ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ‘పెళ్లి’ అనేది ‘నూరేళ్ల పంట’ అనీ, ‘నూరు ఏళ్లపాటు సాగవలసిన పంట’ అనీ అంటారు. అలాగే ‘శత ఆయుష్మాన్ భవ’ - ‘ వంద సంవత్సరాలు ఆనందంగా జీవించు’ అనేది పెద్దలందరూ పిల్లలకిచ్చే ఆశీర్వాదం. ఇక పెళ్లి సందడి గురించి చెప్పాలంటే అసలు సమయమే సరిపోదు. అయితే తాజాగా ఓ వరుడు, అతని స్నేహితులు పెళ్లి వేదిక వద్దకు తాగి రావడంతో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)లో ఓ 22 ఏళ్ల యువతి పెళ్లికి నిరాకరించింది. వివాహా నిశ్చయానికి ముందు ఇచ్చిన బహుమతులు తిరిగి ఇవ్వడానికి అంగీకరించే వరకు వదువు కుటుంబం వరుడి తరుపు వాళ్లని బందీగా ఉంచింది. దీంతో పెళ్లికొడుకు కుటుంబం పోలీసులను పిలిచి సమస్యను పరిష్కరించమని అభ్యర్థించింది. తిక్రీ గ్రామంలోని ఒక రైతు తన కుమార్తె వివాహాన్ని రవీంద్ర పటేల్ అనే వ్యక్తితో ఏర్పాటు చేశాడు.
అయితే పెళ్లి రోజున వరుడు, అతని స్నేహితులు కొందరు తాగి పెళ్లి మండపం వద్దకు వచ్చారు. వధువు, ఆమె కుటుంబం పెళ్లి కొడుకు, అతని స్నేహితులు చేసే చేష్టలకు చాలా సార్లు హెచ్చరించారు. అయితే పెళ్లికి కొద్ది నిమిషాల ముందు వరుడు వధువును డ్యాన్స్ చేయమని బలవంతం చేయడంతో పరిస్థితి మలుపు తిరిగింది. పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడానికి నిరాకరించింది. అయితే వరుడు విసిగెత్తి.. బీభత్సం సృష్టించాడు. దీంతో అతని ప్రవర్తనకు విసుగెత్తిన వధువు పెళ్లికి నిరాకరించింది. అయితే ఈ విషయాన్ని పరిష్కరించడానికి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక చివరకు వరుడి కుటుంబం పెళ్లికి ముందు తీసుకున్న నగదు, ఇతర వస్తువులను పెళ్లి కుమార్తె కుటుంబానికి తిరిగి ఇవ్వడానికి అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. కానీ పెళ్లి ఆగిపోయింది.
(చదవండి: దారుణం: భార్యా.. పిల్లలను బావిలో నెట్టివేసి భర్త.. ఆపై రాళ్ల దాడి)
Comments
Please login to add a commentAdd a comment