సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లు, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్లపై కేంద్రం దృష్టిసారించింది. ఆదాయపుపన్ను నిబంధనల్ని ఉల్లంఘించిన క్రియేటర్లపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్రియేటర్లను, ఇన్‌ఫ్లుయెన్సర్లను కేంద్ర విభాగానికి చెందిన ఇన్ ట్యాక్స్ అధికారులు విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆదాయాలు, లాభాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించాల్సి ఉందంటూ పీటీఐ తన కథనంలో పేర్కొంది.
ఆ నివేదికల్ని ఊటంకిస్తూ గత వారం, కేరళకు చెందిన 10 మంది యూట్యూబ్ చానల్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సినిమా రంగానికి చెందిన ఆర్టిస్టులు, యాక్టర్స్‌లను ఐటీ అధికారులు విచారించారు. సోషల్ మీడియాలో ప్రభావశీలురుగా చెలామణి అవుతున్నవారు, కంటెంట్ క్రియేటర్లు ఊహించని విధంగా సంపాదిస్తున్నారని, కానీ ఇన్ కమ్ ట్యాక్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
నోటీసులు జారీ
ఇక, కేరళకు చెందిన కంటెంట్ క్రియేటర్ల నుంచి ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు మరిన్ని వివరాలు రాబట్టారని, బాధ్యతాయుతంగా పన్నులు చెల్లించేలా ప్రోత్సాహిస్తూ వారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నివేదికల ప్రకారం..ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కంటెంట్ క్రియేటర్ల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. ఇందులో వారి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, చెల్లింపులు, చెల్లించని ప్రమోషన్‌లు, డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వినియోగం, ఖర్చలు, ఆయా సంస్థల నుంచి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా చేసే ప్రకటనల రూపంలో జరిపే చెల్లింపులపై చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించారు.
కేరళతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియాను ప్రభావితం చేసే వారిపై ఇలాంటి చర్యలే తీసుకున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్ల కార్యకలాపాలు నిర్వహించే సంస్థల గురించి ఆరాతీస్తున్నారు.
కొత్త నిబంధనలు
గత ఏడాది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) వ్యాపారం లేదా వృత్తిలో పొందే ప్రయోజనాలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఒక వ్యక్తి ఏడాదిలో రూ. 20,000 కంటే ఎక్కువ ప్రయోజనాలు లేదా అవసరాలు తీర్చుకుంటే.. సదరు వ్యక్తి 10 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
చదవండి👉 ‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు!
Comments
Please login to add a commentAdd a comment