హీరోయిన్ ప్రణిత సుభాష్ పెళ్లి పీటలెక్కింది. నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. కరోనా కారణంగా బెంగుళూరులోని ప్రణిత నివాసంలోనే పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఇక వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు.. ప్రణిత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గంటల వ్యవధిలోనే ప్రణిత పెళ్లి టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. కరోనా కారణంగా అతి తక్కువ మంది అతిథుల మధ్య వివాహం జరిగిందని సమాచారం. ప్రస్తుతం ప్రణిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
పెళ్లి కొడుకు నితిన్ కూడా బెంగుళూరుకు చెందిన వారని తెలుస్తోంది. ఇక పెళ్లి వార్తలపై స్పందించిన ప్రణిత స్పందించింది. ఇది లవ్ కమ్ అరెంజెడ్ మ్యారెజ్. చాలా కాలంగా నితిన్ నాకు తెలుసు. ఇక పెళ్లితో మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాక మా ఇరు కుటుంబాలకు విషయం చెప్పాం. వాళ్లు కూడా మా నిర్ణయం పట్ల చాలా సంతోషించారు. ఇక నా వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం నాకు అంతగా ఇష్టం ఉండదు. నేను నా పెళ్లి ఎలా అయితే జరగాలని కలలు కన్నానో అలానే జరిగింది. కరోనా కారణంగా అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు అని ప్రణిత వివరించింది. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటించిన ప్రణిత అత్తారింటికి దారేది, రభస చిత్రలతో మరింత గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె హంగామా-2, భుజ్ అనే చిత్రాల్లో నటిస్తోంది. కన్నడలోనూ రమణ అవతార అనే చిత్రంలో నటిస్తుంది.
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రణిత.. ఫోటోలు వైరల్
Published Mon, May 31 2021 1:25 PM | Last Updated on Mon, May 31 2021 4:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment