మైక్రో బ్లాగర్ ట్విటర్ యూజర్లను దాటే లక్ష్యంగా దేశీయ సోషల్ మీడియా సంస్థ 'కూ' దూసుకుకెళ్తుంది. యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌లు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో 'కూ' 'పాపా కి లవ్ లాంగ్వేజ్' పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఫాదర్స్ డే సందర్భంగా వినియోగదారులు వారి తండ్రికి సంబంధించిన ఆత్మీయ కథనాలతో పాటు ఫోటోలు, మీమ్‌లు,వీడియోల ద్వారా ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకునే అవకాశం కల్పించింది.
ఈ సందర్భంగా యూజర్లు వారి నాన్నల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారో గుర్తు చేస్తూ ఆయన్ని సంతోష పెట్టే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తుంది.ఈ కాంపెయిన్లో భాగంగా, కూ యాప్ ప్రత్యేక కవితల పోటీని కూడా ప్రారంభించింది, కవిత్వం ద్వారా తమ తండ్రికి కృతజ్ఞత తెలియజేసేందుకు యూజర్లను ఆహ్వానిస్తోంది. మరి ఈ పోటీల్లో మీరూ పాల్గొంటున్నారా.
Comments
Please login to add a commentAdd a comment