'బ్రాల దొరసాని'కి బుడ్డోడి షాక్! | ‘Baroness Bra’ Michelle Mone experience with short man in Vietnam | Sakshi
Sakshi News home page

'బ్రాల దొరసాని'కి బుడ్డోడి షాక్!

Published Sun, May 8 2016 2:02 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

‘Baroness Bra’ Michelle Mone experience with short man in Vietnam

అల్టిమో లింగరీస్ చైన్ ఓనర్, ఇన్నర్ వేర్ బిజినెస్ టైకూన్ మిచెల్లీ మూన్ (44) ను రెండున్నర అడుగుల బుడ్డోడు కంగుతినిపించాడు. 'బ్రాల దొరసాని'గా ప్రపంచ ఖ్యాతి పొందిన మిచెల్లీ తన వ్యాపార విస్తరణతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు పర్యటిస్తుంది. అందులో భాగంగా శనివారం వియత్నం వెళ్లింది. భారీ ఎత్తున ఏర్పాటుచేసిన వేదికపై నుంచి దాదాపు 3000 మంది ప్రతినిధులను ఉద్దేశించి ఆమె మాట్లాడాల్సిఉంది. స్టేజ్ పైకి వచ్చిన ఆమెకు స్వాగతం పలికేందుకు ఓ బుడ్డోడు ఫ్లవర్ బొకేను తీసుకెళ్లి ఆమె చేతుల్లో పెట్టాడు. చిన్నవాడి చర్యకు తబ్బిబ్బైన ఆ మహిళా వ్యాపారవేత్త అమాతం అతన్ని ఎత్తుకుని, ముద్దులాడి సెల్ఫీ తీసుకుంది. అక్కడే ఆమె పప్పులో కాలేసింది!

'దయచేసి నా భర్తను కిందికి దింపండి..' అంటూ ఓ మహిళ అభ్యర్థించేసరికి విస్తుపోయిందట మిచెల్లీ మూన్. అవునుమరి, ఆ బుడ్డోడు బుడ్డోడుకాదు.. 46 ఏళ్ల పొట్టివాడు. భార్యాపిల్లలున్న అసలుసిసలు గృహస్తుడు. కొద్ది నిమిషాల తర్వాతగానీ షాక్ నుంచి తేరుకున్న 'బ్రాల దొరసాని' తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా నెటిజనులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి బుడ్డోడి భార్య భలే షాక్ ఇచ్చిందికదా.. బ్రాల దొరసానికి! అన్నట్లు.. మిచెల్లీ మూన్ బ్రిటన్ ఎంపీ కూడా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement