టీవీల్లో వీడియోలు చూడొచ్చు.. ట్విటర్‌లో సరికొత్త ఫీచర్‌! | Twitter Will Soon Launch Video App For Smart Tvs | Sakshi
Sakshi News home page

టీవీల్లో వీడియోలు చూడొచ్చు.. ట్విటర్‌లో సరికొత్త ఫీచర్‌!

Published Sun, Jun 18 2023 4:42 PM | Last Updated on Sun, Jun 18 2023 5:00 PM

Twitter Will Soon Launch Video App For Smart Tvs - Sakshi

మీకు నచ్చిన గంటల కొద్ది నిడివిగల వీడియోలను ట్విటర్‌లో చూడలేకపోతున్నారా? అయితే, మీకో శుభవార్త. సాధారణంగా యూట్యూబ్‌ వీడియోలను టీవీలో చూడొచ్చు. మరి ట్విటర్‌లో వీడియోలు టీవీల్లో చూడలేం. కానీ ఇకపై ఆ సౌకర్యాన్ని ట్విటర్‌ సైతం అందించనుంది. ప్రస్తుతం, ట్విటర్‌ వీడియోలను టీవీల్లో వీక్షించే సౌకర్యంపై పనిచేస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు.

ట్విటర్‌ యూజర్‌ ఎస్‌ - ఎం రాబిన్‌సన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ట్విటర్‌ వీడియోలను టీవీల్లో చూసే సౌకర్యం ఉంటే బాగుంటుంది. గంటల నిడివి గల వీడియోలను యాప్‌లో చూడలేకపోతున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌పై స్పందించిన మస్క్‌.. త్వరలో ఆ సౌకర్యాన్ని యూజర్లకు అందిస్తామని పేర్కొన్నారు.

మస్క్‌ ట్వీట్‌పై స్పందించిన సదరు యూజర్‌. మస్క్‌కు అభినందనలు తెలిపారు. నేను యూట్యూబ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటాను. ఇకపై దానిని నేను మళ్లీ చూడకూడదని అనుకుంటున్నానని బదులిచ్చారు. 

ఇటీవలపెరిగిపోతున్న డిమాండ్‌ దృష్ట్యా ఆయా టెక్నాలజీ సంస్థలు వీడియో కంటెంట్‌పై దృష్టిసారించాయి. యూజర్లు వీడియోలను సులభంగా వీక్షించేలా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా, ట్విట్‌ సైతం స్మార్ట్ టీవీల్లో వీడియోలు చూసే వీలు కల్పిస్తున్నట్లు మస్క్‌ స్పష్టం చేశారు.

‘సోషల్ మీడియా భవిష్యత్తు అంతా వీడియో కంటెంట్‌దే. ఈ ట్రెండ్‌లో ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. మరింత మంది క్రియేటర్‌లు ట్విటర్‌ను వినియోగించేందుకు మక్కువ చూపుతున్నారు. అందుకే వినియోగదారులు ట్విటర్‌లో వీడియోలు చూసేలా సులభతరం చేయాలనుకుంటున్నట్లు మస్క్‌ తెలిపారు. అందుకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ట్విటర్‌ బాస్‌ మస్క్‌ స్పష్టం చేశారు.

చదవండి👉 ‘నేను స్మార్ట్‌ అయితే’..రూ.3.37 లక్షల కోట్లు పెట్టి ట్విటర్‌ను ఎందుకు కొంటాను?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement