అత్తారింటికి దారేది చిత్రంతో కుర్రకారు గుండెలను పిండేసిన ముద్దుగుమ్మ ప్రణీత. ఈ బ్యూటీ తెలుగులో పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే బెంగళూరుకు చెందిన నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే...
హీరోయిన్ ప్రణీత సుభాష్ టర్కీలో టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఒకరి తల్లి కూడా తన అందంతో కొత్త నటీమణులకు ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పుడు టర్కీలో ఓ బీచ్‌లో నిలబడి ఉన్న ఫోటోను ఆమె రిలీజ్ చేసింది . అయితే ఆ ఫోటోలో ఆమె బ్లూ కలర్ స్విమ్ సూట్ ధరించి ఉంది. నటి ప్రణీత సుభాష్ ఇటీవల ఏ సినిమాలోనూ కనిపించలేదు. అప్పుడప్పుడు కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది.
నటి ప్రణీత సుభాష్ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. 'చాలా హాట్‌గా ఉంది కానీ పూర్తి ఫోటో లేదని ఒకరు కామెంట్ చేస్తే.. 'వావ్, మీరు ఎల్లప్పుడూ చాలా అందంగా కనిపిస్తారంటూ హబీబీ కమ్ టు ఇండియా అని తెలిపారు. మరోకరైతే దయచేసి టర్కీకి వెళ్లవద్దు.. ఇది శత్రు దేశమని తెలిపారు. కొన్నేళ్లుగా నటనకు విరామం ఇచ్చిన ప్రణిత కొద్దిరోజుల క్రితం రామావతార్ చిత్రాన్ని ప్రకటించింది. రిషి, ప్రణీత ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment