
పూణె : కరోనా నిబంధనలు పాటించాలని కేంద్రం ఓ వైపు హెచ్చరికలు చేస్తున్నా సొంతపార్టీ నేతలే వాటిని బేఖాతరు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సోలాపూర్‌లోని మల్షిరాస్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే రామ్ సత్పుటే వివాహం సోమవారం పూణెలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు హాజరైన బీజేపీ అగ్రనేతలు చాలామంది కరోనా నిబంధనల్ని బ్రేక్ చేశారు. మాస్కులు ధరించకపోవడంతో పాటు కనీసం భౌతికదూరం కూడా పాటించలేదు. (‘భారత్‌లో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్’ )
అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం, వివాహ వేడుకకు 50 మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, వెయ్యి మందికి పైగా రిసెప్షన్‌కు హాజరయ్యారు. వీరిలో మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సహా మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. నిబంధనల్ని తుంగలో తొక్కి గుంపులు, గుంపులుగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియలో వైరల్ కావడంతో నెటిజన్లు పలువురు నేతలను ట్రోల్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ఇక ప్రజలకేం చెబుతారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. (దారుణం: చూస్తుండగానే దడేల్, దడేల్! )
Comments
Please login to add a commentAdd a comment