Elon Musk Said Twitter Will Form A Content Moderation Council - Sakshi
Sakshi News home page

ట్విటర్‌ గురించి ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

Published Sat, Oct 29 2022 7:55 PM | Last Updated on Sat, Oct 29 2022 9:11 PM

Elon Musk Said Twitter Will Form A Content Moderation Council - Sakshi

ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యూజర్లు ట్వీట్‌లకు రేటింగ్‌ ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో ట్విటర్‌ ఏ వెర్షన్‌ కావాలో ఎన్నుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. మరో వైపు ట్విటర్ కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తుందని అన్నారు.  

‘విస్తృతంగా విభిన్న దృక్కోణాలతో ట్విటర్‌ ఓ కంటెంట్‌ మోడరేషన్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఆ కౌన్సిల్‌ ఏర్పాటు అయ్యేవరకు ట్విటర్‌లో కంటెంట్‌ నియంత్రణ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం గానీ, అకౌంట్‌లను పునరుద్ధరణ జరగవు’ అని మస్క్‌ ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement