marriage cermony
-
ప్రపంచ పొట్టి బాడీబిల్డర్ వివాహం.. వీడియో వైరల్
ప్రపంచ అత్యంత పొట్టి బాడీబిల్డర్‌గా పేరుపొందిన ప్రతీక్ విట్టల్ మోహిత్ వివాహ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ప్రతీక్ విట్టల్ ఎత్తు కేవలం 3 అడుగుల 4 అంగుళాలు మాత్రమే. కాగా ప్రతీక్ పెళ్లి చేసుకున్న యువతి ఎత్తు 4 అడుగుల రెండు అంగుళాలు. నాలుగేళ్ల క్రితం ఈ ఇద్దరికీ పరియమైంది. ఆ తర్వాత ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించడంతో ప్రతీక్ విట్టల్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. పెళ్లి కుమారుడి దుస్తుల్లో ఓ వాహనంపై నిలుచుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేసి వార్తల్లో నిలిచాడు. ప్రతీక్ తన బాడీబిల్డింగ్ కేరీర్‌ను 2012లో మొదలుపెట్టాడు. 2016లో తొలిసారి కాంపిటీషన్లో పాల్గొన్నాడు. బాడీబిల్డర్‌గా ప్రతీక్ 2021లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను అందుకున్నాడు. పురుషుల విభాగంలో షార్టెస్ట్ కాంపిటీటివ్ బాడీబిల్డర్(Shortest Competitive Bodybuilder) టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఓ మంచి ఉద్యోగంలో చేరి జయను బాగా చూసుకోవాలంటూ ప్రతీక్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Pratik Mohite (@pratikmohite_official) View this post on Instagram A post shared by Pratik Mohite (@pratikmohite_official) -
ప్రేయసితో ఘనంగా టీమిండియా ఆల్‌రౌండర్ పెళ్లి
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సోమవారం రాత్రి ఒక ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు, వ్యాపారవేత్త మిథాలీ పారుల్కర్‌ను పెళ్లాడాడు. బంధువులు, స్నేహితులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. ముంబైలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. తాజాగా సోమవారం రాత్రి వివాహబంధంతో వీరిద్దరు ఒక్కటయ్యారు. మిథాలీ పారుల్కర్ ‘ది బేక్స్’ పేరుతో బేకరీ ఫుడ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆల్ ది జాజ్ లగ్జరీ బేకర్స్ సంస్థ ద్వారా ముంబైలో వ్యాపారాలను నిర్వహిస్తోంది. క్రికెటర్ దీపక్ చాహర్ భార్య మాలతీ చాహర్ వివాహ వేడుకలో కనిపించింది. కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ సభ్యుడు అభిషేక్ నాయర్, ముంబై ప్లేయర్ సిద్ధేష్ లాడ్ కూడా శార్దూల్ ఠాకూర్ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక టీమిండియా తరపున శార్దూల్ ఠాకూర్ 8 టెస్టులు, 34 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన శార్దూల్ 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీయడంతో పాటు 120 పరుగులు చేశాడు. గతేడాది మినీ వేలంలో శార్దూల్ ట్రేడింగ్‌లో కేకేఆర్‌కు బదిలీ అయ్యాడు. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ షురూ కానుంది. కాగా, పెళ్లి కారణంగా శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, ఆసీస్‌తో వన్డే సిరీస్ కు శార్దూల్ జట్టులో చేరతాడని సమాచారం. Congratulations You Beautiful Couple Lord #Shardul Thakur and Mittali Parulkar pic.twitter.com/vKSUQjGgY1 — Lalit Tiwari (@lalitforweb) February 27, 2023 చదవండి: ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్‌బాల్' పనికిరాదు పరుగు తేడాతో విజయం.. 30 ఏళ్ల రికార్డు కనుమరుగు -
ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె పెళ్లి.. హాజరైన షాహిన్ ఆఫ్రిది
Shahid Afridi Daughter Marriage: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చీఫ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రిది ఇంట పెళ్లి సందడి నెలకొంది. అతడి పెద్ద కుమార్తె అక్సాకు నసీర్ నాసిర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కరాచీలో శుక్రవారం అత్యంత సన్నిహితుల నడుమ నిఖా జరిగింది. ఇక ఈ పెళ్లిలో పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కాబోయే మామ షాహిద్‌తో కలిసి తోడల్లుడి వెనుకాల నిల్చుని వేడుకను వీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షాహిన్ వివాహం ఎప్పుడంటే! షాహిద్ ఆఫ్రిది రెండో కుమార్తె అన్షా ఆఫ్రిదితో షాహిన్ పెళ్లి జరుగనున్న విషయం తెలిసిందే. కాగా పెద్ద కూతురు అక్సా వివామైన తర్వాత అన్షాకు పెళ్లి చేయాలని షాహిద్ కుటుంబం నిర్ణయించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 3న షాహిన్- అన్షా పెళ్లికి ముహూర్తం ఖరారు చేసింది. వాళ్లు అడిగారు.. ఓకే అన్నా కాగా తన కుమార్తెతో షాహిన్ నిఖా జరిపించే విషయమై అతడి కుటుంబం తమను సంప్రదించిందని షాహిద్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా పాక్ ప్రధాన పేసర్‌గా షాహిన్ ఎదగగా.. షాహిద్ ఇటీవలే పీసీబీ చీఫ్ సెలక్టర్‌గా ఎన్నికయ్యాడు. ఇలా మామా- అల్లుడు పాకిస్తాన్ క్రికెట్లో కీలక సభ్యులుగా మారారు. ఇదిలా ఉంటే షాహిద్ ఆఫ్రిదికి ఐదుగురు ఆడపిల్లలు సంతానం అన్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం అతడికి ఐదోసారి ఆడబిడ్డ జన్మించింది. కూతుళ్లతో షాహిద్ ఆఫ్రిది చదవండి: Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు! Rishabh Pant: తల్లిని సర్ప్రైజ్ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్ Shahid Afridi daughter Aqsa's Nikah in Karachi @SAfridiOfficial @iShaheenAfridi pic.twitter.com/Zd6USavkeB — ٰImran Siddique (@imransiddique89) December 30, 2022 -
ఫిబ్రవరిలో పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా ఆల్‌రౌండర్
టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.ఎంట్రప్రెన్యూర్ అయిన మితాలీ పారుల్కర్‌ను ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నాడు. గతేడాది నవంబర్‌లో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పటినుంచి శార్దూల్ క్రికెట్లో బిజీగా ఉండడంతో సమయం కుదరలేదు. ముంబై సమీపంలోని కర్జత్ ప్రాంతంలో వీరిద్దరి వివాహం జరగనుంది. మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో ఈ జంట పెళ్లి చేసుకోనుంది. వీళ్ల పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు ఫిబ్రవరి 25వ తేదీన మొదలు అవుతాయి. కాగా శార్దూల్‌తో పెళ్లిపై స్వయంగా పెళ్లి కూతురు మితాలీ స్పందించింది. ''శార్ధూల్ క్రికెట్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 24 వరకు అతనికి మ్యాచ్‌లు ఉన్నాయి. ఫిబ్రవరి 25న మాతో కలుస్తాడు. మా పెళ్లికి దాదాపు 200 నుంచి 250 మంది అతిథులు వస్తారని అనుకుంటున్నాం. మేము మొదటగా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అనుకున్నాం. అయితే, బంధువులు, స్నేహితులు ఎక్కువ మంది ఉండడంతో అందరినీ గోవా తీసుకెళ్లడం కష్టమని ఆ నిర్ణయం వాయిదా వేశాం '' అని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్లో శార్దూల్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అతడిని కోల్‌కతా కొనుగోలు చేసింది. పోయిన ఏడాది వేలంలో రూ. 10.75 కోట్లకు శార్ధూల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అయితే అతను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ట్రేడింగ్ పద్ధతిలో కోల్‌కతాకు అమ్మేసింది. -
ఇంటివాడైన సన్‌రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ
Sandeep Sharma Marriage.. టీమిండియా ఆటగాడు.. సన్‌రైజర్స్ హైదరబాద్ బౌలర్ సందీప్ శర్మ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్ యాజమాన్యం సందీప్‌కు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. సందీప్.. అతని భార్య తాషా సాత్విక్ పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ.. ''ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీకి పెళ్లి కళ వచ్చింది. కంగ్రాట్స్ మిస్టర్ అండ్ మిసెస్ సందీప్ శర్మ.. మీ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్ చేసింది. కాగా తాషా సాత్విక్ వృత్తిరిత్యా ఫ్యాషన్,నగల డిజైనర్‌గా పనిచేస్తున్నారు. 2018లోనే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినప్పటికీ.. కరోనా కారణంగా వీరి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ శర్మకు అభిమానులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సందీప్ శర్మ 2013 నుంచి ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 95 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన సందీప్ శర్మ 110 వికెట్లు తీశాడు. 2013 నుంచి 2017 వరకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడిన సందీప్ ఆ తర్వాత 2018 నుంచి సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. ఇక జూలై 17, 2015లో జింబాబ్వేతో జరిగిన T20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. చదవండి: రనౌట్ కోసం థర్డ్ అంపైర్‌కు అప్పీల్; స్క్రీన్‌పై మ్యూజిక్ ఆల్బమ్ (ఫోటో గేలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) A special addition to the #SRHFamily.😍 Congratulations to Mr and Mrs Sharma 🙌🏽 🥂 to a lifelong partnership!#OrangeOrNothing #OrangeArmy pic.twitter.com/gQcLsX9nIL — SunRisers Hyderabad (@SunRisers) August 20, 2021 -
ఊరంతా వరద నీరే.. తగ్గేదే లే! అని పెళ్లితో ఒక్కటైన ప్రేమ జంట
ముంబై (కొల్హాపూర్): మహారాష్ట్రలోని పలు నగరాలను వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడ చూసిన వరదలు పొంగి పొర్లుతున్నాయి. ఇదే క్రమంలో సాంగ్లి నగరాన్ని కూడా వరదలు వదల్లేదు. అయితే వరద నీరు పోటెత్తడంతో పెళ్లిళ్లు, వివిధ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. తాజాగా ఓ ప్రేమికుల జంటకు ఈ నెల (జూలై) 23న నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లికి ముహూర్తం ఖరారు చేసే సమయానికి ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. అయితే, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వాయిదా వేయడం ఎందుకని ఆ ప్రేమ జంట, వారి కుటుంబ సభ్యులు అడుగు ముందుకేవేశారు. వరద నీటిలో బోట్లతో పరిమిత సంఖ్యలోనే బంధువులను తరలించారు. మిగతా పనులనూ చక్కబెట్టారు. ఇక అనుకున్న ముహూర్తానికి జులై 26న జరిగిన ఈ వివాహం హాట్ టాపిక్‌గా మారింది. వధూవరులు బోట్లలో వెళ్తున్న వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై పెళ్లి కొడుకు రోహిత్ సూర్య వంశీ మాట్లాడుతూ.. ‘‘పెళ్లి వేడుక కోసం ఇంటి దగ్గర ఓ ఫంక్షన్ హాల్ బుక్ చేశాం. కానీ వర్షం వల్ల మరో చోటుకి మార్చాం. కొద్దిమంది అతిథులతో సోనాలి (పెళ్లి కూతురు) ఇంట్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. దీనికోసం ఓ పడవను ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి మళ్లీ తిరిగి ఇంటికి రావాలి. అందువల్ల మళ్లీ పడవలో తిరిగి ఇక్కడికి చేరుకున్నాం. అంతే కాకుండా కోవిడ్‌కు సంబంధించిన అన్ని రకాల నిబంధనలను పాటించి, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఇప్పటికే పెళ్లి వేడక కోసం అన్ని రకాల సామాగ్రిని కొనుగోలు చేశాం. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పెళ్లి తేదీని వాయిదా వేసే ప్రసక్తి లేదని నిర్ణయించుకుని ముందుకు సాగాం. ఇక పెళ్లి తర్వాత బరాత్ కార్యక్రమం ఉంటుంది. కానీ దాన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది.’’ అని తెలిపాడు. దీనిపై నెటిజనులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీ పట్టుదలకు వందనాలంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన టైమ్స్ ఆఫ్ ఇండియా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
తాగి రచ్చ చేసిన వరుడు... ఊహించని షాక్!
లక్నో: ‘పెళ్లి’ అనేది ‘నూరేళ్ల పంట’ అనీ, ‘నూరు ఏళ్లపాటు సాగవలసిన పంట’ అనీ అంటారు. అలాగే ‘శత ఆయుష్మాన్ భవ’ - ‘ వంద సంవత్సరాలు ఆనందంగా జీవించు’ అనేది పెద్దలందరూ పిల్లలకిచ్చే ఆశీర్వాదం. ఇక పెళ్లి సందడి గురించి చెప్పాలంటే అసలు సమయమే సరిపోదు. అయితే తాజాగా ఓ వరుడు, అతని స్నేహితులు పెళ్లి వేదిక వద్దకు తాగి రావడంతో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)లో ఓ 22 ఏళ్ల యువతి పెళ్లికి నిరాకరించింది. వివాహా నిశ్చయానికి ముందు ఇచ్చిన బహుమతులు తిరిగి ఇవ్వడానికి అంగీకరించే వరకు వదువు కుటుంబం వరుడి తరుపు వాళ్లని బందీగా ఉంచింది. దీంతో పెళ్లికొడుకు కుటుంబం పోలీసులను పిలిచి సమస్యను పరిష్కరించమని అభ్యర్థించింది. తిక్రీ గ్రామంలోని ఒక రైతు తన కుమార్తె వివాహాన్ని రవీంద్ర పటేల్ అనే వ్యక్తితో ఏర్పాటు చేశాడు. అయితే పెళ్లి రోజున వరుడు, అతని స్నేహితులు కొందరు తాగి పెళ్లి మండపం వద్దకు వచ్చారు. వధువు, ఆమె కుటుంబం పెళ్లి కొడుకు, అతని స్నేహితులు చేసే చేష్టలకు చాలా సార్లు హెచ్చరించారు. అయితే పెళ్లికి కొద్ది నిమిషాల ముందు వరుడు వధువును డ్యాన్స్ చేయమని బలవంతం చేయడంతో పరిస్థితి మలుపు తిరిగింది. పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడానికి నిరాకరించింది. అయితే వరుడు విసిగెత్తి.. బీభత్సం సృష్టించాడు. దీంతో అతని ప్రవర్తనకు విసుగెత్తిన వధువు పెళ్లికి నిరాకరించింది. అయితే ఈ విషయాన్ని పరిష్కరించడానికి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక చివరకు వరుడి కుటుంబం పెళ్లికి ముందు తీసుకున్న నగదు, ఇతర వస్తువులను పెళ్లి కుమార్తె కుటుంబానికి తిరిగి ఇవ్వడానికి అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. కానీ పెళ్లి ఆగిపోయింది. (చదవండి: దారుణం: భార్యా.. పిల్లలను బావిలో నెట్టివేసి భర్త.. ఆపై రాళ్ల దాడి) -
హీరోయిన్ ప్రణిత భర్త గురించి ఈ విషయాలు తెలుసా?
హీరోయిన్ ప్రణిత సుభాష్ రీసెంట్‌గానే పెళ్లి చేసుకొని మిసెస్ ప్రణితగా మారింది. ఏమాత్రం హడావిడి లేకుండా, చాలా సైలెంట్‌గా పెళ్లి విషయాన్ని రివీల్ చేసింది. నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను లాక్డౌన్లో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చింది. బెంగుళూరులోని తన నివాసంలో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ప్రణిత పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు.. ప్రణిత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇక పెళ్లి విషయంపై స్పందించిన ప్రణిత తమది ప్రేమ వివాహమని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నట్లు వివరించింది. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా పెళ్లి తేదీపై సందిగ్ధత నెలకొందని, పెళ్లికి ముందు రోజు వరకు ఇలాంటి పరిస్థితే కొనసాగిందని పేర్కొంది. కోవిడ్ దృష్ట్యా ఎక్కవమంది ఆహ్వానించలేకపోయామని, పెద్ద మనసుతో మన్నించాలని కోరుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇక ప్రణిత పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో అసలు ప్రణిత పెళ్లి చేసుకుంది ఎవరిని ఆయన ఏం చేస్తుంటారంటూ చాలామంది గూగూల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రణిత భర్త బెంగుళూరులో హాస్పిటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసి 2011లో బ్లూ హరిజన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ బిజెనెస్‌తో పాటు నితిన్ రాజుకు మరికొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయని సమాచారాం. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటించిన ప్రణిత అత్తారింటికి దారేది, రభస చిత్రలతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో తెరకెక్కుతోన్న ‘హంగామా-2’, భుజ్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. గతేడాది లాక్డౌన్ సమయంలో వలస కూలీల స్వయంగా ఆహారం తయారు చేసి అందిస్తూ అందరి మనసును గెలుచుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రణిత.. ఫోటోలు వైరల్ -
బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణిత
హీరోయిన్ ప్రణిత సుభాష్ పెళ్లి పీటలెక్కింది. నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. కరోనా కారణంగా బెంగుళూరులోని ప్రణిత నివాసంలోనే పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఇక వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు.. ప్రణిత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గంటల వ్యవధిలోనే ప్రణిత పెళ్లి టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. కరోనా కారణంగా అతి తక్కువ మంది అతిథుల మధ్య వివాహం జరిగిందని సమాచారం. ప్రస్తుతం ప్రణిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పెళ్లి కొడుకు నితిన్ కూడా బెంగుళూరుకు చెందిన వారని తెలుస్తోంది. ఇక పెళ్లి వార్తలపై స్పందించిన ప్రణిత స్పందించింది. ఇది లవ్ కమ్ అరెంజెడ్ మ్యారెజ్. చాలా కాలంగా నితిన్ నాకు తెలుసు. ఇక పెళ్లితో మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాక మా ఇరు కుటుంబాలకు విషయం చెప్పాం. వాళ్లు కూడా మా నిర్ణయం పట్ల చాలా సంతోషించారు. ఇక నా వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం నాకు అంతగా ఇష్టం ఉండదు. నేను నా పెళ్లి ఎలా అయితే జరగాలని కలలు కన్నానో అలానే జరిగింది. కరోనా కారణంగా అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు అని ప్రణిత వివరించింది. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటించిన ప్రణిత అత్తారింటికి దారేది, రభస చిత్రలతో మరింత గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె హంగామా-2, భుజ్ అనే చిత్రాల్లో నటిస్తోంది. కన్నడలోనూ రమణ అవతార అనే చిత్రంలో నటిస్తుంది. -
కరోనా నిబంధనలు బ్రేక్..నెటిజన్ల ట్రోల్స్
పూణె : కరోనా నిబంధనలు పాటించాలని కేంద్రం ఓ వైపు హెచ్చరికలు చేస్తున్నా సొంతపార్టీ నేతలే వాటిని బేఖాతరు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సోలాపూర్‌లోని మల్షిరాస్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే రామ్ సత్పుటే వివాహం సోమవారం పూణెలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు హాజరైన బీజేపీ అగ్రనేతలు చాలామంది కరోనా నిబంధనల్ని బ్రేక్ చేశారు. మాస్కులు ధరించకపోవడంతో పాటు కనీసం భౌతికదూరం కూడా పాటించలేదు. (‘భారత్‌లో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్’ ) అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం, వివాహ వేడుకకు 50 మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, వెయ్యి మందికి పైగా రిసెప్షన్‌కు హాజరయ్యారు. వీరిలో మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సహా మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. నిబంధనల్ని తుంగలో తొక్కి గుంపులు, గుంపులుగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియలో వైరల్ కావడంతో నెటిజన్లు పలువురు నేతలను ట్రోల్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ఇక ప్రజలకేం చెబుతారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. (దారుణం: చూస్తుండగానే దడేల్, దడేల్! ) -
మిస్టరీ స్పిన్నర్ పెళ్లి.. వైరలవుతున్న వీడియో
ఢిల్లీ : కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. సుదీర్ఘకాలంగా నేహా ఖడేఖర్తో ప్రేమాయణం నడుపుతున్న వరుణ్ చక్రవర్తి శనివారం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు వరుణ్ చక్రవర్తికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా కేకేఆర్ ఫ్రాంచైజీ వరుణ్ చక్రవర్తికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా కేకేఆర్ ఒక వీడియోను విడుదల చేసింది. రిసెప్షన్ సందర్భంగా దంపతులిద్దరితో క్రికెట్ ఆడిపించారు. వరుణ్ బంతి విసరగా... అతని భార్య నేహా బ్యాటింగ్ చేస్తుండడం వైరల్‌గా మారింది. (చదవండి : బంతి జెర్సీలో దాచి పరుగు పెట్టాడు) కాగా ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడిన వరుణ్ చక్రవర్తి మంచి ప్రదర్శన నమోదు చేశాడు. సీజన్లో 13 మ్యాచ్‌లాడిన వరుణ్ 6.84 ఎకానమీతో బౌలింగ్ చేసి 17 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తికి టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌కి తొలుత వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు.. అనూహ్యంగా అతను గాయపడడంతో అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్‌కు అవకాశం కల్పించారు. View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
కాజల్ పెళ్లి ఫోటోలు వైరల్...
అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన కాజల్ అగర్వాల్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా ముగిసింది. ‘చందమామ’ పెళ్లి అయిపోయింది. చిరకాల స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో కలిసి ఏడడుగులు వేశారు. మూడు ముళ్ల బంధంతో సరికొత్త ప్రయాణానికి నాంది పలికారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో కాజల్ పెళ్లి ఫోటోలు వైరల్‌గా మారాయి. ముంబైలోని ఓ ఖరీదైన హోటల్ని తమ బిగ్డేకి వేదికగా ఎన్నుకున్నారు. ఇక కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అన్ని నియమాలను పాటిస్తూ.. అత్యంత సన్నిహితుల మద్య ‘చందమామ’ మిసెస్‌గా మారిపోయారు. ఇక వివాహ వేడుకకి గౌతమ్ కిచ్లు ఆఫ్-వైట్ అండ్ సిల్వర్ కలర్ షెర్వానీని ఎంచుకోగా, కాజల్ అగర్వాల్ ప్రకాశవంతమైన ఎరుపు రంగు లెహంగాలో తళుక్కుమన్నారు. ఈ జంటను చూసిన వారంతా ‘మేడ్ ఫర్ ఇచ్ అదర్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక వివాహానికి ముందు ఈ జంట సంగీత్, హల్దీ వేడుకలను నిర్వహించారు. నిషా అగర్వాల్, గౌతమ్‌తో పాటు మరి కొందరు స్నేహితులతో కలిసి కాజల్ ఈ వేడుకలో ఫుల్ ఎంజాయ్ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరలయ్యాయి. (చదవండి: వేడుకల వేళ... ఆనందాల హేల) కొత్త ఇంట్లో.. కొత్త జీవితం.. వివాహం అనంతరం కాజల్, గౌతమ్ కిచ్లులు కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. ఇందుకు గాను ఈ జంట ఇప్పటికే ముంబైలో కొత్త ఇంటిని సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడమే కాక ఎనీ సజేషన్స్ అంటూ అభిమానులను సలహా కోరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం గౌతమ్ కిచ్లు తమ కొత్త ఇంటి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.అతను తమ బెడ్రూం బిఫోర్ అండ్ ఆఫ్టర్’' ఫోటోను షేర్ చేశాడు. దీనిలో పెద్ద టీవీ సెట్ కొన్ని అందమైన నైట్ లాంప్స్ ఉన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లికి ముస్తాబవుతున్న కాజల్..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికల్లో ఒకరుగా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ తన పెళ్లి విషయం గురించి చెప్పనప్పటి నుంచి అభిమానుల్లో ఆసక్తి ఆమంతం పెరిగి పోయింది. కొంతమంది అయ్యో మా చందమామకు అప్పుడే పెళ్లి అయిపోతుందనే బాధతో ఉంటే మరికొందరు ఇప్పటికైనా పెళ్లి బంధంలోకి అడుగుపెడుతందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారం రోజుల నుంచి కాజల్ అగర్వాల్ పెళ్లి వార్తనే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి ఎలా జరగబోతుంది. ఎవరెవరు హాజరుకానున్నారు. ఏయే వేడుకలు నిర్వహించనున్నారు.. ఇలా ప్రతిదీ ఇంట్రస్టింగ్‌గా మారింది. ఈ క్రమంలో కాజల్ తన బ్యాచిలర్ జీవితానికి బైబై చెప్పే రోజు రానే వచ్చింది. నేడే చందమామ మూడు ముళ్లు, ఏడడుగుల బంధంతో గౌతమ్ కిచ్లుకు భార్యగా మారనుంది. చదవండి: వేడుకల వేళ... ఆనందాల హేల పెళ్లికి అన్ని ఏర్పాటు పూర్తి చేసుకున్నారు. శుక్రవారం కాజల్ తన చిరకాల స్నేహితుడు గౌతమ్ కిచ్లును కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహామాడానున్నారు. ఇందుకు ఇప్పటికే ముంబైలోని తన నివాసం నుంచి పెళ్లి జరగబోయే హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ పెళ్లికి ముందే నిర్వహించే సంగీత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తాజాగా పెళ్లి కూతురుగా తయారయ్యే ముందు దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘తుఫాను సంభవించే ముందు ఉండే నిశ్శబ్ధం’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫోటోలో చేతికి గాజులు, ముఖానికి బొట్టు, నుదుటిన పాపిట బిళ్ళ అలంకరించి పెళ్లి దుస్తులు ధరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ లుక్‌లో కాజల్ రిచ్, గ్రాండ్‌గా కనిపస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు కుందనపు బొమ్మలా ఉందని కామెంట్ చేస్తున్నారు. దీనికంటే ముందు మెహెందీ, హల్దీ ఫంక్షన్ నిర్వహించగా వీటన్నింటికి చెందిన ఫోటోలను కూడా కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్చేస్తూ వస్తోంది. కాజల్ ఇంట్లో హల్దీ వేడుక.. వైరల్ View this post on Instagram Calm before the storm 🤍#kajgautkitched A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on Oct 30, 2020 at 2:59am PDT -
కాజల్ ఇంట్లో హల్దీ వేడుక.. వైరల్
మరికొన్ని గంటల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై చెప్పనున్నారు. రేపు చందమామ కాజల్ అగర్వాల్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహమాడనున్న విషయం తెలిసిందే. పెళ్లి పనులన్నీ కాజల్ సోదరి నిషా అగర్వాల్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే కాజల్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా బుధవారం మెహెందీ ఫంక్షన్ నిర్వహించగా.. నేడు(గురువారం) హల్దీ, వేడుకలను నిర్వహించారు. పసుపు రంగు దుస్తులు, పువ్వుల రూపంలో ఏర్పాటు చేసిన జ్యూవెల్లరీతో కాజల్ నిజంగా చందమామలా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి : మెహందీ వేడుక అయిపోంది.. ఇవాళ హల్ది ఫంక్షన్ కాగా కాజల్ హల్దీ ఫోటోలను ఆమె అభిమానులు రీపోస్టు చేస్తూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కోవిడ్ నేపథ్యంలో కాజల్ తన వివాహాన్ని నిడారంబరంగా జరుపుకోబుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ముంబైలో ఈ వేడుక జరగనుంది. ఇక తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. ఇకముందు కూడా తనను ఆదరిస్తారిస్తారని ఆకాంక్షిస్తున్నానని కాజల్ పేర్కొంది View this post on Instagram @kajalaggarwalofficial 's haldi ceremony... 💛💛💛 Do follow and support @celebrity_corner_official . . . . #kajal #kajalaggarwal #gauthamkitchlu #kajgautkitched A post shared by Celebrity corner (@celebrity_corner_official) on Oct 29, 2020 at 4:06am PDT -
కాజల్ పెళ్లికి టాలీవుడ్ యంగ్ హీరో!
2014లో విడుదలైన అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆ హీరో తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు తనతోపాటు రెండు చిత్రాల్లో కలిసి నటించిన కాజల్ అగర్వాల్. చదవండి: పెళ్లి డేటు చెప్పిన కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్, శ్రీనివాస్ మంచి స్నేహితులు. కాబట్టి ఆమె పెళ్లికి హాజరుకాబోతున్న అతిథులలో తాను కూడా ఒకడిని అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ పెళ్లి నాటికి వీలు చేసుకొని తప్పక ముంబై వెళతానని స్పష్టం చేశారు. ‘కాజల్ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా కుటుంబంలోని వ్యక్తితో సమానం. కాజల్‌కు మంచి జీవిత భాగస్వామి దొరకడం సంతోషంగా ఉంది. గౌతమ్ గొప్ప వ్యక్తి. వారిద్దరికీ నా శుభాకాంక్షలు. నేనిప్పుడు షూటింగ్లో ఉన్నాను. కానీ విరామం తీసుకుని కాజల్ పెళ్లికి హాజరు కావాలి. మిగిలిన పనుల కోసం తన పెళ్లి మిస్ చేయలేను’ అంటూ పేర్కొన్నారు. చదవండి: ఇల్లు సర్దుతున్నాం.. ఎనీ సజేషన్స్? కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న ముంబైకు చెందిన బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లును వివాహామాడనున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అతితక్కువ మంది బంధువులు సమక్షంలో ముంబైలో ఈ వేడుక జరగనుంది. అంతేగాక కేవలం 20 మందిని మాత్రమే పెళ్లికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మరోవైపు కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత రెండు వారాల తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. చదవండి: ‘అల్లుడు అదుర్స్’లోకి సోనూ సూద్ ఎంట్రీ -
డిసెంబర్లో నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్..
మెగా కుటుంబంలో రెండు నెలల్లో పెళ్లి బజాలు మొగనున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డిసెంబర్లో నిహారిక కొణిదెల, చైతన్యల వివాహం చేసుకుబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మెగా ఫ్యామిలిలో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, దగ్గరి బంధువుల సమక్షంలో నిహారిక-చైతన్యల వివాహం జరగనుంది. ఇదిలా ఉండగా ఆగష్టు 13న ఈ జంట నిశ్చితార్థం చేసుకోగా ఈ కార్యక్రమానికి రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్- స్నేహ, సాయిధరమ్తోపాటు కుటుంబ సభ్యులు హాజరైన విషయం తెలిసిందే. చదవండి: ఇక సమయం లేదు ప్రియతమా! పెళ్లికి ఎవరిని ఆహ్వనించాలనే విషయంలో నాగబాబు దంపతులు బిజీగా ఉండగా.. పెళ్లి పనులన్నింటిని నిహారిక సోదరుడు, హీరో వరుణ్‌తేజ్ దగ్గరుండి చూసుకుటుంన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వెలుపల గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వరుణ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందుకు రెండు, మూడు ప్రదేశాలను ఆలోచిస్తున్నాడని, ఈ నెలాఖరులోగా తుది నిర్ణయం తీసుకోనుట్లు తెలుస్తోంది. ఇంకేముంది త్వరలోనే చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయనున్నారు. మరోవైపు ఇప్పటికే టాలీవుడ్ నటులు రానా, నితిన్, నిఖిల్, వంటి వారంతా ఓ ఇంటి వారవడంతో నిహారిక పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్ -
రానా-మిహికా పెళ్లి; వీరికి మాత్రమే ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో, దగ్గుబాటి వారసుడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్‌తో ఈ నెల 8న ఏడడుగులు వేయనున్నారు. పెళ్లికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో పనులన్నీ చకాచకా జరుతున్నాయి. ఇక ‘మేం ప్రేమలో ఉన్నాం’ అని రానా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం, ఆ తర్వాత పెద్దలు కలుసుకుని, పెళ్లి ముహూర్తం ఖరారు చేయడం తెలిసిందే. అయితే పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగబోతుందని, వివాహానికి ఎంతో మంది అతిథులు వస్తున్నారనే వార్తలు ఇటీవల వినిపించడంతో ఈ వదంతులపై రానా తండ్రి సురేష్ బాబు స్పందించారు. రోకా ఫంక్షన్ నిర్వహించిన రామానాయుడు స్టూడియోలోనే వివాహ వేడుక జరగనుందని ఆయన స్పష్టం చేశారు. (రానా-మిహికా ప్రీ వెడ్డింగ్ సందడి షురూ!) సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘వివాహానికి కేవలం 30 మంది మాత్రమే హాజరవుతారు. ఇరు కుటుంబ సభ్యులు మినహా అతిథులు ఎవరూ ఉండరు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతుండటం వల్ల ఈ పెళ్లి వేడుకలో ఎవరి ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేయాలని మేం అనుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీలో, బయట ఉన్న మా అత్యంత సన్నిహితులను కూడా ఆహ్వానించడం లేదు. పెళ్లి చాలా సింపుల్‌గా జరుగుతుంది. కానీ, అంతే అందంగా కూడా ఉంటుంది’ అని సురేష్ బాబు చెప్పారు. (మిహికా.. ముందు షాక్ అయ్యింది: రానా) కాగా పెళ్లి వేడుక మొత్తాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని దగ్గుబాటి కుటుంబం ఆలోచిస్తుంది. కరోనా నేపథ్యంలో పెళ్లిలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘పెళ్లికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కచ్చితంగా కోవిడ్-19 పరీక్ష చేయించుకుంటారు. వివాహ వేదిక వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నాం. భౌతిక దూరాన్ని పాటిస్తాం. ఇది ఎంతో సంతోషంగా జరుపుకునే వేడుక కాబట్టి దీన్ని అత్యంత భద్రత కలిగిన పండుగగా మారుస్తాం’ అని తెలిపారు. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా పార్టీని నిర్వహిస్తామని సురేష్ బాబు వెల్లడించారు. (రానా రోకా ఫంక్షన్: సామ్ ఫుల్ హ్యాపీ) View this post on Instagram And it’s official!! 💥💥💥💥 A post shared by Rana Daggubati (@ranadaggubati) on May 20, 2020 at 11:00pm PDT View this post on Instagram To the beginning of forever 💕 @ranadaggubati A post shared by miheeka (@miheeka) on May 20, 2020 at 11:28pm PDT -
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన ప్రధాని
హెల్సెంకీ: ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ఓ ఇంటివారయ్యారు. తన చిరకాల స్నేహితుడు, సాకర్ ఆటగాడు మార్కస్ రాయ్కెన్ను వివాహమాడారు. ఈ విషయాన్ని సనా మారిన్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘నేను ప్రేమించే వ్యక్తితో జీవితం పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’’అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పెళ్లి ఫొటోలు షేర్ చేశారు. సుఖ దుఃఖాల్లో ఒకరికొకరు అండగా నిలబడ్డ తాము ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సనా మారిన్- మార్కస్ల వివాహం ప్రధాని అధికారిక నివాసం(కేసరంట)లో అత్యంత నిరాడంబరంగా జరిగినట్లు సమాచారం. శనివారం జరిగిన ఈ వేడుకలో వధూవరులకు అత్యంత సన్నిహితులైన 40 మంది అతిథులు పాల్గొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇక ఫిన్లాండ్ ప్రభుత్వం సైతం కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్లో ఫొటోను షేర్ చేసింది. పెళ్లిలో వధువు సనా మారిన్ పొడవాటి తెలుపు రంగు గౌనులో తళుకులీనగా.. వరుడు మార్కస్ క్లాసిక్ టక్సిడో సూట్లో హుందాగా కనిపించారు. కాగా పదహారేళ్లుగా కలిసి ఉంటున్న వీరిద్దరికి ఎమ్మా అమైలా మారిన్ అనే రెండేళ్ల కూతురు ఉంది. తమ పద్దెనిమిదవ ఏటనే ప్రేమలో పడిన వీరు శనివారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక గతేడాది డిసెంబరులో ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా మారిన్.. ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్సులో(34) అత్యున్నత పదవి అలంకరించిన మహిళగా చరిత్రకెక్కారు. సోషల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఆమె.. కాట్రీ కుల్ముని(32-సెంటర్ పార్టీ), లీ అండర్సన్(32- లెఫ్ట్ అలయన్స్), మారియా ఓహిసాలో(34- గ్రీన్ లీగ్), అన్నా మజా హెర్నిక్సన్(55- స్వీడిష్ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఫిన్లాండ్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నారు. -
పెళ్లైన 2 రోజులకే వరుడు మృతి, 95 మందికి..
పట్నా : కోవిడ్-19 నిబంధనలను అతిక్రమించి మరి ఇటీవల ఓ జంట కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతిచెందాడు. దీంతో అసలు విషయమంతా బయటపడింది. పెళ్లికి హాజరైన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 95 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వివరాల్లోకెళితే... బిహార్ రాష్ట్రంలోని పాలిగంజ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురుగ్రామ్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోకుండా జూన్ 15న వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక జరిగిన రెండు రోజులకు వరుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పట్నాలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. (కరోనా: భారత్‌లో కొత్తగా 18,522 పాజిటివ్ కేసులు) వరుడు మరణించడంతో అధికారులకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు అతడి దహన సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ప్రభుత్వ అధికారులు వివాహానికి హాజరైన దగ్గరి బంధులవులకు కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. వీరిలో 15 మందికి పాజిటివ్‌గా తేలగా అతిథులందరికీ పరీక్షలు చేశారు. వీరిలో సోమవారం 80 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. పెళ్లికి హాజరైన వారిలో 95 మంది కరోనా బారిన పడినట్లు రిపోర్టులు వెలువడగా పెళ్లి కూతురుకి మాత్రం నెగిటివ్ వచ్చింది. (చైనాను కలవరపెడుతోన్న మరో వైరస్) ఇక ఈ విషయంపై అధికారులు మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేవలం 50 మంది మాత్రమే వివాహానికి హాజరవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి వివాహ వేడుక జరిగిందన్నారు. అలాగే భౌతిక దూరం కూడా పాటించకపోవడం వల్లే ఇన్నీ కేసులు వెలుగు చూశాయని అన్నారు. కాగా రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. (తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా) -
వివాహా కార్యక్రమానికి హాజరైన గవర్నర్ దంపతులు
రంగారెడ్డి(శామీర్‌పేట్): ‘ది హిందూ’ ఆంగ్ల దినపత్రిక హైదరాబాద్ మాజీ రెసిడెంట్ ఎడిటర్ ఎస్.నాగేశ్‌కుమార్ దంపతుల కూతురు హరిణి వివాహం శరత్‌తో ఆదివారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలంలోని తూంకుంటలోని అలంకృతా రిసార్ట్స్‌లో జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, వల్లీశ్వర్, ఐ.వెంకట్రావ్, పలు పార్టీల ముఖ్యనేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.