
ప్రపంచ అత్యంత పొట్టి బాడీబిల్డర్‌గా పేరుపొందిన ప్రతీక్ విట్టల్ మోహిత్ వివాహ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ప్రతీక్ విట్టల్ ఎత్తు కేవలం 3 అడుగుల 4 అంగుళాలు మాత్రమే. కాగా ప్రతీక్ పెళ్లి చేసుకున్న యువతి ఎత్తు 4 అడుగుల రెండు అంగుళాలు.
నాలుగేళ్ల క్రితం ఈ ఇద్దరికీ పరియమైంది. ఆ తర్వాత ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించడంతో ప్రతీక్ విట్టల్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. పెళ్లి కుమారుడి దుస్తుల్లో ఓ వాహనంపై నిలుచుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేసి వార్తల్లో నిలిచాడు.
ప్రతీక్ తన బాడీబిల్డింగ్ కేరీర్‌ను 2012లో మొదలుపెట్టాడు. 2016లో తొలిసారి కాంపిటీషన్‌లో పాల్గొన్నాడు. బాడీబిల్డర్‌గా ప్రతీక్ 2021లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను అందుకున్నాడు. పురుషుల విభాగంలో షార్టెస్ట్ కాంపిటీటివ్ బాడీబిల్డర్(Shortest Competitive Bodybuilder) టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఓ మంచి ఉద్యోగంలో చేరి జయను బాగా చూసుకోవాలంటూ ప్రతీక్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment