SRH Pacer Sandeep Sharma Ties Knot With Girl Friend Tasha Sathwick - Sakshi
Sakshi News home page

Sandeep Sharma: ఇంటివాడైన సన్‌రైజర్స్‌ బౌలర్‌ సందీప్‌ శర్మ

Published Fri, Aug 20 2021 12:46 PM | Last Updated on Mon, Sep 20 2021 11:48 AM

SRH Pacer Sandeep Sharma Ties Knot With Girl Friend Tasha Sathwick - Sakshi

Sandeep Sharma Marriage.. టీమిండియా ఆటగాడు.. సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ బౌలర్‌ సందీప్‌ శర్మ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్‌ యాజమాన్యం సందీప్‌కు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.

సందీప్‌.. అతని భార్య తాషా సాత్విక్‌ పెళ్లి ఫోటోను షేర్‌ చేస్తూ.. ''ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యామిలీకి పెళ్లి కళ వచ్చింది. కంగ్రాట్స్‌ మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ సందీప్‌ శర్మ.. మీ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్‌ చేసింది. కాగా తాషా సాత్విక్‌ వృత్తిరిత్యా ఫ్యాషన్‌,నగల డిజైనర్‌గా పనిచేస్తున్నారు. 2018లోనే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ అయినప్పటికీ.. కరోనా కారణంగా వీరి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా సందీప్‌ శర్మకు అభిమానులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

ఇక సందీప్‌ శర్మ 2013 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 95 ఐపీఎల్‌ మ్యాచ్‌లాడిన సందీప్‌ శర్మ 110 వికెట్లు తీశాడు. 2013 నుంచి 2017 వరకు కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌కు ఆడిన సందీప్‌ ఆ తర్వాత 2018 నుంచి సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. ఇక జూలై 17, 2015లో జింబాబ్వేతో జరిగిన T20 మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.  
చదవండి: రనౌట్‌ కోసం థర్డ్‌ అంపైర్‌కు అప్పీల్‌; స్క్రీన్‌పై మ్యూజిక్‌ ఆల్బమ్‌

(ఫోటో గేలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement