దక్షిణాది హీరోయిన్లలో నెంబర్ వన్‌గా నిలిచి బాహుబలి సహా భారీ చిత్రాల్లో నటించి.. కొంత కాలం పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన అనుష్క శెట్టి ఇప్పుడు కెరీర్‌లో వెనుకబడ్డారు. అయితే సినిమాల్లో ఎక్కువ కనిపించకపోయినా ఆమె పట్ల ప్రేక్షకుల్లో ఆదరణ చెక్కు చెదరలేదనే విషయం తాజాగా కూ యాప్ సాక్షిగా నిరూపితమైంది.
ట్విట్టర్ స్థానంలో దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా శరవేగంగా భారతీయులను ఆకర్షిస్తున్న కూ యాప్ అంతకంతకూ ప్రముఖులకు కేరాఫ్‌గా మారుతోన్న నేపధ్యంలో.. రాజకీయ, సినీ రంగ సెలబ్రిటీలు కూ యాప్‌పై ఖాతాలను ప్రారంభిస్తున్నారు. అదే విధంగా 4నెలల క్రితం అనుష్క శెట్టి కూడా తన కూ యాప్ ఖాతాను ప్రారంభించింది. అయితే కేవలం 4నెలల్లోనే ఆమెకు 10లక్షల మంది ఫాలోయర్స్ ఏర్పడడం విశేషం. తాజాగా 40వ పుట్టిన రోజును జరుపుకున్న ఆమెకు ఈ స్థాయి ఫాలోయింగ్... అభిమానులు ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment