
ప్రణీత సుభాష్.. తన హావభావాలతో స్క్రీన్ మీద మంచి నటిగా.. పలు సేవా కార్యక్రమాలతో ఆఫ్ ది స్క్రీన్ మంచి వ్యక్తిగా ముద్ర వేసుకుంది. ఆమె తన మనసులో ముద్రించుకున్న విషయాలూ ఉన్నాయి. అందులో ఫ్యాషన్ ఒకటి. ఆ ఫ్యాషన్‌లో ఈ బ్రాండ్స్ కొన్ని...
అనావిల
చీరలు అంటే అమితంగా ఇష్టపడే అనావిల మిశ్రా.. 2011లో ప్రారంభించిందే ఈ బ్రాండ్. సొగసును పెంచే సరికొత్త డిజైన్లకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. అందుకే విదేశాల్లోనూ అనావిలకు మంచిపేరు ఉంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. అందుబాటులో ధరలు.
ఆర్ని బై శ్రావణి
ఎలాంటి వధువుకైనా నప్పే, నచ్చే ఆభరణాలను అందించడం ఆర్నిబై శ్రావణి జ్యూయెలర్స్ ప్రత్యేకత. విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన అద్భుతమైన డిజైన్లలో ఆకట్టుకుంటాయి ఈ బ్రాండ్ ఆభరణాలు. ఆర్డర్ ఇచ్చి మాత్రమే కొనుగోలు చేయొచ్చు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర.
చీర
బ్రాండ్ : అనావిల
ధర : రూ. 44,000
జ్యూయెలరీ
బ్రాండ్ : ఆర్ని బై శ్రావణి
ధర : ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది.
‘మాది డాక్టర్ల కుటుంబం. అమ్మా,నాన్నలకు బెంగళూరులో హాస్పిటల్ ఉంది. చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్డే అలవాటు. నా బ్యూటీ సీక్రెట్ కూడా అదే అయ్యుంటుంది! –ప్రణీత సుభాష్
చదవండి: Actress Poorna: ‘పర్‌ఫెక్ట్ బ్రాండ్’... పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు! ప్రత్యేకత ఏమిటంటే!
Comments
Please login to add a commentAdd a comment