న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలపై నిఘాను కట్టుదిట్టం చేయడానికి కొత్తగా ‘సోషల్ మీడియా పాలసీ’ని హోంశాఖ తీసుకురానుంది. ఉగ్రవాదులు తమ భావజాల వ్యాప్తికి, భారత వ్యతిరేక ప్రచారానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
పాలసీలో విధివిధానాలపై చర్చించడానికి పలు కేంద్ర ఏజెన్సీల ప్రతినిధులు గురువారం నాడిక్కడ సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా చాలాచోట్ల సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వల్ల అల్లర్లు చెలరేగుతున్నాయని.. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సమస్యాత్మకంగా మారాయని వెల్లడించాయి. సోషల్ మీడియాను పర్యవేక్షించడానికి కావాల్సిన సిబ్బంది, మౌలిక వసతులపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి.
ఇక సోషల్ మీడియా పాలసీ!
Published Fri, Jun 23 2017 2:17 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM
Advertisement