచారాన్ని మన కళ్ళముందు నిలిపే స్థాయికి సాంకేతికత చేరుకుంది. రోబోను సృష్టించిన మనిషి, సాంకేతికత చేతిలో తనే రోబోగా మారాడు. సమాచారమాధ్యమాల రంగానికే వస్తే ఈ సాంకేతిక మహావిప్లవం తెచ్చిన మార్పు ఎన్నో ఆసక్తికరమైన పరిస్థితులను çసృష్టించింది. సామాజిక మాధ్యమాల పేరిట ఫేస్బుక్, వాట్సప్, బ్లాగ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వగైరాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో అంతవరకూ ఆధిపత్యం చలాయించిన ప్రింటు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు సాంప్రదాయిక మాధ్యమాలుగా మారాయి. సామాజిక, సాంప్రదాయిక మాధ్యమాల సహజీవనం వినూత్న పరిణామాలకు దారి తీసింది. అంతవరకు స్థలకాలాల నిర్ణయాధికారం సాంప్రదాయిక మాధ్యమాల నిర్వాహకుల చేతుల్లో ఉండేది. ఇప్పుడా అధికారం స్మార్ట్ ఫోన్, లేదా ల్యాప్ టాప్ దగ్గరున్న ప్రతి వ్యక్తికీ బదిలీ అయింది. అతను తాను కోరుకున్నంత స్థలంలో, తను ఎప్పుడనుకుంటే అప్పుడు తన అభిప్రా యాన్ని ప్రచురించుకునే వెసులుబాటు వచ్చింది. ఫేస్బుక్ పరిభాషలో చెప్పాలంటే ‘గోడ’ రూపంలో తను సృష్టించుకున్న తన పత్రికకు, తన ఛానెల్‌కు తనే సంపాదకుడు. తన వాల్ మీద ఏది పోస్టు చేయాలో నిర్ణయించుకునే అధికారం తనదే. ‘వెనకటి మహాభారతం పద్దెనిమిది పర్వాలు కావచ్చు, ఆధునిక మహాకావ్యం పద్దెనిమిది పేజీలే’ ననే అర్థంలో మహాకవి శ్రీశ్రీ చేసిన వ్యాఖ్య ఒకటి ప్రసిద్ధమే. ఇప్పుడు మన ఫేస్బుక్ వాల్ మీద, లేదా మన బ్లాగులో ఏకకాలంలో పద్దెనిమిది పంక్తుల్లో ఒక మినీ వ్యాసాన్ని, పద్దెనిమిది పుటల్లో ఒక కావ్యాన్నే కాదు, పద్దెనిమిది పర్వాల మహేతిహాసాన్ని కూడా రాయగలిగినంత జాగా అందుబాటులోకి వచ్చింది. సాంకేతికవిప్లవం ఆవిష్కరించే వింతలకు అంతే ఉండదు. కొత్త సాంకేతికత ఒక్కొక్కసారి సుదూరగతానికి చెందిన పాతపద్ధతులను కూడా కొత్త మెరుపుతో ముందుకు తేగలదు. పూర్వం, అచ్చుయంత్రం కాదు సరికదా, లిఖితసంప్రదాయం కూడా వేళ్లూనుకొనని రోజుల్లో పురాణశ్రవణం ఉండేది. పౌరాణికుడు, శ్రోతలు ఎదురెదురుగా ఉండేవారు. శ్రోతల అభిరుచులు, అభిప్రాయాలూ, అనుకూల, వ్యతిరేకస్పందనలు తక్షణమే పౌరాణికుని దృష్టికి వచ్చేవి. అవి కూడా పురాణ శ్రవణాన్ని, కథానిర్మాణాన్ని ప్రభావితం చేసేవి. ఆ విధంగా పురాణకథనం ద్వికర్తృకంగా, లేదా జంట నిర్మాణంగా రూపుదాల్చేది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో మళ్ళీ అదే పద్ధతి పునరావృతమైంది. తను చదివిన, లేదా విన్న వాటిపై పాఠకుడు, శ్రోత అప్పటికప్పుడు స్పందించగలుగుతున్నాడు. ఆ విధంగా అది ఒక రచనను ‘రియల్ టైమ్’లో ప్రభావితం చేసి అవసరమైతే మార్చుకునే అవకాశా న్నిస్తున్నది. ప్రజాస్వామికమైన చర్చను కొత్త పుంతలు తొక్కిస్తున్నది. సంపాదకుడనే అంకుశం లోపించినప్పుడు సామాజిక మాధ్యమాలు మదపుటేనుగుల స్వైర విహారానికి ఆటపట్టులవుతాయి. ఉచితానుచితాలు, సభ్యతా సంస్కారాల హద్దులు చెరిగిపోవ డమూ సంభవిస్తుంది. అయితే స్థలకాలాలు, శాస్త్రసాంకేతిక నూతనావిష్కారాలకు అతీతంగా ఎల్ల కాలాలకూ, ఎల్ల ప్రాంతాలకూ వర్తించే మన్నికైన మానవ విలువలు; విజ్ఞతావివేకాల కొలమానాలు ఎప్పుడూ సజీవంగా ఉంటూనే ఉంటాయి. సాంప్రదాయిక, సామాజిక మాధ్యమాల తేడా లేకుండా సంపాదక స్థానంలో ఉన్న ప్రతి ఒకరిపై జనాభిప్రాయమనే పెద్ద అంకుశం అజ్ఞాతంగా ఉండి నియంత్రిస్తూనే ఉంటుంది. ఆ జనాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించే పాఠకుడు అతిని ఒక కంట కనిపెట్టి చూస్తూ అవసరమనిపించిన సమయంలో కత్తెర ప్రయోగిస్తూనే ఉంటాడు. నిత్యజాగృతుడైన పాఠ కుడు, లేదా శ్రోత, లేదా ప్రేక్షకుడే అంతిమంగా ఏ మాధ్యమానికైనా ఎడిటర్– ఇన్– చీఫ్! -
ట్విటర్ గురించి ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూజర్లు ట్వీట్లకు రేటింగ్ ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో ట్విటర్ ఏ వెర్షన్ కావాలో ఎన్నుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. మరో వైపు ట్విటర్ కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తుందని అన్నారు. Good point. Being able to select which version of Twitter you want is probably better, much as it would be for a movie maturity rating. The rating of the tweet itself could be self-selected, then modified by user feedback. — Elon Musk (@elonmusk) October 29, 2022 ‘విస్తృతంగా విభిన్న దృక్కోణాలతో ట్విటర్ ఓ కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఆ కౌన్సిల్ ఏర్పాటు అయ్యేవరకు ట్విటర్లో కంటెంట్ నియంత్రణ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం గానీ, అకౌంట్లను పునరుద్ధరణ జరగవు’ అని మస్క్ ట్వీట్ చేశారు. Twitter will be forming a content moderation council with widely diverse viewpoints. No major content decisions or account reinstatements will happen before that council convenes. — Elon Musk (@elonmusk) October 28, 2022 -
ఎవరొస్తారో రండి.. తేల్చుకుందాం, పరాగ్ అగర్వాల్‌కు ఎలాన్ మస్క్ సవాల్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్..ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు సవాల్ విసిరారు. ఫేక్ అకౌంట్ల విషయంలో ట్విట్టర్ బహిరంగ చర్చకు రావాలని పిలుపు నిచ్చారు. నిరూపణలో మీరు సఫలమైతే.. ట్విట్టర్ కొనుగోలు చేసే ప్రాసెస్‌ను ముందుకు కొనసాగుతుందంటూ మస్క్ అవకాశం ఇచ్చారు ఫేక్ అకౌంట్ల విషయంలో ఎలాన్ మస్క్ దాఖలు చేసిన కౌంటర్ సూట్‌పై ట్విట్టర్ సైబర్ సెక్యూరిటీ రెసెర్చర్ ఆండ్రియా స్ట్రోపా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్‌కు ఎలాన్ మస్క్ ధీటుగా స్పందించారు. తాను పెట్టే ప్రపోజల్‌కు ట్విట్టర్ అంగీకరిస్తే..44 బిలియన్ డాలర్ల డీల్‌కు సిద్ధమేనని రిప్లయ్ ఇచ్చారు. I hereby challenge @paraga to a public debate about the Twitter bot percentage. Let him prove to the public that Twitter has -
మంచి జాబ్ పొందాలన్నా.. పెళ్లి అవ్వాలన్నా.. ఇప్పుడు ఇదే ముఖ్యం!
Tips To Maintain Social Media Profile: ఒకప్పుడు.. పెళ్లి సంబంధం చూడాలంటే ‘అటు ఏడుతరాలు, ఇటు ఏడుతరాలు..’అంటూ లెక్కలు కట్టేవారు. నేడు.. మీ అమ్మాయి/అబ్బాయి ‘సోషల్ మీడియా లింక్ ఇవ్వండి’ అని అడుగుతున్నారు. ఒకప్పుడు.. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే– ‘ఏ స్కూల్, ఎంత పర్సంటేజ్, ఎక్సీపీరియన్స్ ఉందా?’ అని తెలుసుకునేవారు. నేడు.. ‘మీ ప్రొఫైల్ లింక్ షేర్ చేయండి’ అని అడుగుతున్నారు. ఎవరిగురించైనా తెలుసుకోవాలంటే వారి ప్రొఫైల్‌తో పాటు పోస్టింగ్స్, హ్యాబీస్పైనా దృష్టి పెడుతున్నారు. ఏ కంపెనీలో జాబ్?! హార్స్ రైడింగ్ చేస్తున్నారా?! ఇంగ్లిష్ వచ్చా, ప్రఖ్యాత క్లబ్లో మెంబర్షిప్ ఉందా?... ఇలాంటి అదనపు హంగులనూ దృష్టిలో పెట్టుకొని ‘ఎలాంటి వ్యక్తి’ అనేది అంచనా వేస్తున్నారు. ఒక మంచి జాబ్ పొందాలన్నా, బిజినెస్ హ్యాండిల్ చేయాలన్నా, పెళ్లి అవ్వాలన్నా.. ఇప్పుడు డిజిటల్ ప్రొఫైల్, పోస్టింగ్స్ పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాబట్టి డిజటల్‌లో మీ కీర్తి ఇంతింతై పెరగాలంటే వేటి మీద దృష్టి పెట్టాలో చూద్దాం.. మంచీ–చెడు సాంకేతికత ప్రభావం సమాజానికి చాలా ప్రయోజనాలను అందిస్తోంది. అదే సమయంలో మనల్ని ఆధారపడేలా, పరధ్యానానికి లోనయ్యే స్థాయిలకు నెట్టేసింది. ప్రపంచంతో ఎలా ఉండాలో కొత్తగా నేర్పిస్తోంది. ఇది స్థానిక సంప్రదాయాలు, ఆచారాలను కూడా ప్రభావితం చేసింది. ఇవన్నింటిని ఆధారం చేసుకుంటూ మంచి–చెడూ రెండు విధాల డిజిటల్ వేదికగా గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఏ విధంగా మనం మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలన్నది డిజటల్‌లో మనం చేసే ‘పోస్ట్’లపైనే ఆధారపడి ఉంటుంది. దానికి సిద్ధమవ్వాల్సింది మనమే! నిజా నిజాల పరిశీలన అవసరం ఆఫ్‌లైన్ కన్నా ఆన్లైన్ ఐడెంటిటీ మీదే అంతా ఆధారపడి ఉంటున్నారు కనుక ‘కంటెంట్’ పోస్ట్ చేసేముందు నిర్ధారణ అవసరం. కొందరికి డిజిటల్ మీడియాలో మంచి పేరు ఉంటుంది. లక్షల్లో ఫాలోవర్లు ఉంటారు. వారు చెప్పే విషయాలను మిగతావారూ నమ్మే విధంగా ఉంటాయి. అందుకని అలాంటివారు మరింత బాధ్యతగా ఉండాలి. అలాగని, ‘ఫలానావారికి బోలెడంత నాలెడ్జ్ ఉంది’ అని వారు చేసిన పోస్టుల్లో నిజానిజాలు తెలుసుకోకుండా రీపోస్ట్ లేదా ప్రకటనలు చేయడం అనేది మీ గుర్తింపును దెబ్బతీయవచ్చు. ఒక ‘విషయం’ తెలిసినప్పుడు దానిని మిగతా వేదికల్లోనూ నిజనిర్ధారణ చేసుకోవడం ముఖ్యం. ఉదా: దినపప్రతికలలో దానికి సంబంధిత వార్త పబ్లిష్ అయ్యిందా..’ అని చెక్ చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన డిజిటల్ గుర్తింపు నిర్మాణం: ►పోస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించడం మంచి విధానం. మీరు షేర్ చేసే కంటెంట్, దాని ప్రభావం వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండాలి. ►అతిగా షేరింగ్ మానుకోవాలి. మనలో చాలామంది సోషల్ నెట్‌వర్క్‌లలో రిలేషన్షిప్ స్టేటస్లు పెడుతుంటారు. అభిప్రాయాలను వ్యక్తపరచడం, తప్పులను ఒప్పుకోవడం, లైంగిక గుర్తింపును ప్రకటించడం.. వంటివి చేస్తుంటారు. ఈ వ్యక్తీకరణలు కొన్నిసార్లు మోసగాళ్లకు మీ గుర్తింపును దొంగిలించే సామర్థ్యాన్ని అందిస్తాయి. ►మీ సొంతం కాని కంటెంట్‌ను ఫార్వర్డ్ చేయవద్దు. సామాజిక మాధ్యమాల్లో కంటెంట్‌ను ఫార్వర్డ్ చేసేముందు ఒకసారి వాస్తవ తనిఖీ కూడా చేయండి. ఇందుకు .. ► అంతర్జాతీయ సర్టిఫైడ్ ఫాక్ట్ చెక్స్ నెట్వర్క్ www. factly.com, www. boomlive.in ల సాయం తీసుకోవచ్చు. ►మీ ప్రైవసీని రక్షించుకోవాలి. ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు VPN లేదా ఇన్‌కాగ్నిటో మోడ్ ఫీచర్‌ని ఉపయోగించాలి. లేదా TOR/Ducj Duck Go ను ఉపయోగించవచ్చు. ►ఉచిత వై–ఫై నెట్‌వర్క్‌లను అస్సలు వాడద్దు. ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న మెసేజ్ అప్లికేషన్లను ఉపయోగించాలి. ఫోన్, యాప్, మెయిల్స్ డిఫాల్ట్ పాస్‌వర్డ్‌లను మార్చుతూ ఉండాలి. మొబైల్ యాప్‌లు, బ్రౌజర్ ఎక్స్టెన్షన్లు ఓకే చేసేముందు ఒకటికి రెండుసార్లు ‘సరైనదేనా’ అని నిర్ధారించుకోండి. ►పిల్లల ఆన్లైన్ వినియోగాన్ని పెద్దల నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ►ఈ డిజిటల్ యుగంలో వ్యక్తి, సంస్థ గురించిన సామాజిక ప్రొఫైల్ తెలుసుకోవడంలో ఏ విధంగా సాయపడుతుందో.. మన అలవాట్లనూ బహిర్గతం చేస్తుంది. చెడు అలవాట్లను నివారించి, మంచి డిజిటల్ గుర్తింపు పొందడానికి సరైన మార్గాన్ని వేసుకోవడానికి అందరం ప్రయత్నిద్దాం. -అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
విజయతీరాలను చేరాలని.. ‘సామాజిక’ ఫార్ములా!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలన్నీ రాజకీయ వ్యూహాల్లో దిట్టలైన సామాజిక ఇంజనీర్లు(పొలిటికల్ సోషల్ ఇంజనీర్స్), వారు సిద్ధం చేసే సోషల్ ఇంజనీరింగ్ మీదే ఆధారపడి ఉంటోంది. పార్టీకి విజయవంతమైన ఎన్నికల ప్రచారాన్ని సిద్ధం చేయడం, సామాజిక సమూహాలు, వారి అవసరాలను గుర్తించడం, ఆపై పథకాలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం, సామాజిక మాధ్యమాల్లో సందేశాల ద్వారా పార్టీకి అనుకూలంగా వారిని సానుకూలంగా ప్రభావితం చేసే వ్యూహాన్ని సిద్ధం చేయడంతో సోషల్ ఇంజనీర్లే కీలక భూమిక పోషిస్తున్నారు. దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే ప్రతి పార్టీ సోషల్ ఇంజనీరింగ్ ప్రాధాన్యాన్ని బాగా గుర్తించాయి. సామాజిక సమీకరణ కోసం వివిధ కులాలు, వర్గాలు, మత సమూహాలతో తమ పార్టీలకు సంబంధాలను బలపరిచే, సామాజిక పొత్తులను నిర్మించగల శక్తిసామర్థ్యాలున్న నేతలను దీనికి వినియోగిస్తున్నాయి. వీరికి ప్రజాకర్షక శక్తి లేకున్నా.. తెరవెనుక వ్యవహారాలను చక్కబెట్టగల నేర్పు ముఖ్యం. హోంమంత్రి అమిత్ షా బీజేపీకి గొప్ప సోషల్ ఇంజనీర్ అనేది గత సార్వత్రిక, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. ప్రధాన్ నేతృత్వంలో బీజేపీ... ప్రస్తుతం అమిత్ షా కేంద్ర వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో యూపీ ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ బాధ్యతలను సమర్థ్ధుడైన ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ కట్టబెట్టింది. ప్రధాన సామాజికవర్గాల్లో ఏదైనా అసంతృప్తి ఉంటే దానిని వెంటనే గుర్తించి, వాటితో చర్చలు జరిపి, వారి ద్వారా అందే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పరిష్కారాలు చూపించే పనిని ప్రధాన్ బృందం సూక్ష్మస్థాయిలో చేస్తోంది. ముఖ్యంగా పూర్వాంచల్. తూర్పు యూపీలో బ్రాహ్మణ వర్గం బీజేపీకి దూరమవుతోంది. రాజ్‌పుత్‌లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్న కినుకతో వారు ఎస్పీలో చేరుతున్నారు. దీంతో యూపీలో 14 శాతం ఉన్న బ్రాహ్మణులు దూరం కాకుండా కమలదళం చర్యలు చేపట్టింది. లఖీంపూర్ ఖేరీ ఘటనలో బ్రాహ్మణ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు ఉద్వాసన పలకాలని ఎంత గట్టిగా డిమాండ్లు వచ్చినా, ఆ వర్గానికి ఆగ్రహం కల్గించరాదన్న ఉద్దేశంతోనే ఆయనకు బీజేపీ కాపు కాస్తోంది. మరోవైపు రాజ్‌పుత్ ఓట్లు జారిపోకుండా కీలక నేతలందరితో ఎప్పటికప్పుడు మంతనాలు చేస్తోంది. ముఖ్యంగా రైతుల్లో ఎక్కువగా బీసీలు, ఎస్సీ వర్గాల వారే ఉండటంతో వారిని మచ్చిక చేసుకునేలా ఇప్పటికే రూ.35 వేల కోట్ల రుణాలను అందించగా, 2.21 కోట్ల మంది రైతులను ఫసల్ బీమా యోజనలో చేర్చింది. వీటన్నింటినీ బీజేపీ బృందాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారిని ఆకర్షించే పనిలో పడ్డాయి. బ్రాహ్మణ వర్గాన్ని ఆకర్షిస్తున్న ఎస్పీ ఇక యూపీ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఎదుర్కోవాలని గట్టి పట్టుదలతో ఉన్న విపక్షాలు సైతం తమతమ సోషల్ ఇంజనీరింగ్‌కు పదునుపెట్టాయి. సమాజ్‌వాదీ పార్టీ కోసం అఖిలేశ్ యాదవ్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని రచిస్తున్నారు. మహాన్ దళ్, సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ వంటి యాదవేతర కుల ఆధారిత పార్టీలతో పొత్తులు ఏర్పరచుకోవడం ద్వారా వివిధ సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే యత్నాలకు దిగారు. ముఖ్యంగా బీజేపీ అనుబంధంగా ఉంటున్న బ్రాహ్మణులకు దగ్గరయ్యేలా ఆయన చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే బ్రాహ్మణ వర్గానికి చెందిన బీఎస్పీ మాజీ ఎంపీ రాకేశ్ పాండేని పార్టీలో చేర్చుకున్నారు. 2012 ఎన్నికల్లో ఎస్పీ 224 ఓట్లు సాధించడంలో ఓబీసీలు, ముస్లిం, వైశ్యులు కీలకంగా ఉన్నారు. 19 శాతంగా ఉన్న ముస్లింలకు 2017లో అధిక సీట్లు కేటాయించినా, కేవలం మూడో వంతు మాత్రమే ఎస్పీ నుంచి గెలిచారు. ఓట్ల చీలిక ఇక్కడ ప్రధాన భూమిక పోషించింది. ఈ దృష్ట్యా ముస్లింల ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న మాజీ ఎంపీ సలీమ్ షేర్వానీని ఇప్పటికే పార్టీలో చేర్చుకోగా, కొత్తగా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఇమ్రాన్ మసూద్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అఖిలేశ్ ఇటీవల నిర్వహించిన విజయ్ రథయాత్రకు ముస్లిం ఓటర్లు ఎక్కువగా హాజరయ్యేలా పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. ఇక పశ్చిమ యూపీలో జాట్ల మద్దతు కూడగట్టేందుకు ఆర్ఎల్డీతో ప్రాథమిక చర్చలు పూర్తి చేసింది. ఓబీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు ఆయన బీసీ కులగణన అంశానికి మద్దతిస్తున్నారు. రిజర్వ్డ్ స్థానాలతో పాటు ముస్లిం ఓట్లపై కన్నేసిన బీఎస్పీ ఇక మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కోసం సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా రూపొందిస్తున్నారు. బ్రాహ్మణులతో సహా దళితేతర కులాల నుండి వీలైనంత ఎక్కువ మంది మద్దతు పొందే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ’బహుజన్ టు సర్వజన్’ అనే నినాదం ఆధారంగా ఆయన వ్యూహాలున్నాయి. గతంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో 86 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో బీఎస్పీ 60కి పైగా స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆ స్థానాల్లో పార్టీ నేత సతీశ్‌చంద్ర శర్ము రెండుసార్లు పర్యటించి వచ్చారు. ఇదే సమయంలో ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఎస్పీ వైపునకు వెళ్లకుండా 2012–17 మధ్య అఖిలేశ్ సీఎంగా ఉన్న సమయంలో 134 చోట్ల మతకల్లోల సంఘటనలు జరిగిన అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ‘ఆడపిల్లను... పోరాడగలను’ యూపీలో కాంగ్రెస్ ప్రాబల్యం నానాటికీ తగ్గుతూ వస్తోందనేది అక్షరసత్యం. 2019లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే అమేథిలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గౌరవప్రదమైన స్థానంలో నిలపడానికి ప్రియాంకా గాంధీ శ్రమిస్తున్నారు. స్వయం సహాయక బృందాలు, ఇతర మహిళా సంస్థలతో ఎక్కువగా టచ్‌లో ఉంటూ వారి మద్దతు కూడగట్టే యత్నాలు చేస్తున్నారు.‘లడ్కీ హూ..లడ్ సక్తీ హూ’ నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, మహిళలకు భద్రత కావాలి, మహిళలకు 40 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎస్పీ లేదా బీజేపీ హామీ ఇవ్వగలవా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి జాట్లు అధికంగా ఉండే పశ్చిమ యూపీలో తన ప్రాబల్యాన్ని నిలుపుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్‌తో సంబంధాలు నెరుపుతున్నారు. ముస్లిం–జాట్ కాంబినేషన్ సైతం మంచి ఫలితాలిస్తాయని ఆశిస్తున్న జయంత్ చౌదరి ఎస్పీతో పరస్పర అంగీకారం దిశగా చర్చలు చేస్తున్నారు. -
Facebook: ఫేస్బుక్లో ఇష్టమొచ్చినట్లు డర్టీ పోస్టులు
సోషల్ మీడియాలో విచ్చలవిడి కంటెంట్ కట్టడి కోసం ఐటీ చట్టంలో కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది మన ప్రభుత్వం. ఇది ఒక కోణం. అలాగే ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు స్వతహాగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో దిగ్గజంగా అభివర్ణించే ఫేస్బుక్ తన సొంత రూల్స్‌ను పక్కనపెట్టేస్తోంది. యూజర్లను ‘హైప్రొఫైల్’ కోణంలో విభజించి.. వివక్ష ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో వాళ్లు ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నా.. చూస్తూ ఊరుకుంటోంది. హైప్రొఫైల్ సెలబ్రిటీలు, నటులు, రాజకీయ నాయకులు, ఉన్నత వర్గాలకు చెందిన కొంతమంది యూజర్లు.. తమ ఇష్టమొచ్చినట్లు ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. వీటిలో న్యూడిటీ, హింస, చైల్డ్ ఎబ్యూజ్, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, ఇతరులను ఇబ్బందిపెట్టే విధంగా.. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. ఈ లెక్కన ఫేస్బుక్ రూల్స్ ప్రకారం నడుచుకోవడం వాళ్లు లేదు. అయినా ఫేస్బుక్ వాళ్ల అకౌంట్లపై చర్యలు తీసుకోవడం లేదు. సాకర్ ఆటగాడు నైమర్.. తన ఫేస్బుక్లో నగ్నంగా ఉన్న ఓ మహిళ ఫొటోను పోస్ట్ చేశాడు. ఆమె అతనిపై అత్యాచార ఆరోపణలు చేసేంది. అందుకే ప్రతీకారంగా ఆ పని చేశాడు. ఈ విషయంలో అకౌంట్ రద్దుపై ఎలాంటి చర్యలు తీసుకోని ఫేస్బుక్.. కంటితుడుపు చర్యగా ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. ఇది హై ప్రొఫైల్ సెలబ్రిటీల విషయంలో ఫేస్బుక్ వ్యవహరిస్తున్న తీరుకు ఒక ఉదాహరణ మాత్రమే. క్లిక్: జుకర్‌బర్గ్‌పై ట్రంప్ బూతుపురాణం క్వాలిటీ కంట్రోల్ మెకానిజంలో ఫేస్బుక్ దారుణంగా విఫలం అవుతోందని, ఫేస్‌బుక్‌ను డర్టీగా మార్చేసిందన్నది తాజా ఆరోపణ. క్రాస్‌చెక్(Xcheck) పేరుతో ప్రతీ ఏటా విడుదలయ్యే రిపోర్ట్ ఆధారంగా సోమవారం వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. 2020లో లక్షల మంది బ్లూటిక్ మార్క్ ఉన్న సెలబ్రిటీల అకౌంట్లను, రాజకీయ నాయకుల అకౌంట్లను పరిశీలించినట్లు ఆ కథనం వెల్లడించింది. అయితే ఈ కథనాన్ని కొట్టిపడేసిన ఫేస్బుక్ ప్రతినిధి ఆండీ స్టోన్.. ఫేస్బుక్ రూల్స్ అందరికీ ఒకేలా వర్తించడం లేదన్న విషయంతో ఏకీభవించారు. వైట్ లిస్ట్ పేరుతో కొందరు ప్రముఖులకు ఫేస్బుక్ నుంచి మినహాయింపులు ఇస్తుందన్న క్రాస్ చెక్ నివేదిక.. ఆ ప్రముఖుల్లో హిలరీ క్లింటన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాటి పేర్లను సైతం ప్రస్తావించడం విశేషం. చదవండి: వాట్సాప్ మెసేజ్‌లను చదివేస్తున్న ఫేస్బుక్ -
ట్విట్టర్‌ను వదిలేస్తున్నారు,'కూ' కు క్యూ కట్టేస్తున్నారు
ట్విట్టర్‌కు కేంద్రానికి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు దేశీ సోషల్ మీడియా నెట్ వర్క్ 'కూ' కు వరంగా మారింది. కూ' ను ప్రారంభించిన కేవలం 16 నెలల కాలంలో 10మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుందని సోషల్ మీడియా స్టాటిటిక్స్ సెన్సార్ టవర్ తెలిపింది. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం అమెరికాకు చెందిన ట్విట్టర్‌ను వినియోగించే జాబితాలో భారత్ 22.1 మిలియన్ల యూజర్లతో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో నవంబర్ 14,2019 లో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఎంట్రప్రెన్యూర్ లు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ లు బెంగళూరు కేంద్రంగా 'కూ' ను అందుబాటులోకి తెచ్చారు. ట్విట్టర్ కు కేంద్రానికి వైరం 2020 నాటికి కూ యాప్ ను 2.6 మిలియన్ల మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. అయితే ట్విట్టర్ భారత్ నిబంధనల్ని ఉల్లంఘిస్తుందంటూ పలువురు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులపై కేంద్రం ట్విట్టర్‌కు పలు ఆదేశాలు జారీ చేసింది. అయినా ట్విట్టర్ లైట్ తీసుకుంది.ముఖ్యంగా 2020-21 మధ్య కాలంలో వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళన, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సర్టిఫైడ్ బ్లూ టిక్ ను తొలగించడం, కేంద్రం తెచ్చిన ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించడంతో కేంద్రానికి - ట్విట్టర్ల మధ్య వార్ మొదలైంది. దీంతో కేంద్ర కేబినెట్ మినిస్టర్లు పియూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్‌లు ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి దేశీ నెట్వర్క్ కూ'ను వినియోగించడం ప్రారంభించారు. అప్పటి నుంచే ట్విట్టర్ యూజర్లు కాస్త కూ కు అలవాటు పడ్డారు. దేశీ నెట్ వర్క్ కేంద్రం - ట్విట్టర్ల వివాదం కూ' కు ప్లస్ అయ్యింది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర స్థానిక భాషల్లో ఆపరేట్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన ఈ నెట్ వర్క్‌ను 85శాతం మంది యూజర్లు వినియోగిస్తున్నారు. ట్విట్టర్ యూజర్లు కాస్త దాన్ని వదిలేసి కూ ను వినియోగించేందుకు క్యూ కడుతున్నారు.వారిలో మంత్రులు,బాలీవుడ్ సెలబ్రిటీస్, క్రికెటర్లతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కూ కో ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ స్థానిక భాషాల్లో దేశీ యాప్‌ను వినియోగించేలా డెవలప్ చేశామన్నారు. త్వరలోనే సౌత్ ఈస్ట్ ఏసియన్ కంట్రీస్, ఈస్ట్రన్ యూరప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి : ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!? -
ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అకౌంట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 16 నుంచి జులై 31 మధ్య కాలంలో సుమారు 33.3 మిలియన్ల కంటెంట్ పీస్ (ఇమేజ్)లను అకౌంట్ల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. యూజర్లు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండేందుకు ఫేస్ బుక్ గత కొంత కాలంగా యూజర్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. తద్వారా ఫేస్ బుక్ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్, కంటెంట్లపై కన్నేసింది. ఈ రెండింటిలో ఫేస్‌బుక్‌కు చెందిన 10 కంటెంట్ పాలసీ నిబంధనలతో పాటు ఆ సంస్థకు చెందిన మరో సోషల్ నెట్ వర్క్ ఇన్ స్టాగ్రామ్‌లో 8 పాలసీల నిబంధనల్ని ఉల్లంఘించిన అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల హింస పెరిగిపోతుందా? కరోనా కారణంగా సోషల్ మీడియా వినియోగం రోజురోజుకి పెరిగిపోయింది. సరైన అవగాహన ఉన్నవారు మనీ ఎర్నింగ్ కోసం ఫేస్‌బుక్‌ను ఓ వేదికగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో మరికొందురు రెచ్చగొడుతూ హింసను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్లను భారీగా తొలగించామంటూ ఇటీవల ఫేస్బుక్ స్పోక్ పర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 16 నుంచి జులై 31 మధ్య కాలంలో 25.6 మిలియన్ల ఇమేజ్ కంటెంట్, హింసను రెచ్చగొట్టేలా ఉన్న 3.5 మిలియన్ల గ్రాఫికల్ ఇమేజెస్‌పై, 2.6 మిలియన్ల అడల్ట్ కంటెంట్ ఉన్న ఇమేజెస్‌లను తొలగించినట్లు తెలిపారు. వీటితో పాటు 1లక్షా 23,400 హరాస్ మెంట్ కంటెంట్ ఉన్న అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు,1504 రిపోర్ట్‌ల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ఫేస్బుక్కే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో కూడా.. ఫేస్బుక్కే కాదు..ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ యాజమాన్యం వెల్లడించింది. 1.1 మిలియన్ల హింసాత్మక పోస్ట్‌లు, 8,11,000 వేల సూసైడ్, సెల్ఫ్ ఇంజూరీ ఇమేజ్ కంటెంట్ లపై చర్యలకు ఉపక్రమించింది. జూన్ 16 నుంచి జులై 31 వరకు 265 అకౌంట్లపై యూజర్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వాట్సాప్ లో సైతం ఫేస్బుక్ కు చెందిన మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్‌లో జూన్ 16 నుంచి జులై 31 వరకు 3 మిలియన్ కంటే ఎక్కువ అకౌంట్లును తొలగించింది. ఇదే సమయంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు 36,934 ఫిర్యాదులు అందగా..95,680 ఇమేజెస్‌ను తొలగించింది. చదవండి: ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు! -
నెటిజన్లకు షాక్, పోస్ట్‌లపై 'కూ' యాప్ కొరడా
ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన దేశీయ యాప్ 'కూ' యూజర్లపై కొరడా ఝుళిపించింది.కేంద్ర ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అకౌంట్లను బ్లాక్ చేసే పనిలో పడింది. దేశ భద్రత దృష్ట్యా కేంద్రం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్- 2021కు వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియా అకౌంట్లపై ఆయా సోషల్ మీడియా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా 'కూ' యాప్ 3,431 సోషల్ మీడియా పోస్టులపై దృష్టిసారించింది. జులై నెలలో కమ్యూనిటీ గైడ్‌లైన్స్ విరుద్దంగా ఉన్న 498 పోస్ట్‌లను డిలీట్ చేసింది. మరో 2,933 పోస్ట్‌లను పర్యవేక్షించనుంది. కూ యాప్ వివరాల ప్రకారం.. 'ప్రో యాక్టీవ్ మోడరేట్'లో భాగంగా మొత్తం 65,280 పోస్ట్ లను దృష్టిసారించగా..వాటిలో 1,887 పోస్ట్‌లను డిలీట్ చేసినట్లు మిగిలిన 63,393 పోస్ట్‌లపై హెచ్చరికలు జారీ చేయడం, బ్లర్ చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అకౌంట్ వెరిఫికేషన్ జులైలో ఐటీ రూల్స్ అనుగుణంగా ఉన్న ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లను బ్లూటిక్ వెరిఫికేషన్‌కు అప్లయ్ చేయాలని సూచించింది. తాజాగా కూ యాప్ సైతం ఎల్లో టిక్ వెరిఫికేషన్‌కు అప్లయ్ చేయాలని కోరింది. కాగా, బ్లూటిక్, ఎల్లో టిక్ వెరిఫికేషన్ అకౌంట్ కావాలంటే ప్రముఖులై ఉండాలి. ఉదాహరణకు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినిమా స్టార్స్, స్పోర్ట్స్ పర్సన్, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇలా ఆయా రంగాల్లో రాణిస్తున్న వారి సేవలకు గుర్తుగా ఆయా సోషల్ మీడియా సంస్థలు ఈ వెరిఫికేషన్ అకౌంట్లను అందిస్తుంటాయి. -
ఇన్ స్టాగ్రామ్,ఈ సూపర్ ఫీచర్ గురించి మీకు తెలుసా?!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్ స్టాగ్రామ్ మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో సెన్సిటీవ్ కంటెంట్ ను కంట్రోల్ చేయవచ్చని ఇన్ స్టాగ్రామ్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతిరోజు ప్రపంచ వ్యప్తంగా 500మిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఇన్ స్టాగ్రామ్‌లో గడుపుతున్నారు. అయితే వారిలో కొంతమంది యూజర్లు అశ్లీల ఫోటోలు, మెసేజ్‌లను షేర్ చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు సెన్సిటీవ్ కంటెంట్ కంట్రోల్ ఫీచర్‌ను అప్ డేట్ చేసింది. ఈ ఫీచర్ ను వినియోగించడం ద్వారా అశ్లీల కంటెంట్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇన్‌స్టా గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకంగా అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేస్తే వెంటనే ఇన్స్టాగ్రామ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తొలగిస్తామని ఇన్ స్టాగ్రామ్ వెల్లడించింది. ►ఈ ఆప్షన్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ►ముందుగా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ను క్లిక్ చేయాలి ►క్లిక్ చేసి ప్రొఫైల్ సెంట్టింగ్ లో మెన్యు ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి ►మెన్యు ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సెన్సిటీవ్ కంటెంట్ కంట్రోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ►ఆ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు లిమిట్, అలో, లిమిట్ ఈవెన్ మరో అనే ఆప్షన్ డిస్ప్లే అవుతోంది ► లిమిట్ ఈవెన్ మరో అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అశ్లీల్ కంటెంట్ మీ ప్రొఫైల్ లో షేర్ అవ్వడం ఆగిపోతుంది. చదవండి : ల్యాప్ ట్యాప్ కొనాలనుకుంటున్నారా, అయితే ఈ బ్రాండ్ బాగుంటుందంట -
సురక్షిత ‘మాధ్యమాల’ కోసం...
సామాజిక మాధ్యమాలనేవి రెండువైపులా పదునున్న కత్తి లాంటివి. ట్వీటర్, ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను అనునిత్యం వందలకోట్లమంది వీక్షిస్తున్నారు. భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ప్రపంచంలో ఎక్కడికైనా నిరంతరం స్వేచ్ఛగా ప్రవహించే ఇంటర్నెట్ వాహికగా ఈ మాధ్యమాలన్నీ ఇప్పుడు అరచేతుల్లోని సెల్ఫోన్లలో ఇమిడి పోతున్నాయి. అవి ప్రతి ఒక్కరి స్వరానికీ వేదికవుతున్నాయి. ఆశలు పెంచుకోవడానికి, అవకాశాలు అందుకోవడానికి, ఆలోచన వచ్చిందే తడవుగా దాన్ని లక్షలాదిమందితో పంచుకోవడానికి అవి తోడ్పడుతున్నాయి. వినియోగం వెనకే దుర్వినియోగం మొదలుకావడం ఎక్కడైనా ఉన్నదే. సామా జిక మాధ్యమాల్లో అది మరీ వెర్రితలలు వేస్తోంది. మొన్న మార్చిలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చి నగరంలో ఒక ఉన్మాది మసీదుల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు సాగిస్తూ 51మందిని పొట్టనబెట్టుకుని ఆ రాక్షసకాండను ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన తీరు దీనంతకూ పరా కాష్ట. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను పరిరక్షిస్తూనే... మానవహక్కులకు కాస్తయినా నష్టం కలగనీయకుం డానే ఈ ఆన్లైన్ ఉన్మాదానికి అడ్డుకట్ట వేయడం ఎలాగన్నది చాన్నాళ్లుగా అందరినీ వేధిస్తున్న ప్రశ్న. బుధవారం పారిస్ వేదికగా జరిగిన ప్రపంచ దేశాల నాయకుల, సామాజిక మాధ్యమాల సదస్సు దీనికి సమాధానం వెదకడానికి ప్రయత్నించింది. విద్వేషపూరిత భావాల వ్యాప్తిని సామా జిక మాధ్యమాల్లో సాగనీయకూడదంటూ భారత్‌తోసహా 17 దేశాలు, 8 సామాజిక మాధ్యమాలు ఆ సదస్సులో ప్రతినబూనాయి. అదే సమయంలో భావప్రకటనా స్వేచ్ఛకు కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. తన గడ్డపై ఉన్మాది సాగించిన హత్యాకాండతో కలవరపడిన న్యూజిలాండ్ దేశమే ఈ సదస్సు నిర్వహణకు చొరవచూపింది. అందరినీ సమీకరించింది. అయితే ఇంటర్నెట్ విశ్వ వ్యాపితమైనది. దానిద్వారా వచ్చే సమస్యలు అంతర్జాతీయ స్వభావంతో కూడుకున్నవి. ఎక్కడో ఒకచోట వాటిని అడ్డుకున్నా, మరోచోట మరోరూపంలో అవి వ్యాప్తి చెందుతాయి. నిజానికి ఇప్పుడు జరిగిన సదస్సు వల్ల వెనువెంటనే ఒరిగేదేమీ ఉండదు. ఒక సుదీర్ఘ ప్రయత్నంలో ఇది తొలి అడుగు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. పేరేదైనా పెట్టుకోవచ్చుగానీ ఉన్మాదం బహురూపాల్లో విస్తరించి ఉంది. కొన్ని దేశాల్లో అది జాత్యహంకారంగా, మరికొన్నిచోట్ల మతదురహంకారంగా చొచ్చుకొస్తోంది. సకాలంలో ఈ పోకడ లను గమనించి సమాజం ఒక్కటిగా పోరాడకపోతే చూస్తుండగానే అవి విజృంభిస్తాయి. జర్మనీలో శరణార్ధులుగా వచ్చినవారిపై దాడులు, మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై దాడులు, సిరి యాలో యజ్దీ తెగ ముస్లింలపై మారణకాండ తదితరాలే ఇందుకు ఉదాహరణ. ఆన్లైన్ ద్వారా ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని వ్యాప్తి చేస్తూ, సమాజాలకు ముప్పు కలిగించే ధోరణులపై సమష్టిగా పోరాడాలన్నది పారిస్ సదస్సు సంకల్పం. ఇదంతా స్వచ్ఛందమేనని, న్యూజిలాండ్ ప్రధాని ఆర్డెర్న్ అంటున్నారు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను అడ్డుకోవడం ఈ సదస్సు ఉద్దేశం కాదని చెబుతున్నారు. ఒక్కమాటలో ‘మరో క్రైస్ట్‌చర్చి మారణకాండ’ జరగకుండా చూడటమే తమ ధ్యేయమంటున్నారు. మంచిదే. ఏ మాధ్యమమైనా మనుషుల్ని కలిపేదిగా, వారిని మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్లేదిగా ఉండాలి తప్ప వారిలో విద్వేషాలు పెంచేలా, ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా, హత్యాకాండను ప్రేరేపిం చేదిగా, దాన్ని ప్రత్యక్షంగా చూపేదిగా మారకూడదు. వినూత్న ఆవిష్కరణలకూ, విలక్షణ ధోరణు లకూ సామాజిక మాధ్యమాలు వేదికలైనప్పుడే భావవ్యక్తీకరణ, సృజనాత్మకత పదునుదేరతాయి. స్వేచ్ఛాస్వాతంత్య్రాలు వర్థిల్లుతాయి. విద్వేషాన్ని గుర్తించి సామాజిక మాధ్యమాల నుంచి దాన్ని తొలగించడం సాంకేతికంగా సాధ్య మేనని సామాజిక మాధ్యమాలు ఇన్నాళ్లూ చెబుతూ వచ్చాయి. ఫేస్బుక్ వంటివి కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి నిత్యం వేలాది పోస్టిం గులు తొలగిస్తున్నామని చెప్పాయి. న్యూజిలాండ్ మారణకాండ ప్రత్యక్షప్రసారమయ్యే వరకూ అందరూ దీన్ని విశ్వసించారు. కానీ అదంతా భ్రమేనని తేలింది. సమర్ధవంతమైన శిక్షణ, సంపూ ర్ణమైన అవగాహన ఉండే సిబ్బంది మాత్రమే దేన్నయినా సకాలంలో గుర్తించి తొలగించగలరు. అయితే ఇందుకోసం గణనీయంగా మానవ వనరులు అవసరమవుతాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఏటా వేల కోట్ల డాలర్లు లాభాలు ఆర్జించే సంస్థలు తమ సామాజిక బాధ్యతను విస్మరిస్తు న్నాయి. జవాబుదారీతనం ఉంటుందన్న సంగతిని మరుస్తున్నాయి. ప్రభుత్వాలు సైతం ఇన్నాళ్లూ చూసీచూడనట్టున్నాయి. అయితే పారిస్ సంకల్పం మంచిదేగానీ ఆచరణలో దానికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా చిత్తశుద్ధిలేని పాలకులు ఆ వంకన సహేతుకమైన విమర్శలను సైతం నిరోధించే ప్రయత్నం చేస్తారు. అలాంటి పెడధోరణులు తలెత్తకుండా ఏం చేయవచ్చునో మున్ముందు జరిగే సదస్సుల్లో ఆలోచించాల్సి ఉంటుంది. ఉగ్రవాదం, తీవ్రవాదం మాత్రమే కాదు...ఇతరత్రా అనేక రకాల ముసుగుల్లో సాగుతున్న విద్వేషం కూడా సమాజాలకు ముప్పు కలిగిస్తోంది. తమకు నచ్చని వ్యక్తులపై, గ్రూపులపై వదంతులు వ్యాప్తి చేయడం, దాడులకు పురిగొల్పడం మనదేశంలో ఇటీవలి కాలంలో పెచ్చరిల్లుతోంది. కేవలం వదంతుల కారణంగా మూకదాడులకు పలువురు బలయ్యారు. ఇక ఆన్లైన్లో మహిళలు లైంగిక వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొనడం నిత్యకృత్యం. సామాజిక మాధ్యమాలు సురక్షితంగా మారాలంటే వీటన్నిటినీ పరిహరించడమెలాగో ఆలోచించాలి. ఇన్నేళ్ల కైనా సామాజిక మాధ్యమాల దుష్ఫలితాలపై ఉన్నత స్థాయిలో చర్చ మొదలైంది గనుక కేవలం ఉగ్ర వాదం, తీవ్రవాదంవంటివేకాక, ఇతరేతర అంశాలు సైతం ఇందులో చేరాలి. ‘క్రైస్ట్‌చర్చి పిలుపు’ మరింత అర్ధవంతంగా మారాలంటే సామాజిక మాధ్యమాలకు జవాబుదారీతనం అలవర్చాలి. -
సోషల్ మీడియా ప్రచారంపై ఈసీ గైడ్‌లైన్స్
-
సోషల్ మీడియా ప్రచారంపై ఈసీ గైడ్‌లైన్స్
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. నెట్టింట్లో పార్టీలు, అభ్యర్ధుల ప్రచారంపై ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ ఈసీ మార్గదర్శకాలను జారీ చేసింది. రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో పొందుపరిచే అన్ని ప్రకటనలపై ముందుగానే ఈసీ నుంచి అనుమతి పొందాలి. అభ్యర్ధులు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను సమర్పించాలి. మీడియా సర్టిఫికేషన్, పర్యవేక్షక కమిటీలో సోషల్ మీడియా నిపుణులు ఉంటారని ఈసీ పేర్కొంది. ఆన్లైన్లో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరాంగణంలో కత్తులు దూసే క్రమంలో సోషల్ మీడియా ప్రచారం శ్రుతిమించకుండా ఉండేందుకు ఈసీ విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఈసీ నిబంధనల ఉల్లంఘనపై అందే ఫిర్యాదులను పరిశీలించేందుకు ఫేస్బుక్, గూగుల్ ప్రత్యేకంగా గ్రీవెన్స్ అధికారిని నియమించాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. ఆన్లైన్లో రాజకీయ పార్టీల ప్రకటనలు, ప్రచారంపై పర్యవేక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సరళి, ఫలితాలపై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అతిగా స్పందించే ధోరణి పట్ల అరోరా ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇక సోషల్ మీడియా పాలసీ!
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలపై నిఘాను కట్టుదిట్టం చేయడానికి కొత్తగా ‘సోషల్ మీడియా పాలసీ’ని హోంశాఖ తీసుకురానుంది. ఉగ్రవాదులు తమ భావజాల వ్యాప్తికి, భారత వ్యతిరేక ప్రచారానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పాలసీలో విధివిధానాలపై చర్చించడానికి పలు కేంద్ర ఏజెన్సీల ప్రతినిధులు గురువారం నాడిక్కడ సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా చాలాచోట్ల సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వల్ల అల్లర్లు చెలరేగుతున్నాయని.. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సమస్యాత్మకంగా మారాయని వెల్లడించాయి. సోషల్ మీడియాను పర్యవేక్షించడానికి కావాల్సిన సిబ్బంది, మౌలిక వసతులపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి.