
‘అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్’ వంటి పలు చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ బ్యూటీ ప్రణీత. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించిన ప్రణీత మలయాళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. మలయాళ స్టార్ హీరో దిలీప్, దర్శకుడు రతీష్ రఘునందన్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది.
చదవండి: నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే: నయన్ సెన్సేషనల్ కామెంట్స్
దిలీప్ కెరీర్‌లో 148వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రణీత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘‘మాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మలయాళంలో డైలాగ్స్ చెప్పడం కాస్త కష్టంతో కూడినపనే.. ప్రస్తుతం నా ముందున్న చాలెంజ్ అదే. ఈ మూవీలో కాస్త అహం ఉన్న యువతి పాత్రలో కనిపిస్తాను.
చదవండి: కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం
నేను అమ్మగా మారిన తర్వాత ఒప్పుకున్న తొలి సినిమా ఇది. ఈ మూవీ కోసం నా కుమార్తె ఆర్నాకు దూరంగా ఉండాల్సి వస్తోంది. అయితే వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని నేను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను.. ఇందుకోసం కష్టపడతాను’’ అని పేర్కొన్నారు ప్రణీత. కాగా 2021 మే 30న నితిన్ రాజును వివాహం చేసుకున్న ప్రణీత గత ఏడాది ఆర్నాకు జన్మనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment