అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత సుబాష్ ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోన్న ప్రణీత కొద్దిరోజుల క్రితం భర్త నితిన్ రాజుకు పాద పూజ చేసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనినే భీమన అమావాస్య పూజ అంటారు. పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంచి భర్త రావాలని ఈ పూజ చేస్తుంటారు. అయితే సాంప్రదాయాలను ఫాలో అవుతూ అతడి పాదాలకు పూజ చేసిన ప్రణీతను చూసి కొందరు నెటిజన్లు ఇంకా ఏ కాలంలో ఉందో అంటూ వెటకారంగా మాట్లాడారు. మరికొందరేమో ఏ.. భర్త పాద పూజ చేయొచ్చు కదా, తనే ఎందుకు చేయడం అంటూ ప్రశ్నించారు.
ఈ విమర్శలపై తాజాగా ప్రణీత స్పందించింది. 'జీవితంలో జరిగే ప్రతి విషయానికి రెండు కోణాలుంటాయి. 90 శాతం జనాలు పాజిటివ్‌గా స్పందిస్తారు. మిగిలినవారు నోటికొచ్చినట్లు వాగుతారు, అదంతా నేను పట్టించుకోను. ఒక నటిగా నేను గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నంతమాత్రాన సాంప్రదాయాలను, ఆచారాలను ఎందుకు పాటించననుకుంటున్నారు. చిన్నప్పటినుంచి అవన్నీ చూస్తూ పెరిగాను. నా సోదరీమణులు, ఫ్రెండ్స్, పక్కింటివాళ్లు ఇలా అందరూ ఈ పూజ చేశారు. పెళ్లైన కొత్తలో గతేడాది కూడా ఈ పూజ చేశాను. కాకపోతే ఫొటో షేర్ చేయలేదంతే! చెప్పాలంటే ఇది నాకు కొత్తేం కాదు. నేనెప్పుడూ పద్ధతి గల అమ్మాయిగానే నడుచుకోవాలనుకుంటాను, సాంప్రదాయ విలువలను, పూజలు, పునస్కారాలను గౌరవిస్తాను. అమ్మ, పెద్దమ్మలు, నానమ్మలు, అంకుల్స్ మధ్యే పెరిగాను. ఆ వాతావరణం నాకిష్టం. మోడ్రన్‌గా ఆలోచించడమంటే మనం నడిచొచ్చిన దారిని మర్చిపోవడం కాదు' అని చెప్పుకొచ్చింది.
చదవండి: ఓటీటీలో అమలాపాల్ విక్టిమ్ సిరీస్, ఎప్పటినుంచంటే?
నటితో అమర్‌దీప్ నిశ్చితార్థం, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment