short man
-
ప్రపంచ పొట్టి బాడీబిల్డర్ వివాహం.. వీడియో వైరల్
ప్రపంచ అత్యంత పొట్టి బాడీబిల్డర్‌గా పేరుపొందిన ప్రతీక్ విట్టల్ మోహిత్ వివాహ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ప్రతీక్ విట్టల్ ఎత్తు కేవలం 3 అడుగుల 4 అంగుళాలు మాత్రమే. కాగా ప్రతీక్ పెళ్లి చేసుకున్న యువతి ఎత్తు 4 అడుగుల రెండు అంగుళాలు. నాలుగేళ్ల క్రితం ఈ ఇద్దరికీ పరియమైంది. ఆ తర్వాత ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించడంతో ప్రతీక్ విట్టల్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. పెళ్లి కుమారుడి దుస్తుల్లో ఓ వాహనంపై నిలుచుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేసి వార్తల్లో నిలిచాడు. ప్రతీక్ తన బాడీబిల్డింగ్ కేరీర్‌ను 2012లో మొదలుపెట్టాడు. 2016లో తొలిసారి కాంపిటీషన్లో పాల్గొన్నాడు. బాడీబిల్డర్‌గా ప్రతీక్ 2021లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను అందుకున్నాడు. పురుషుల విభాగంలో షార్టెస్ట్ కాంపిటీటివ్ బాడీబిల్డర్(Shortest Competitive Bodybuilder) టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఓ మంచి ఉద్యోగంలో చేరి జయను బాగా చూసుకోవాలంటూ ప్రతీక్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Pratik Mohite (@pratikmohite_official) View this post on Instagram A post shared by Pratik Mohite (@pratikmohite_official) -
శభాష్... శివలాల్
సాక్షి, హైదరాబాద్: అతని ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. కష్టపడేతత్వం ఉండాలే గానీ... ఎన్ని సమస్యలొచ్చినా ఎదురీదొచ్చని నిరూపించాడు అతడు. రాష్ట్రంలో 300 మంది మరుగుజ్జులు ఉండగా, వారిలో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా ఘనత సాధించారు గట్టిపల్లి శివలాల్(35). జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన శివలాల్ బీకామ్ పూర్తిచేసి, పీజీడీసీఏ చేశాడు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లోని డెక్కన్ ట్రయల్స్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన శివలాల్... తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంతో నగరానికొచ్చి ఉద్యోగంలో చేరాడు. సంస్థ ఎండీ ప్రోత్సాహం, సహోద్యోగుల సహకారంతో ఆయన 12 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్నాడు. శివలాల్.. చిన్మయి అనే మరుగుజ్జు అమ్మాయినే వివాహమాడాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న శివలాల్‌కు సొంతిల్లు కూడా లేదు. బంజారాహిల్స్‌రోడ్ నెంబర్.11లోని ఉదయ్‌నగర్‌లో అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాడు. తమలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, ఏదైనా ఉపాధి కల్పించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని శివలాల్ వేడుకుంటున్నాడు. నడుచుకుంటూ ఆఫీస్‌కు.. ఇంటికి సమీపంలోనే కార్యాలయం ఉండటంతో శివలాల్ రోజూ నడుచుకుంటూనే వెళ్తుంటాడు. దారి పొడవునా తనను చాలా మంది వింతగా చూస్తుంటారని, అవేమీ తాను పట్టించుకోనన్నారు. అయితే ఆఫీస్‌లో సహోద్యోగులంతా తనకెంతో ధైర్యాన్ని ఇస్తారన్నాడు. టైప్ నేర్చుకునేప్పుడు పొట్టివేళ్లు పనికిరావని తిట్టిన నిర్వాహకులకు నిమిషానికి 80–100 పదాలు కొట్టి సవాల్ విసిరాడు. గుండె ధైర్యంతో అన్నింటినీ జయిస్తున్న శివలాల్ ఎక్కడా సిగ్గుపడకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాడు. -
'బ్రాల దొరసాని'కి బుడ్డోడి షాక్!
అల్టిమో లింగరీస్ చైన్ ఓనర్, ఇన్నర్ వేర్ బిజినెస్ టైకూన్ మిచెల్లీ మూన్ (44) ను రెండున్నర అడుగుల బుడ్డోడు కంగుతినిపించాడు. 'బ్రాల దొరసాని'గా ప్రపంచ ఖ్యాతి పొందిన మిచెల్లీ తన వ్యాపార విస్తరణతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు పర్యటిస్తుంది. అందులో భాగంగా శనివారం వియత్నం వెళ్లింది. భారీ ఎత్తున ఏర్పాటుచేసిన వేదికపై నుంచి దాదాపు 3000 మంది ప్రతినిధులను ఉద్దేశించి ఆమె మాట్లాడాల్సిఉంది. స్టేజ్ పైకి వచ్చిన ఆమెకు స్వాగతం పలికేందుకు ఓ బుడ్డోడు ఫ్లవర్ బొకేను తీసుకెళ్లి ఆమె చేతుల్లో పెట్టాడు. చిన్నవాడి చర్యకు తబ్బిబ్బైన ఆ మహిళా వ్యాపారవేత్త అమాతం అతన్ని ఎత్తుకుని, ముద్దులాడి సెల్ఫీ తీసుకుంది. అక్కడే ఆమె పప్పులో కాలేసింది! 'దయచేసి నా భర్తను కిందికి దింపండి..' అంటూ ఓ మహిళ అభ్యర్థించేసరికి విస్తుపోయిందట మిచెల్లీ మూన్. అవునుమరి, ఆ బుడ్డోడు బుడ్డోడుకాదు.. 46 ఏళ్ల పొట్టివాడు. భార్యాపిల్లలున్న అసలుసిసలు గృహస్తుడు. కొద్ది నిమిషాల తర్వాతగానీ షాక్ నుంచి తేరుకున్న 'బ్రాల దొరసాని' తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా నెటిజనులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి బుడ్డోడి భార్య భలే షాక్ ఇచ్చిందికదా.. బ్రాల దొరసానికి! అన్నట్లు.. మిచెల్లీ మూన్ బ్రిటన్ ఎంపీ కూడా!