Heroine Pranitha Subhash Announced Her Pregnancy And Shares Adorable Pics - Sakshi
Sakshi News home page

Pranitha Subhash : శుభవార్త చెప్పిన హీరోయిన్‌ ప్రణీత.. ఫోటోలు వైరల్‌

Published Mon, Apr 11 2022 12:48 PM | Last Updated on Mon, Apr 11 2022 1:06 PM

Heroine Pranitha Subhash Announced Her Pregnancy And Shares Adorable Pics - Sakshi

ప్రముఖ హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 'నా భర్త34వ పుట్టినరోజున దేవుడు మాకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు భర్తతో  దిగిన ఫోటోలను షేర్‌ చేసింది. ఈ ఫోటోల్లో ప్రణీత ఆమె భర్తను హగ్‌ చేసుకొని పట్టలేని ఆనందంతో కనిపిస్తుంది.

ఈ సందర్భంగా ప్రెగ్నెన్సీ కిట్‌ సహా స్కానింగ్‌కు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంది. దీంతో పలువురు ప్రముఖులు సహా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా గతేడాది వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ప్రణీత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కరోనా ఆంక్షల నడుమ అతికొద్ది మంది సన్నిహితులు, బంధువు సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది.

ఇక ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ప్రణీత 'రభస', 'డైనమైట్' సహా పలు చిత్రాల్లో నటించింది. పవన్‌కల్యాణ్‌ సరసన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించిన 'బాపు బొమ్మ'గా పాపులర్‌ అయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement