
మన స్వదేశీ బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌గా ప్రసిద్ధి చెందిన కూ యాప్... అనతి కాలంలోనే అత్యధిక సంఖ్యాక ప్రజలకు చేరువవుతూ, అద్భుత విజయాలు స్వంతం చేసుకుంటోంది. అదే క్రమంలో తాజాగా నాస్కామ్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని కూడా అందుకుంది.
‘నాస్కామ్ లీగ్ ఆఫ్ 10 ఎమర్జ్ 50 అవార్డ్’ను గెలచుకుంది భారతదేశపు 50 అత్యుత్తమ వైవిధ్య భరిత సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల తయారీ కంపెనీలను గుర్తించి ఈ అవార్డులను అందిస్తారు. ఇందులోనూ సంస్థ మరిన్ని విజయాలను స్వంతం చేసుకుని, ఎక్కువ మంది ప్రజల మీద ప్రభావం చూపిన విధానాన్ని బట్టి లీగ్ ఆఫ్ 10లో స్థానం కల్పిస్తారు. ఆ జాబితాలో ఏకైక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌గా కూ కు అగ్రస్థానం దక్కడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment