సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు సవాల్ చేశారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు పిటిషన్‌పై విచారణ కొనసాగింది.
ఈ సందర్బంగా హైకోర్టు అంబటి రాంబాబు తానే స్వయంగా వాదనలు వినిపించారు. వాదనల సందర్బంగా అంబటి..‘పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో సోషల్ మీడియాలో పెట్టిన అసభ్య పోస్టులపై ఐదుసారు ఫిర్యాదులు ఇచ్చాను. నా ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. దీంతో, పోలీసులు తరఫు న్యాయవాది వాదిస్తూ.. తమకు ఎలాంటి సమాచారం లేదని కోర్టుకు తెలిపారు. దీంతో, ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయమని పోలీసులు తరఫున న్యాయవాదిని ఆదేశించింది. నిన్న నాలుగు ఫిర్యాదులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం ఇచ్చారని కోర్టుకు అంబటి రాంబాబు తెలిపారు.
ఇదిలా ఉండగా.. అంబటి రాంబాబు పిటిషన్‌లోని కీలక అంశాలు ఇవే. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను కించపరుస్తున్నారు. నాపైన, నా కుటుంబ సభ్యులపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల పైన పోలీసులకు వేరువేరుగా ఫిర్యాదులు ఇచ్చాను. నేను ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేదు. అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే ప్రతిపక్ష నాయకులపై వెంటనే కేసులు పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల పోలీసుల వివక్షత చూపిస్తున్నారు. నా ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులు ఆదేశించండి అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment